ఒక బైక్‌.. 42 చలానాలు | 42 Challans on Bike in Khairathabad Hyderabad | Sakshi

ఒక బైక్‌.. 42 చలానాలు

Aug 7 2019 1:09 PM | Updated on Aug 7 2019 1:09 PM

42 Challans on Bike in Khairathabad Hyderabad - Sakshi

ఖైరతాబాద్‌: ఓ ద్విచక్ర వాహనంపై ఏకంగా 42 చలానాలు ఉండటాన్ని గుర్తించిన సైఫాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు వాహనాన్ని సీజ్‌ చేశారు. మంగళవారం ఐమాక్స్‌ చౌరస్తాలో వాహన తనిఖీలు చేస్తుండగా ఓల్డ్‌సిటీకి చెందిన రాము అనే వ్యక్తికి చెందిన బైక్‌ (టీఎస్‌07ఈఎ2559) చలానాలు చెక్‌ చేయగా ఏకంగా 42 ఉన్నట్లు గుర్తించారు. దీనికి జరిమానా మొత్తం రూ.10,046 ఉన్నట్లు తేలడంతో వాహనాన్ని సీజ్‌ చేశారు. యజమాని మొత్తం చలానాలు చెల్లించిన అనంతరం వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ రాంబాబు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Video

View all
Advertisement