ఆర్‌ఆర్‌ఆర్ టీమ్ విడుదల చేసిన కొత్త పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒకే బైక్‌పై చిరునవ్వులు చిందిస్తూ ఉన్న ఈ పోస్టర్ అభిమానుల్లో ఆసక్తిరేపుతోంది. తాజాగా ఈ పోస్టర్‌ని తమదైన శైలీలో వాడుకున్నారు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. బైక్‌పై వెళ్తున్న ఎన్టీఆర్, చెర్రీకి హెల్మెట్లు పెట్టి.. ఇప్పుడు ఫర్‌ఫెక్ట్‌గా ఉందంటూ ట్వీట్ చేసింది. హెల్మెట్ ధరించండి.. సురక్షితంగా ఉండండి అంటూ తమ ట్రేడ్ మార్క్ నినాదాన్ని క్యాప్షన్‌గా ఇచ్చింది. ప్రస్తుతం ట్రాఫిక్ పోలీసుల ట్వీట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు తమదైన శైలీలో స్పందిస్తున్నారు. ఇక ఈ ట్వీట్‌పై ఆర్‌ఆర్‌ఆర్ టీమ్ కూడా ఫన్నీగా స్పందించింది. ‘ఇప్పటికి అది పరిపూర్ణంగా లేదు. నెంబర్ ప్లేట్ మిస్సయింది’అంటూ ఫన్నీ కామెంట్ పెట్టింది.
Ramaraju & Bheem ❤️🔥🌊 #RRRMovie pic.twitter.com/5vrM662iGo
— RRR Movie (@RRRMovie) June 29, 2021
ఇక ఆర్‌ఆర్‌ఆర్ విషయానికి వస్తే.. దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ల భారీ మల్టీస్టారర్ చిత్రమిది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోన్న ఈ చిత్రంలో రామ్ చరణ్.. అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్.. కుమురం భీంగా దర్శనమివ్వనున్నారు. ఆలియా భట్, ఒలివియా మోరీస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అజయ్ దేవగణ్, శ్రియ కీలక పాత్రల్లో కనిపించునున్నారు.
Now it is perfect.
— CYBERABAD TRAFFIC POLICE సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (@CYBTRAFFIC) June 29, 2021
Wear Helmet. Be Safe.@RakeshGoudE @tarak9999 @AlwaysRamCharan @RRRMovie @ssrajamouli @DVVMovies #RRRMovie #JrNTR #RamCharan pic.twitter.com/LDa20NYxCg
Comments
Please login to add a commentAdd a comment