![Actor Raja Booked For Involving In A Drunken Brawl - Sakshi](/styles/webp/s3/article_images/2018/06/2/raja-chaudhary.jpg.webp?itok=_6NcVsYo)
రాజా చౌదరి
కాన్పూర్, ఉత్తరప్రదేశ్ : నటుడు రాజా చౌదరి మరో కాంట్రావర్సీలో చిక్కుకున్నారు. శుక్రవారం కాన్పూర్‌లో మద్యం సేవించిన ఆయన పలువురితో గొడవపడ్డారు. దీంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై మాట్లాడిన పశ్చిమ కాన్పూర్ ఎస్పీ సంజీవ్ సుమన్ మెడికల్ టెస్టుల కోసం రాజాను ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు. బిగ్‌బాస్-2 సీజన్‌తో రాజా పాపులర్ అయ్యారు.
కాగా, రాజాకు 1998లో శ్వేత తివారీతో వివాహం జరిగింది. ఆయనపై గృహ వేధింపుల కేసు కూడా నమోదైంది. 2007లో శ్వేతతో ఆయన విడిపోయారు. 2012లో అధికారికంగా ఇరువురికి విడాకులు మంజూరు అయ్యారు. 2011లో పొరుగు ఇంటి వ్యక్తి పేరు మీద సెల్‌ఫోన్ కనెక్షన్‌కు రాజా దరఖాస్తు చేశారు.
ఈ విషయం తెలుసుకున్న సదరు వ్యక్తి రాజాపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రాజాను అరెస్టు చేశారు. 2013లో ముంబైకి చెందిన అభినవ్ కోహ్లి అనే యువతిని రాజా వివాహం చేసుకున్నారు. ఆమెతో విభేదాలు రావడంతో విడిపోయారు. అనంతరం 2015లో ఢిల్లీకి చెందిన స్నేహితురాలు శ్వేత సూద్‌ను పెళ్లి చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment