‘భలే మంచి’ కాంబినేషన్! | nani new movie with adithya sri ram | Sakshi
Sakshi News home page

‘భలే మంచి’ కాంబినేషన్!

Published Tue, Mar 22 2016 11:13 PM | Last Updated on Sun, Sep 3 2017 8:20 PM

‘భలే మంచి’ కాంబినేషన్!

‘భలే మంచి’ కాంబినేషన్!

సహజమైన నటనతో ప్రేక్షకుల మనసు దోచుకుంటున్న యువ హీరో నాని. గత ఏడాది చివరలో వచ్చిన గమ్మత్తై ప్రయత్నం ‘భలే మంచి రోజు’తో దర్శకుడిగా పేరు తెచ్చుకున్న యువకుడు - శ్రీరామ్ ఆదిత్య. త్వరలో వీరిద్దరి కాంబినేషన్‌లో ఒక సినిమా రానుందని కృష్ణానగర్ కబురు. భవ్య క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత వి. ఆనంద్‌ప్రసాద్ ఈ ‘భలే మంచి’ కాంబినేషన్‌లో సినిమా తీయడానికి రంగం సిద్ధం చేస్తున్నారట! గతంలో షార్ట్ ఫిల్మ్స్ రూపకల్పనలో సిద్ధహస్తుడై, విభిన్న తరహా ‘భలేమంచి రోజు’ లాంటి సిల్వర్ స్క్రీన్ ప్రాజెక్ట్స్ సిద్ధం చేసుకున్న శ్రీరామ్ ఆదిత్య ఓ మంచి స్క్రిప్ట్‌తో నానిని ఇంప్రెస్ చేశారట. ప్రస్తుతం ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న ఇంకా పేరు ఖరారు కాని చిత్రంలో నాని నటిస్తున్నారు. ఆ  తరువాత విరించి వర్మ దర్శకత్వంలో కొత్త సినిమాకు కూడా అంగీకరించారు. భవ్య క్రియేషన్స్ నిర్మించే సినిమా రానున్న జూలైలో సెట్స్ మీదకు వెళుతుందని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement