సాక్షి, హైదరాబాద్: హెల్మెట్ ధరించండి.. సీటు బెల్ట్ పెట్టుకోండి.. రోడ్డు మీద వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.. మద్యం సేవించి డ్రైవ్ చేయకండి అంటూ ట్రాఫిక్ అధికారులు ఎన్ని హెచ్చరికలు, జాగ్రత్తలు, సూచనలు చేసినా పట్టించుకోని వారు కోకొల్లలు. ట్రాఫిక్ అధికారులు చెప్పేది మన ప్రాణాలు కాపాడటం కోసమే. కానీ మనం వినకుండా ఇదిగో ఇలా ప్రాణాల మీదకు తెచ్చుకుంటాం. ఓ వ్యక్తి ఏమరపాటుగా రోడ్డు దాటుతున్నాడు. అదే సమయంలో అటువైపుగా ఓ బైకు వేగంగా వస్తోంది. బైక్ సమీపించడంతో పాదచారి పరుగెత్తుకెళ్లాడు. దాంతో బైక్ అతన్ని ఢీకొట్టి ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు దాటుతున్న వ్యక్తికి, బైకర్‌కి తీవ్ర గాయాలయ్యాయి.
బైక్ నడిపే వ్యక్తి హెల్మెట్ ధరించకపోవండంతో అతనికి తలకు తీవ్ర గాయాలయ్యాయి. అతను హెల్మెట్ ధరించి ఉంటే ఇంత తీవ్రంగా గాయపడేవారు కాదంటున్నారు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. పాదచారి నిర్లక్ష్యం, బైకర్ అతివేగమే ప్రమాదానికి కారణమని పేర్కొన్నారు. బైక్ మీద వెళ్తోన్నప్పుడు హెల్మెట్ ధరిచండం ఎంత ముఖ్యమో.. ప్రయాణం చేసేటప్పుడు చుట్టు పక్కల గమనించడం కూడా అంతే ముఖ్యమని.. లేదంటే మీతో పాటు మీ కుటుంబాలు కూడా బాధపడతాయంటూ ట్రాఫిక్ పోలీసులు మరో సారి హెచ్చరించారు. ఈ క్రమంలో ప్రమాదానికి సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఆదివారం మధ్యాహ్నం జీడిమెట్ల చింతల్‌లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
చదవండి:
రోడ్డు ప్రమాదంలో ఇద్దరిని కోల్పోయా: ఎన్టీఆర్
‘అయ్యా నీకో దండం.. ఇది బైకా ఎడ్ల బండా?
Comments
Please login to add a commentAdd a comment