గోపీచంద్ మలినేని చేతుల మీదుగా ' జై జవాన్‌' ట్రైలర్‌ విడుదల | Jai Jawan Movie Trailer Out Now | Sakshi
Sakshi News home page

గోపీచంద్ మలినేని చేతుల మీదుగా ' జై జవాన్‌' ట్రైలర్‌ విడుదల

Published Thu, Aug 15 2024 9:10 PM | Last Updated on Fri, Aug 16 2024 9:59 AM

Jai Jawan Movie Trailer Out Now

సంతోష్‌ కల్వచెర్ల కథానాయకుడిగా పావని రామిశెట్టి కథానాయికగా తెరకెక్కిన చిత్రం 'జై జవాన్‌'.  ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి, సత్యప్రకాష్‌, నాగినీడు, విజయ రంగరాజు, అప్పాజీ అంబరీష్‌, బిహెచ్‌ఇఎల్‌ ప్రసాద్‌, బలగం సంజయ్‌ తదితరులు ఇందులో నటించారు.  నాగబాబు పోటు దర్శకత్వంలో కేఎస్‌ క్రియేషన్స్‌ పతాకంపై ఈశ్వరీ కుమారి సమర్పణలో సందిరెడ్డి శ్రీనివాసరావు, పోసం మధుసూదన్‌ రెడ్డి, పోటు వెంకటేశ్వర్లు ఈ చిత్రాన్ని నిర్మించారు.

దేశభక్తి నేపథ్యంలో దేశ సరిహద్దుకు రక్షణగా నిలుస్తున్న సైనికుడి గొప్పదనాన్ని తెలియజేసే విధంగా జై జవాన్‌  చిత్రాన్ని రూపొందించారు. ఇండిపెండెన్స్‌ డే సందర్భంగా తాజాగా ట్రైలర్‌ను ప్రముఖ దర్శకుడు గోపీచంద్‌ మలినేని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ చిత్రం కాన్సెప్ట్‌ తనకు నచ్చిందని, ట్రయిలర్‌ చూస్తుంటే దేశభక్తి నేపథ్యంలో రూపొందిన గొప్ప చిత్రంలా ఈ సినిమా వుండబోతుందని, ఇలాంటి ఇండిపెండెట్‌ ఫిల్మ్‌ విజయం సాధించాలని, ఈ సినిమా ద్వారా ఈ టీమ్‌ అందరికి మంచి పేరును తీసుకరావాలని  ఆయన ఆశించారు.

నిర్మాతలు మాట్లాడుతూ 'దేశభక్తి నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో సైనికుడి గొప్పతనం గురించి తెలియజేశామని తెలిపారు. సంతోష్‌ కల్వచెర్ల హీరోగా చక్కని ప్రతిభను కనపరిచాడని వారు అన్నారను. ఆయనకు హీరోగా మంచి భవిష్యత్‌ వుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్‌లు కూడా పాల్గొన్నారు. ఇక ఈ ట్రైలర్‌ చూస్తుంటే దేశభక్తి వున్న ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసే విధంగా, సైనికుడు ఈ దేశం కోసం తమ జీవితాలను ఎలా త్యాగం చేస్తున్నారో కళ్లకు కట్టినట్లు చూపించారు. త్వరలో ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్‌ ప్రకటించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement