
K Raghavendra Rao About Age In Wanted Pandu God Press Meet: ‘‘డైరెక్టర్ శ్రీధర్ సీపాన, సంగీత దర్శకుడు పీ.ఆర్, కెమెరామేన్ మహీరెడ్డి వంటి వాళ్లతో పనిచేయడం వల్ల నాకు వయసు గుర్తుకు రాదు’’అని ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు అన్నారు. సునీల్, అనసూయ భరద్వాజ్, బ్రహ్మానందం, ‘వెన్నెల’ కిషోర్, సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి, సుడిగాలి సుధీర్ ప్రధాన పాత్రల్లో శ్రీధర్ సీపాన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వాంటెడ్ పండు గాడ్’. ‘పట్టుకుంటే కోటి’ అన్నది ట్యాగ్‌లైన్.
కె.రాఘవేంద్రరావు సమర్పణలో యునైటెడ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సాయిబాబ కోవెలమూడి, వెంకట్ కోవెలమూడి ఈ సినిమాను నిర్మించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ– ‘‘తనికెళ్ల భరణిగారు ఈ సినిమాను డైరెక్ట్ చేద్దామనుకున్నారు. ‘పెళ్లి సందడి’కి మంచి డైలాగ్స్ అందించిన శ్రీధర్ సీపాన డైరెక్ట్ చేస్తే బావుంటుందనిపించింది. జూన్ లేదా జూలైలో ఈ సినిమా రిలీజ్ చేస్తాం’’ అని తెలిపారు. ‘‘ఈ సినిమాకు నేను ఓ అసిస్టెంట్ డైరెక్టర్‌లా వర్క్ చేశాను’’ అన్నారు శ్రీధర్ సీపాన.