సాక్షి, హైదరాబాద్: ట్రాఫిక్ రూల్స్ పాటించాలని ఎంత మొత్తుకున్నా గానీ వాహనదారుల్లో మార్పు రావడం లేదు. జరిమానాలు కట్టేందుకైనా సిద్ధపడుతున్నారే తప్ప హెల్మెట్ ధరించడం, రాంగ్ రూట్ డ్రైవింగ్ మానుకోవడం, సిగ్నల్ జంప్ చేయకుండా ఉండటం వంటి కనీస నిబంధనలు పాటించకుండా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు చాలా మంది. తాజాగా ఇలాగే ఓ వ్యక్తి నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగా మృతిచెందాడు. రెడ్ సిగ్నల్ జంప్ చేసి బస్సుకు అడ్డంగా వెళ్లి విగతజీవిగా మారాడు.
ఈ ఘటన రామచంద్రాపురం(ఆర్‌సీ పురం)లో చోటుచేసుకుంది. స్కూటీపై రాంగ్ రూట్‌లో వస్తున్న బైకర్‌ను ఆర్టీసీ బలంగా ఢీకొట్టింది. దీంతో అతడు అక్కడిక్కడే మరణించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్విటర్‌లో షేర్ చేశారు. ‘‘ఇంకెంత కాలం ఇలా? ప్రమాదాల బారిన పడతారు’’ అంటూ నిబంధనలు పాటిస్తూ, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని విజ్ఞప్తి చేశారు.
చదవండి:
వాహనదారులకు షాక్ : శాశ్వతంగా లైసెన్సు రద్దు
సిగ్నల్ జంప్ చేసిన వాహనాలు.. ఒకరి మృతి
Opposite direction driving. Not strapping the helmet. Reckless driving at signal.
— CYBERABAD TRAFFIC POLICE సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (@CYBTRAFFIC) February 27, 2021
How long !?
The danger is just a whisker away.
At RC Puram#RoadSafety #RoadSafetyCyberabad
👉Youtube Link: https://t.co/8fLztszMwT pic.twitter.com/6TaXsANJBN
Comments
Please login to add a commentAdd a comment