అభిమానం హద్దు మీరితే..
దేనికైనా ఒక హద్దు అనేది ఉంటే ముచ్చటగానూ, మురిపెంగానూ ఉంటుంది. ముఖ్యంగా హీరో హీరోయిన్ల విషయంలో అభిమానుల ప్రేమాభిమానాలు హద్దులు మీరితే వాతావరణం రచ్చ రచ్చగా మారుతుంది. హీరోయిన్ల విషయంలో ఇలాంటి సంఘటనలు చాలా చోటు చేసుకున్నాయి. సరిగ్గా అలాంటి ఇబ్బందులతోనే నటి ప్రియా ఆనంద్ ఉక్కిరిబిక్కిరైన సంఘటన ఒరు ఊరుల రెండు రాజ చిత్ర షూటింగ్ జరిగింది. విమల్, ప్రియా ఆనంద్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి కన్నడ దర్శకుడు చిత్ర షూటింగ్ మయిలాడుదురైలో జరుపుకుంటోంది.
ఇది రైలులో జరిగే కథా చిత్రం. అక్కడే రైల్వేస్టేషన్‌లో పాట చిత్రీకరణ జరుపుతుండగా చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు తండోపతండాలుగా షూటింగ్ చూడటానికి వచ్చారు. ఒక తరుణంలో ఆ జనం అంతా విమల్, ప్రియాఆనంద్‌ను దర్గరగా చూడటానికి గుమిగూడారు. దీంతో చిత్ర యూనిట్ హీరో హీరోయిన్లను సురక్షితంగా కెరవాన్ వ్యాన్‌లోకి పంపే ప్రయత్నం చేసింది. ఈ లోపే కొందరు ఆకతాయి కుర్రాళ్లు తమ తుంటరి తనాన్ని ప్రదర్శించారు. నటి ప్రియా ఆనంద్‌ను తాకడం, గిల్లడం వంటి అల్లరి చేష్టలకు పాల్పడ్డారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని అతి కష్టం మీద జనం మధ్య నుంచి నటి ప్రియూ ఆనంద్‌ను రక్షించారని చిత్ర దర్శకుడు కన్నన్ తెలిపారు. కానీ ప్రియా ఆనంద్ మాత్రం దీన్ని అంతగా పట్టించుకోకపోవడం విశేషం.