సాక్షి, హైదరాబాద్: మీ క్షేమం.. భద్రత కోసం నిబంధనలు పాటించండి అని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నా వాహనదారుల తీరులో ఏమాత్రం మార్పు ఉండడం లేదు. భారీగా జరిమానాలు విధిస్తున్నా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. వారికి అదే తీరులో పోలీసులు బుద్ధి చెబుతున్నారు. తాజాగా ముగ్గురు ఒకే వాహనంపై హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తుండడంతో పాటు సెల్‌ఫోన్ వినియోగిస్తూ టైటానిక్ సినిమాలో మాదిరి స్టిల్ ఇచ్చారు. ఇది చూసిన పోలీసులు వెంటనే కెమెరాకు పని చెప్పారు. ఆ తర్వాత రూ.3,600 జరిమానా వారికి పంపారు.
సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ పరిధిలో ముగ్గురు యువకులు పల్సర్‌పై వెళ్తున్నారు. మధ్యలో కూర్చున్న యువకుడు డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి ముందు చేతులు పెట్టి సెల్‌ఫోన్ చూపిస్తున్నాడు. డ్రైవింగ్ చేస్తూ ఫోన్‌ను డ్రైవింగ్ చేస్తున్న యువకుడు పరిశీలిస్తున్నాడు. ఈ సీన్ అచ్చం టైటానిక్ సినిమాలో స్టిల్ మాదిరి కనిపించింది. ఈ విన్యాసం చూసిన పోలీసులు ఫొటో తీసి జరిమానా పంపించారు. పైగా వారు హెల్మెట్ కూడా ధరించలేదు. దీంతో అన్నీ కలిపి రూ.3,600 జరిమానా విధించారు. ఈ ఫొటోను సైబరాబాద్ పోలీసులు సోషల్ మీడియాలో పంచుకున్నారు. ‘రోడ్డుపై టైటానిక్ విన్యాసాలు.. పట్టు తప్పితే మునిగిపోతాయి ప్రాణాలు’ అని క్యాప్షన్ ఇచ్చారు.
జరిమానాలు ఇలా..
హెల్మెట్ ధరించకపోవడం: రూ.100
బైక్‌కు అద్దాలు లేకపోవడం: రూ.100
బైక్‌పై ముగ్గురు ప్రయాణం: రూ.1,200
సెల్‌ఫోన్ డ్రైవింగ్: రూ.1,000
మాస్క్ సక్రమంగా ధరించకపోవడం: రూ.1,000
చదవండి: ప్రాణం తీసిన అంబులెన్స్: నిండు గర్భిణి సహా..
రోడ్డు పై టైటానిక్ విన్యాసాలు.
— CYBERABAD TRAFFIC POLICE సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (@CYBTRAFFIC) June 10, 2021
పట్టు తప్పితే మునిగిపోతాయి ప్రాణాలు.#RoadSafety #RoadSafetyCyberabad pic.twitter.com/kzMzoclLCJ
Comments
Please login to add a commentAdd a comment