పండగలాంటి సినిమా | Naga Shaurya introduces two leading ladies in Tollywood | Sakshi
Sakshi News home page

పండగలాంటి సినిమా

Published Sun, Aug 19 2018 5:28 AM | Last Updated on Sun, Aug 19 2018 5:28 AM

Naga Shaurya introduces two leading ladies in Tollywood - Sakshi

నర్తనశాల, కాశ్మీరీ పరదేశి

నాగశౌర్య హీరోగా శ్రీనివాస్‌ చక్రవర్తి దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘నర్తనశాల’. ఇందులో కాశ్మీరీ పరదేశి, యామినీ భాస్కర్‌ కథానాయికలుగా నటించారు. ఐరా క్రియేషన్స్‌ పతాకంపై శంకర్‌ ప్రసాద్‌ ముల్పూరి సమర్పణలో ఉషా ముల్పూరి నిర్మించిన ఈ చిత్రాన్ని ఈ నెల 30న విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా ఉషా ముల్పూరి మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా ఫస్ట్‌ లుక్, టీజర్‌లతో పాటుగా రిలీజ్‌ చేసిన రెండు వీడియో సాంగ్స్‌కు మంచి స్పందన లభిస్తోంది. ఈ సినిమా ఆడియోను ఈ నెల 24న రిలీజ్‌ చేసి, చిత్రాన్ని 30న విడుదల చేయనున్నాం.

సినిమాలో నాగశౌర్య క్యారెక్టర్‌కు లేడీ ఆడియన్స్‌ బాగా కనెక్ట్‌ అవుతారు. శ్రీనివాస్‌ చక్రవర్తి ఈ సినిమాను బాగా తెరకెక్కించారు. మహతి మంచి సంగీతం అందిచాడు. ఈ సినిమాపై ఆడియన్స్‌ నమ్మకం వమ్ము కాదు’’ అన్నారు. ‘‘ఛలో’ సక్సెస్‌ మా బ్యానర్‌కు ఊపిరిపోసింది. శ్రీనివాస్‌ బాగా తెరకెక్కించారు. ప్రతి క్షణం ఎంటర్‌టైన్‌ చేసేలా సినిమా ఉంటుంది’’ అన్నారు శంకర్‌ ప్రసాద్‌. ‘‘రీలీజ్‌ చేసిన టీజర్లో సినిమా గురించి కొంచెమే చెప్పాం. ట్రైలర్‌లో కాస్త కథ కూడా చెబుతాం.

సినిమాలో ఉమెన్‌ ఎంపవర్‌మెంట్‌ సంస్థను రన్‌ చేస్తుంటారు నాగశౌర్య. ఆయన క్యారెక్టర్‌లో షేడ్స్‌ ఉంటాయి. నాగశౌర్య గే క్యారెక్టర్‌ గురించి థియేటర్స్‌లో మరింత తెలుస్తుంది. నిర్మాతలు ఈ సినిమాను ఇష్టపడి నిర్మించారు. అందుకే లెక్కకు మించి ఖర్చు పెట్టారు. సినిమా పండగలా ఉంటుంది. సినిమాపై పూర్తి నమ్మకంతో ఉన్నాం. పాత నర్తనశాలకి, ఈ నర్తనశాలకి ప్యారలల్‌గా కొన్ని క్యారెక్టర్స్‌ ఉంటాయి. విజయ్‌కుమార్‌ మంచి విజువల్స్‌ అందించారు’’ అన్నారు దర్శకుడు శ్రీనివాస్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement