‘‘దర్శకత్వం అంటేనే చాలా ఒత్తిడితో కూడిన క్రియేటివ్ వర్క్. అంత టెన్షన్ లోనూ తన ప్రతి సినిమాకి స్వయంగా సంగీతం అందించడం కృష్ణారెడ్డిగారికే చెల్లింది. దర్శకుల పేరు చూసి సినిమాకు వెళ్లే ట్రెండ్‌ను సృష్టించిన అతికొద్ది మందిలో కృష్ణారెడ్డిగారు ఒకరు’’ అన్నారు డైరెక్టర్ గోపీచంద్ మలినేని. డా. రాజేంద్ర ప్రసాద్, మీనా ప్రధానపా త్రల్లో, సోహైల్, మృణాళిని జంటగా ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు’. కె. అచ్చిరెడ్డి సమర్పణలో కోనేరు కల్పన నిర్మించారు.
ఈ చిత్రంలోని ‘నమ్ముకోరా.. నమ్ముకోరా..’ అంటూ సాగే పాటని గోపీచంద్ మలినేని విడుదల చేశారు. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈపా టని రేవంత్ ఆలపించారు. ‘‘ఈ మూవీ సూపర్ హిట్టవుతుందని ఆశిస్తున్నాను’’ అన్నారు సి. కల్యాణ్. ‘‘మంచి ఫ్యామిలీ డ్రామాతోపా టు ఈ చిత్రంలో ఒక సందేశం ఉంటుంది. మార్చిలో రానున్న ఈ సినిమా హిట్ అవుతుంది’’ అన్నారు కె. అచ్చిరెడ్డి. ‘‘హిలేరియస్ కామెడీ, ఫ్యామిలీ, యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ చిత్రమిది. ఈ సినిమా చూసి ప్రేక్షకులు కొట్టే చప్పట్ల కోసం ఎదురు చూస్తున్నాను. ఈ సినిమాకు తొలిసారి డైలాగ్స్ రాశాను’’ అని ఎస్వీ కృష్ణారెడ్డి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment