
హాస్యనటుడు గౌతంరాజు తనయుడు కృష్ణ హీరోగా శ్రీనాథ్ పులకురం దర్శకత్వంలో బీజీఆర్ ఫిలిం అండ్ టీవీ స్టూడియోస్ నిర్మించనున్న ‘కృష్ణారావ్ సూపర్ మార్కెట్’ సోమవారం ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నటుడు తనికెళ్ల భరణి కెమెరా స్విచ్చాన్ చేయగా, మరో నటుడు నరేశ్ క్లాప్ ఇచ్చారు. దర్శకుడు హరీష్ శంకర్ గౌరవ దర్శకత్వం వహించారు.
‘‘సూపర్ మార్కెట్ నేపథ్యంలో నడిచే ప్రేమకథ ఇది. ఈ నెల 21 నుంచి 45 రోజుల పాటు అవుట్‌డోర్ షెడ్యూల్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు గౌతంరాజు. ‘‘లవ్ అండ్ సస్పెన్స్ ఎంటర్‌టైనర్ ఇది. ఈ సినిమా కోసం ఏడాదిగా కృష్ణ మార్షల్ ఆర్ట్స్, కిక్ బాక్సింగ్ నేర్చుకుంటున్నాడు’’ అన్నారు దర్శకుడు శ్రీనాథ్. ఈ కార్యక్రమంలో నటులు కృష్ణ భగవాన్, చిట్టిబాబు తదితరులతో పాటు చిత్రబృందం పాల్గొంది.
Comments
Please login to add a commentAdd a comment