సాక్షి, హైదరాబాద్ : ట్రాఫిక్ రూల్స్ సరిగా పాటించకుండా, పోలీసులకు దొరకకుండా తెలివిగా తప్పించుకునే ద్విచక్ర వాహనదారులకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ అధికారులు షాక్ ఇచ్చారు. ఇకపై చలాన్లను తప్పించుకోవటానికి నెంబర్ ప్లేటుపై ట్రిక్కులు చేయాలనుకుంటే తిక్క కుదురుతుందని హెచ్చరిస్తున్నారు. నెంబర్ ప్లేటు సరిగా లేని బైకులకు రూ. 200, ఉద్దేశ్యపూర్వకంగా బండి వివరాలను దాయాలని చూసేవారికి రూ. 500 ఫైన్ వేయనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ట్విటర్ ఖాతాలో ‘‘ అనుకున్నది ఒక్కటీ, అయినది ఒక్కటీ.. బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్ట ..’’ అంటూ ఓ ట్విట్‌ను చేశారు. చలాన్ల వివరాలను అందులో పేర్కొన్నారు. ( కంటతడి పెట్టుకున్న తెలంగాణ మంత్రి.. )
దీనిపై నెటిజన్లు కూడా తమ స్టైల్లో స్పందిస్తున్నారు..‘‘ హైదరాబాద్ పోలీసులనుంచి తప్పించుకోవటం కష్టం కాదు! అసాధ్యం.. ఇది మోసం సార్! అలాంటి వాళ్లను జైళ్లలో వేయాలి.. నగర పౌరులకు చలాన్లు విధించే డ్యూటీలో మీకు మీరే సాటి సార్!.. చున్నీలు చుట్టినా.. మాస్కులు కట్టినా ఇకపై లాభం ఉండదు’’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ( ఇలాంటి ఫ్యామిలీ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ )
అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి..
— CYBERABAD TRAFFIC POLICE సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (@CYBTRAFFIC) November 9, 2020
బోల్తా కొట్టింది లే బుల్ బుల్ పిట్ట...#RoadSafety #RoadSafetyCyberabad pic.twitter.com/H5gsDf3Gjv
Comments
Please login to add a commentAdd a comment