Gopi Chand Malineni
-
గోపీచంద్ మలినేని చేతుల మీదుగా ' జై జవాన్' ట్రైలర్ విడుదల
సంతోష్ కల్వచెర్ల కథానాయకుడిగా పావని రామిశెట్టి కథానాయికగా తెరకెక్కిన చిత్రం 'జై జవాన్'. ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి, సత్యప్రకాష్, నాగినీడు, విజయ రంగరాజు, అప్పాజీ అంబరీష్, బిహెచ్ఇఎల్ ప్రసాద్, బలగం సంజయ్ తదితరులు ఇందులో నటించారు. నాగబాబు పోటు దర్శకత్వంలో కేఎస్ క్రియేషన్స్ పతాకంపై ఈశ్వరీ కుమారి సమర్పణలో సందిరెడ్డి శ్రీనివాసరావు, పోసం మధుసూదన్ రెడ్డి, పోటు వెంకటేశ్వర్లు ఈ చిత్రాన్ని నిర్మించారు.దేశభక్తి నేపథ్యంలో దేశ సరిహద్దుకు రక్షణగా నిలుస్తున్న సైనికుడి గొప్పదనాన్ని తెలియజేసే విధంగా జై జవాన్ చిత్రాన్ని రూపొందించారు. ఇండిపెండెన్స్ డే సందర్భంగా తాజాగా ట్రైలర్‌ను ప్రముఖ దర్శకుడు గోపీచంద్ మలినేని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ చిత్రం కాన్సెప్ట్ తనకు నచ్చిందని, ట్రయిలర్ చూస్తుంటే దేశభక్తి నేపథ్యంలో రూపొందిన గొప్ప చిత్రంలా ఈ సినిమా వుండబోతుందని, ఇలాంటి ఇండిపెండెట్ ఫిల్మ్ విజయం సాధించాలని, ఈ సినిమా ద్వారా ఈ టీమ్ అందరికి మంచి పేరును తీసుకరావాలని ఆయన ఆశించారు.నిర్మాతలు మాట్లాడుతూ 'దేశభక్తి నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో సైనికుడి గొప్పతనం గురించి తెలియజేశామని తెలిపారు. సంతోష్ కల్వచెర్ల హీరోగా చక్కని ప్రతిభను కనపరిచాడని వారు అన్నారను. ఆయనకు హీరోగా మంచి భవిష్యత్ వుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్‌లు కూడా పాల్గొన్నారు. ఇక ఈ ట్రైలర్ చూస్తుంటే దేశభక్తి వున్న ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసే విధంగా, సైనికుడు ఈ దేశం కోసం తమ జీవితాలను ఎలా త్యాగం చేస్తున్నారో కళ్లకు కట్టినట్లు చూపించారు. త్వరలో ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించనున్నారు. -
అది కృష్ణారెడ్డిగారికే చెల్లింది – గోపీచంద్ మలినేని
‘‘దర్శకత్వం అంటేనే చాలా ఒత్తిడితో కూడిన క్రియేటివ్ వర్క్. అంత టెన్షన్ లోనూ తన ప్రతి సినిమాకి స్వయంగా సంగీతం అందించడం కృష్ణారెడ్డిగారికే చెల్లింది. దర్శకుల పేరు చూసి సినిమాకు వెళ్లే ట్రెండ్‌ను సృష్టించిన అతికొద్ది మందిలో కృష్ణారెడ్డిగారు ఒకరు’’ అన్నారు డైరెక్టర్ గోపీచంద్ మలినేని. డా. రాజేంద్ర ప్రసాద్, మీనా ప్రధానపా త్రల్లో, సోహైల్, మృణాళిని జంటగా ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు’. కె. అచ్చిరెడ్డి సమర్పణలో కోనేరు కల్పన నిర్మించారు. ఈ చిత్రంలోని ‘నమ్ముకోరా.. నమ్ముకోరా..’ అంటూ సాగే పాటని గోపీచంద్ మలినేని విడుదల చేశారు. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈపా టని రేవంత్ ఆలపించారు. ‘‘ఈ మూవీ సూపర్ హిట్టవుతుందని ఆశిస్తున్నాను’’ అన్నారు సి. కల్యాణ్. ‘‘మంచి ఫ్యామిలీ డ్రామాతోపా టు ఈ చిత్రంలో ఒక సందేశం ఉంటుంది. మార్చిలో రానున్న ఈ సినిమా హిట్ అవుతుంది’’ అన్నారు కె. అచ్చిరెడ్డి. ‘‘హిలేరియస్ కామెడీ, ఫ్యామిలీ, యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ చిత్రమిది. ఈ సినిమా చూసి ప్రేక్షకులు కొట్టే చప్పట్ల కోసం ఎదురు చూస్తున్నాను. ఈ సినిమాకు తొలిసారి డైలాగ్స్ రాశాను’’ అని ఎస్వీ కృష్ణారెడ్డి అన్నారు. -
‘2019 ఎంతో దూరం లేదు’
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కావాలంటూ గళం విప్పిన యంగ్ హీరో నిఖిల్ మరో ఆసక్తికరమైన ట్వీట్ చేశాడు. ఆంధ్రప్రదేశ్‌లో పలు ప్రాంతాల్లో షూటింగ్ చేస్తున్న సందర్భంలో అక్కడి ప్రజలు ఆకాంక్ష తెలుసుకున్నానని, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక హోదా అవసరమని నిఖిల్ ట్వీట్ చేసిన సంగతి తెలిసింది. నిఖిల్ ట్వీట్‌కు పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. వేలాదిగా రీ ట్వీట్లు, లైకులు, కామెంట్లు రావటంతో నిఖిల్ ఈ విషయంపై మరోసారి స్పందించారు. ‘ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కావాలంటూ నాకు ట్వీట్ చేస్తున్న వారందరికీ నా రిక్వెస్ట్. ఎవరూ హింసాత్మక నిరసనలను ప్రోత్సహించవద్దు. ఇప్పుడు ధర్నాలు చేయాల్సిన అవసరం కూడా లేదు. మన చేతిలో బలమైన ఆయుధం ఉంది. 2019 ఇంకెంతో దూరంలో లేదు. అధికారంలో ఉన్నవారు ఈ విషయం గుర్తించాలి’ అంటూ ట్వీట్ చేశారు నిఖిల్. ప్రముఖ దర్శకుడు మలినేని గోపిచంద్ కూడా ఏపీకి ప్రత్యేక హోదా కావాలంటూ ట్వీట్ చేశారు. ‘కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవం పోయటం కేంద్ర ప్రభుత్వ కనీస ధర్మం’ అంటూ ట్వీట్ చేశారు గోపిచంద్. స్టార్ రైటర్ కోన వెంకట్ ‘మీ మాట నిలబెట్టుకొమ్మని మాత్రమే కోరుతున్నామం’టూ ట్వీట్ చేశారు. My Request to everyone who has been tweeting to me about #APDemandsSpecialStatus 👉 Never ever encourage violent protests.. Don't have to resort to any dharnas because.. We have a more powerful Weapon in our hand.. 2019 is not very far away friends. Ppl in power plz realise that — Nikhil Siddhartha (@actor_Nikhil) 5 February 2018 It’s a minimum responsibility to the central government to give life to new state of Ap ..#APDemandsSpecialStatus — Gopichand Malineni (@megopichand) 5 February 2018 Need of the hour... All that we ask is, keep up ur promises.. @narendramodi @ncbn @MVenkaiahNaidu .. #APDemandsSpecialStatus — kona venkat (@konavenkat99) 5 February 2018 -
స్టార్డమ్ ప్రేక్షకులే ఇవ్వాలి!
డైట్ పేరుతో వారంలో ఆరు రోజులు గ్రిల్డ్ చికెన్, ఎగ్ వైట్స్, ఫిష్ అవీ తింటుంటాను. సండే మాత్రం అమ్మ చేసిన టమాటా పప్పు, అప్పడాలు, ఆవకాయ తింటున్నప్పుడు అమృతంలా ఉంటుంది. ‘ఏరా... ఎప్పుడు పెళ్లి చేసుకుంటావ్? ఎప్పుడూ నేనే వండి పెట్టాలా?’ అని అమ్మ అడుగుతుంటుంది. ‘అమ్మా.. నేను సంపాదించడం మొదలుపెట్టి రెండేళ్లే అయ్యింది. కొద్ది రోజులు అమ్మను చూసుకున్నాననే సంతృప్తి నాకు ఇవ్వు. తమ్ముడు తనకు కావల్సినవి కొనుక్కునే డబ్బులు ఇచ్చే ఛాన్స్ ఇవ్వు. చిన్నప్పట్నుంచీ నీ మాట, కాలేజీలో లెక్చరర్స్ మాట విన్నా. రేపు పెళ్లైన తర్వాత పెళ్లాం మాట వినాలి కదా. ఇప్పుడైనా కాస్త హ్యాపీగా, ఫ్రీగా ఉండనివ్వు’ అంటుంటా. నాలుగేళ్ల వరకూ పెళ్లి ఆలోచన లేదు. ప్రేమ వివాహమా? పెద్దలు కుదిర్చిన పెళ్లా? అనేది ఆలోచించడానికి ఇంకా చాలా టైముంది. ‘‘ప్రతి కమర్షియల్ సినిమాలోనూ హీరో ఇంట్రడక్షన్ ఫైట్, సాంగ్, తర్వాత సీన్స్.. అన్నీ కామన్. కొత్తగా ఏం ఉండదు. కానీ, ప్రేక్షకుల్ని మెప్పించేలా ఎలా చూపించగలమనేది మా చేతుల్లో ఉంది. నేను కథ విన్నప్పుడు జనాలు యాక్సెప్ట్ చేస్తారా? వాళ్లు పెట్టిన డబ్బుకి హ్యాపీగా ఫీలవుతారా? లేదా అని ఆలోచిస్తా’’ అన్నారు సాయిధరమ్ తేజ్. ఆయన హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), ‘ఠాగూర్’ మధు నిర్మించిన ‘విన్నర్’ గత నెల 24న విడుదలైంది. సాయిధరమ్ చెప్పిన సంగతులు... ♦ కథ చెప్పినప్పుడు తండ్రీకొడుకుల సెంటిమెంట్, హార్స్ జాకీ బ్యాక్‌డ్రాప్ కొత్తగా అనిపించాయి. కానీ, నేను చేయగలనా? లేదా? అని భయపడ్డా. మా దర్శకుడు, ఫైట్ మాస్టర్ కలయాన్ ఇచ్చిన ధైర్యంతో చేశా. చిత్రీకరణలో గుర్రం మీద నుంచి నాలుగుసార్లు కింద పడ్డాను. ఓ గంట విశ్రాంతి తీసుకుని మళ్లీ షూటింగ్ చేసేవాణ్ణి. కింద పడిన ప్రతిసారీ అమ్మ గుర్తొచ్చేది. నేను ఊహించినట్టు జేబీ (జగపతిబాబు) గారితో నటించిన సీన్లకు మంచి స్పందన వస్తోంది. ఫ్యామిలీ ప్రేక్షకులకు సినిమా బాగా నచ్చింది. ♦ ‘విన్నర్’ ఇంట్రడక్షన్లో పవన్‌కల్యాణ్‌గారిని గుర్తుచేసేలా ఎర్ర కండువా, చిరంజీవిగారి డైలాగులు.. అన్నీ దర్శకుడి ఆలోచనలే. ‘రేసుగుర్రం’ ఫస్ట్ డే చూశా. ‘నాన్నకు ప్రేమతో’ సెకండ్ డే చూశా. తారక్ నా ఫ్రెండే. నా నిర్మాత బుజ్జిగారు, మా హీరో బన్నీ ‘రేసుగుర్రం’ చేశారు. కథను బట్టే ఆ రెండు సినిమాలు చూడలేదనే డైలాగ్ చెప్పా. ఫలనా సీన్, డైలాగ్ కావాలని ఎప్పుడూ అడగను. నిర్మాతలకు ఇంత బడ్జెట్లో తీయాలని చెప్పను. నిర్మాతలు కథపై ఖర్చు పెడతారు తప్ప నాపై కాదు. ఎప్పుడైనా హీరో కంటే కథే ముఖ్యం. నేను స్టార్ హీరో కాదు, బడ్డింగ్ యాక్టర్‌ని. ♦ వసూళ్లు, రికార్డుల గురించి పెద్దగా ఆలోచించను. నా పనేంటి? ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేశామా, నిర్మాతలు హ్యాపీగా ఉన్నారా? అనేంత వరకే. హీరోగా నా రేంజ్ గురించి పట్టించుకోను. రేంజ్, స్టార్డమ్ అనేవి ప్రేక్షకులు ఇవ్వాలి. ‘విన్నర్’ విడుదల తర్వాత మా నిర్మాతలు హ్యాపీ. ప్రేక్షకులు సినిమా చూస్తున్నారు కాబట్టే ఇంత మాట్లాడగలుగుతున్నా. లేనిదాన్ని సృష్టించి చెప్పను కదా. ♦ అమ్మ, తమ్ముడు, నవీన్ విజయకృష్ణ (హీరో)... ఈ ముగ్గురూ నా బిగ్గెస్ట్ క్రిటిక్స్. ‘విన్నర్’ ముగ్గురికీ నచ్చింది. డ్యాన్సులు ఇంకొంచెం చేస్తే బాగుండేదని అన్నారు. ప్రేక్షకుల నుంచీ ఈ మాటే వినిపించింది. అమ్మయితే... ‘బాగా చేశావ్. ఇంకా బాగా చెయ్యొచ్చు’ అన్నారు. చిరంజీవిగారు రెండు రోజుల్లో సినిమా చూస్తానన్నారు. పవన్‌కల్యాణ్‌గారు ‘కాటమరాయుడు’ షూటింగ్లో బిజీ. త్వరలో ఆయనకు షో వేస్తా. ♦ ‘నక్షత్రం’లో పావుగంట క్యారెక్టర్ చేశా. నాపై ఓ పాట ఉంటుంది. కథ నచ్చితే ఎటువంటి పాత్ర అయినా చేయడానికి రెడీ. నందమూరి కల్యాణ్‌రామ్‌గారితో సినిమా డిస్కషన్స్‌కి వచ్చింది. కథ సరిగా కుదరలేదు. వీవీ వినాయక్గారిని రెండు మూడుసార్లు కలిశా. కానీ, కథ, సినిమాల గురించి డిస్కస్ చేయలేదు. బీవీయస్ రవి దర్శకత్వంలో చేయనున్న ‘జవాన్’ చిత్రీకరణ మరో నెలలో ప్రారంభమవుతుంది. ♦ ముగ్గురు మావయ్యలూ నాకు దేవుళ్లతో సమానం. చిన్నప్పట్నుంచీ నన్నో సొంత బిడ్డలా పెంచారు. మావయ్యల దగ్గర చాలా ఫ్రీడమ్ ఉంది. నేను బయట ఎలా ఉంటానో.. వాళ్లతో ఉన్నప్పుడూ అంతే. ♦ ‘ఖైదీ నంబర్ 150’లో ‘రత్తాలు రత్తాలు..’, ‘అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు..’ పాటలకు థియేటర్లో డ్యాన్స్ చేశా. స్క్రీన్‌పై చిరంజీవిగారిని చూడడం ఓ పండగ. డ్యాన్సులు అదరగొట్టేశారు. అసలు షష్టిపూర్తి చేసుకున్న మనిషిలా ఉన్నారా! నా దృష్టిలో ఆయన వయసు 50 లోపే. ఇంత వయసు వచ్చినా.. ఆయనలో ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయాలనే కసి కనిపిస్తుంది. చిత్రీకరణలో నిత్య విద్యార్థిలా ఉంటారు. నాలాంటోళ్లకు ఆ కసి, ఆయన ప్రవర్తన ఇన్స్పిరేషన్. -
డబ్బింగ్ మొదలు పెట్టిన మెగాహీరో
వరుస హిట్స్‌తో మంచి ఫాంలో ఉన్న యంగ్ మెగా హీరో సాయిధరమ్ తేజ్ మరో సినిమాతో రెడీ అవుతున్నాడు. తిక్క సినిమాతో నిరాశపరిచిన సాయి... సక్సెస్ ఫుల్ హీరో అనిపించుకునేందుకు విన్నర్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. మాస్ యాక్షన్ సినిమాల దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న గోపిచంద్ మలినేని ఈ సినిమాకు దర్శకుడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. కొత్త ఏడాదిలో డబ్బింగ్ పనులను ప్రారంభించిన దర్శకుడు గోపిచంద్ ఆ విషయాన్ని అభిమానులతో పంచుకున్నాడు. సాయిధరమ్ తేజ్ డబ్బింగ్ చెపుతున్న ఫోటోను తన సోషల్ మీడియా పేజ్‌లో ట్వీట్ చేశాడు. ఈ కామెంట్‌పై స్పందించిన హీరో సాయిధరమ్ తేజ్ 'కొత్త ఏడాదికి గొప్ప ప్రారంభం.. మా సినిమా ఈ ఏడాదికే విన్నర్ గానిలుస్తుంది' అంటూ ట్వీట్ చేశాడు. Great start to the new year! It's gonna be a #winner of a year! ☺ https://t.co/qNEgqNJ8TS — Sai Dharam Tej (@IamSaiDharamTej) 5 January 2017