
Drunk And Drive Funny Video: మద్యం తాగి వాహనాలు నడపడం ఎంత ప్రమాదమో అందరికి తెలిసిందే. డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దంటూ పోలీసులు ఎన్ని రకాలుగా చెప్పిన తాగి నడిపే వారిలో మార్పు రావడం లేదు. అయితే తాగి బండి నడిపితే ఎదురయ్యే అనర్థాల గురించి హైదరాబాద్ పోలీసులు విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయినా కొందరు వాహనదారులు మాత్రం.. అయితే నాకేంటి అన్నట్లు… నిత్యం ఫూటుగా తాగి రోడ్లపైకి వస్తున్నారు. తాజాగా మద్యం సేవించి వాహనం నడుపుతున్న ఓ వ్యక్తి వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఉదయాన్నే మంద్యం తాగి, హెల్మెట్‌ను అద్దానికి తగిలించి, ద్విచక్ర వాహనంపై రోడ్డుమీదకొచ్చాడు ఓ ప్రబుద్ధుడు.
మద్యం మత్తులో ఊగుతూ.. తూలుతూ రోడ్డుపై వేగంగా వేళుతున్న కారులు, బైకులకు అడ్డంగా వస్తున్నాడు. రహదారిపై ఇష్టం వచ్చినట్లు డ్రైవింగ్ చూస్తూ ఇతరులకు ఇబ్బంది కలిగించాడు. ఈ సంఘటన ఇబ్రహీంపల్లి గేట్ వద్ద ఈనెల నాలుగున చోటుచేసింది. ఈ దృశ్యాలన్నీ అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ వీడియోను సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ‘కృష్ణగారి వీర డ్రైవింగ్ గాథ.. మద్యం మత్తులో’ అంటూ ట్విటర్‌లో షేర్ చేశారు. పోలీస్ టెక్నికల్ టీమ్ ఈ వీడియోకు బ్యాడ్రౌండ్ మ్యూజిక్, ఎమోజీలను జోడించి ‘మద్యం సేవించి వాహనం నడపొద్దు’ అంటూ అవగాహన కల్పించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment