సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : శాంతిభద్రతల పరిరక్షణ ఎంత ముఖ్యమో ట్రాఫిక్ నియంత్రణకు అంతటి ప్రాధాన్యత ఉంటుంది. ఇలాంటి నేపథ్యంలో జిల్లా పోలీసులు ట్రాఫిక్ ని యంత్రణలో తూతూమంత్రంగా వ్యవహరిస్తున్నారు. ట్రాఫి క్ నియంత్రణ సక్రమంగా నిర్వహించకపోగా పోలీసులే ట్రా ఫిక్ సమస్యలు సృష్టించే పరిస్థితి నడుస్తోంది. ప్రతి కూ డలిలో ట్రాఫిక్ పోలీసులు ఉన్నప్పటికీ ట్రాఫిక్ మాత్రం నియంత్రణలో ఉండడం లేదు. పట్టపగలు భారీ వాహనాలు వెళ్తున్నా పట్టింపులేదు. ట్రాఫిక్ చలాన్ల ఫొటోలు తీయడం లక్ష్యంతోనే పనిచేస్తున్నారు.
ఎక్కడ చూసినా, ఏ సమయంలోనైనా, ఏ పోలీసు కానిస్టేబుల్ అయినా ఫొటోలు తీయడమే తమ కర్త వ్యమన్నట్లుగా వ్యవహరిస్తూ కనిపిస్తుండడం గమనార్హం. ఇక పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల వసూళ్లకు సంబంధించి పోలీసులు పలు చోట్ల తిష్ట వేసి తనిఖీలు చేస్తుండడంతో ప్రధాన రహదారులపై ట్రాఫిక్ సమస్యలు ఎక్కువవుతున్నాయి. ఫొటోలు తీసి, చలాన్లు వేసి, అందుకు సంబంధించిన జరిమానాలు వసూళ్లు చేయడమే లక్ష్యంగా ముందుకు వెళుతుండడం విశేషం.
ఇదిలా ఉండగా మరోవైపు బార్ షాపుల వద్ద కొందరు కానిస్టేబుళ్లు మఫ్టీలో ఉండి సమీపంలో ఉన్న పోలీసులకు సమాచారం ఇస్తున్నారు. అందుకు అనుగుణంగా పోలీసులు అడ్డాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ ద్వారా భారీగా జరిమానాలు వసూలు చేస్తున్నారు.
► ట్రాఫిక్ చలాన్లు పంపే విషయంలో ఒక విధానం లేకుండా పోయింది. ఇటీవల నిజామాబాద్ జిల్లా నందిపేటకు చెందిన గ్లామర్ బైక్ కలిగి ఉన్న ఒక వ్యక్తికి హెల్మెట్ ధరించనందుకు చలాన్ విధించినట్లు మెసేజ్ వచ్చింది. అయితే ఈ ఫొటో తీసింది మాత్రం హన్మకొండ జిల్లా కాజీపేటలో కావడం గమనార్హం. అది కూడా షైన్ బైక్ కావడం విశేషం. అసలు హన్మకొండకు వెళ్లని బైక్‌కు జరిమానా రావడం విడ్డూరం. పోలీసు శాఖ తప్పిదం అయినప్పటికీ చలాన్ మొత్తం చెల్లించాలని జిల్లా పోలీసులు చెబుతుండడం చిత్రంగా ఉంది. చెప్పుకుంటూ పోతే ఇలా ఇష్టం వచ్చినట్లు చలాన్లు వేసిన కేసులు కోకొల్లలు.కాగా ట్రాఫిక్ పెండింగ్ చలాన్లు వసూలు చేసే విషయంలో పోలీసులు కొందరు వాహనదారుల పట్ల దురుసుగా ప్రవర్తి స్తుండడంపై తీవ్ర విమర్శలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment