Organic Mama Hybrid Alludu Movie
-
ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నా!
‘‘ప్రేక్షకుల్ని నవ్వుల్లో ముంచెత్తటానికే ‘ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు’ తీశాం. తెరమీద పాత్రలు మిమ్మల్ని (ప్రేక్షకులు) నవ్విస్తుంటే.. మీరు నవ్వుతూ ఉంటే చూసే రోజు కోసం(3వ తేదీ) ఎదురు చూస్తున్నాను’’ అని డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి అన్నారు. సోహైల్, మృణాళిని జంటగా రాజేంద్ర ప్రసాద్, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు’. కె. అచ్చిరెడ్డి సమర్పణలో కోనేరు కల్పన నిర్మించిన ఈ సినిమా ఈ నెల 3న విడుదల కానుంది. మంగళవారం నిర్వహించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ– ‘‘మా మూవీ ట్రైలర్‌కి ఇక్కడున్న వారు కొట్టిన చప్పట్లతో సినిమా విజయంపై మరింత విశ్వాసం పెరిగింది. ఈ సినిమాకు అన్నీ చక్కగా కుదిరాయి’’ అన్నారు. నిర్మాత సి. కల్యాణ్ మాట్లాడుతూ–‘‘నా దృష్టిలో తరాలు మారొచ్చు కానీ సినిమా అనేది నిరంతరం సాగే ప్రపంచం. మనసున్న ప్రతి ఒక్కరి కళ్లు చెమర్చేలా సన్నివేశాలు తీశారు కృష్ణారెడ్డిగారు’’ అన్నారు. ‘‘ఇప్పటి ట్రెండ్‌ను ఫాలో అవుతూ ఈ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు కృష్ణారెడ్డిగారు’’ అని కె. అచ్చిరెడ్డి అన్నారు. ‘‘హీరోగా నిరూపించుకోవడానికి నాకు వచ్చిన మంచి అవకాశం ‘ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు’ చిత్రం అని గర్వంగా చెబుతున్నాను’’ అన్నారు సోహైల్. -
ఈ వారం థియేటర్, ఓటీటీలో విడుదల కానున్న చిత్రాలివే!
జనవరిలో పెద్ద సినిమాలు ఎక్కువగా రిలీజై బాక్సాఫీస్‌ను దున్నేశాయి. అయితే ఫిబ్రవరిలో మాత్రం అందుకు భిన్నంగా పెద్ద సినిమాల హడావుడి కొంత తగ్గిందనే చెప్పాలి. ఏదో ఒకటీరెండు మాత్రమే స్టార్ హీరోల చిత్రాలు రిలీవగా ఎక్కువగా చిన్న సినిమాలే థియేటర్లలో సందడి చేశాయి. వాటిలో కొన్ని ప్రేక్షకులను కట్టిపడేశాయి కూడా! ఫిబ్రవరి నెల ముగియడానికి ఇంకా ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉంది. మార్చికి స్వాగతం పలుకుతూ పలు చిత్రాలు రిలీజ్‌కు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ వారం అటు థియేటర్లలో, ఇటు ఓటీటీలో రిలీజవుతున్న సినిమాలేంటో చూసేద్దాం.. థియేటర్లలో రిలీజయ్యే సినిమాలు.. బలగం ప్రియదర్శి, కావ్య కల్యాణ్ రామ్, మురళీధర్ గౌడ్, సుధాకర్ రెడ్డి ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం బలగం. వేణు ఎల్దండి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు ప్రొడక్షన్స్ పతాకంపై హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మించారు. భీమ్స్ సంగీతం అందించారు షూటింగ్ సహా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ మార్చి 3న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు బిగ్‌బాస్ కంటెస్టెంట్ సోహైల్ హీరోగా, మృణాళిని హీరోయిన్గా రాజేంద్రప్రసాద్, మీనా ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో కె.అచ్చిరెడ్డి సమర్పణలో కోనేరు కల్పన ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇది కూడా మార్చి 3న విడుదలవుతోంది. రిచిగాడి పెళ్లి సత్య, చందన్రాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం రిచిగాడి పెళ్లి. కె.ఎస్ హేమరాజ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని కేఎస్ ఫిలిం వర్క్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ శుక్రవారం(మార్చి 3) రిచిగాడి పెళ్లి విడుదల కానుంది. సాచి బిందు అనే యువతి నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం సాచి. సంజన రెడ్డి, గీతిక రధన్ ప్రధాన పాత్రల్లో నటించారు. వివేక్ పోతగోని దర్శకత్వం వహించడంతో పాటు ఉపేన్ నడిపల్లితో కలిసి నిర్మించారు. ఈ సినిమా కూడా ఫ్రైడే రిలీజ్ అవుతోంది. గ్రంథాలయం విన్ను మద్దిపాటి, స్మిరిత రాణి జంటగా నటించిన చిత్రం గ్రంథాలంయ. సాయి శివన్ జంపన దర్శకత్వం వహించిన ఈ సినిమాను వైష్ణవి శ్రీ నిర్మించారు. ఈ మూవీ మార్చి 3న విడుదల కానుంది. ఓటీటీలో రిలీజయ్యే సినిమాలు.. హాట్‌స్టార్ ది మాండలోరిన్ (వెబ్ సిరీస్) - మార్చి 1 గుల్మొహర్ - మార్చి 3 ఎలోన్ - మార్చి 3 అమెజాన్ ప్రైమ్ వీడియో డైసీ జోన్స్ అండ్ ద సిక్స్ (వెబ్ సిరీస్) - మార్చి 3 జీ5 తాజ్: డివైడెడ్ బై బ్లడ్ (వెబ్ సిరీస్) - మార్చి 3 నెట్‌ఫ్లిక్స్ హీట్ వేవ్ - మార్చి 1 సెక్స్ లైఫ్ (వెబ్ సిరీస్) - మార్చి 2 థలైకూతల్ - మార్చి 3 -
ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు టీమ్ తో స్పెషల్ చిట్ చాట్
-
మామ.. అల్లుడు వస్తున్నారు
సోహెల్, మృణాళిని జంటగా రాజేంద్ర ప్రసాద్, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు’. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం వహించారు. కె.అచ్చిరెడ్డి సమర్పణలో కోనేరు కల్పన నిర్మించిన ఈ సినిమాని మార్చి 3న రిలీజ్ చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ‘‘ఫ్యామిలీ, యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రమిది’’ అని చిత్రబృందం పేర్కొంది. -
‘ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు’ వచ్చేస్తున్నారు
బిగ్‌బాస్ ఫేం సోహైల్, మృణాళిని జంటగా రాజేంద్ర ప్రసాద్, మీనా కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు’. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో కె. అచ్చిరెడ్డి సమర్పణలో కోనేరు కల్పన ఈ చిత్రాన్ని నిర్మించారు. తాజాగా ఈ చిత్రం విడుదల తేదిని ప్రకటించారు మేకర్స్. మార్చి 3న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు వెల్లడించారు. ఈ చిత్రంలో సినీ పరిశ్రమలోని ప్రముఖ నటులు అందరూ నటిస్తుండటం విశేషం. సునీల్, కృష్ణభగవాన్, సన, ప్రవీణ్, సప్తగిరి, అజయ్‌ఘోష్, రాజా రవీంద్ర, సురేఖ వాణి, పృథ్వి, చలాకీ చంటి, సూర్య, రాజారవీంద్ర లాంటి సీనియర్ నటులంతా ఇందులో ఉన్నారు. తన చిత్రాలకు కథ, స్క్రీన్‌ప్లే, సంగీతం, దర్శకత్వం వహించే కృష్ణారెడ్డిగారు ఈ చిత్రానికి మాటలు కూడా రాయడం మరో విశేషం. -
' ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు ' మూవీ టీంతో స్పెషల్ చిట్ చాట్
-
క్యారెక్టర్ ఉంటే తిరుగుండదు
‘‘యాక్టర్ కావటానికి నటన తెలిస్తే చాలు.. కానీ, సక్సెస్ఫుల్ యాక్టర్ కావాలంటే తప్పకుండా క్యారెక్టర్ కావాలి.. అది ఉంటే తిరుగుండదని ఈ తరం నటీనటులకు చెబుతున్నాను. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం ‘ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు’’ అని నటుడు రాజేంద్ర ప్రసాద్ అన్నారు. సోహైల్, మృణాళిని జంటగా రాజేంద్ర ప్రసాద్, మీనా కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు’. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో కె. అచ్చిరెడ్డి సమర్పణలో కోనేరు కల్పన నిర్మించిన ఈ సినిమా మార్చిలో విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ– ‘‘వినోదం’ సినిమా తర్వాత నేను చేసిన కంప్లీట్ కామెడీ మూవీ ‘ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు’. ప్రేక్షకుల నవ్వులు చూసేందుకు ఎదురు చూస్తున్నాను’’ అన్నారు. మీనా మాట్లాడుతూ– ‘‘రాజేంద్రప్రసాద్‌గారితో 30ఏళ్ల తర్వాత ఈ మూవీలో చేశాను. కృష్ణారెడ్డిగారితో సినిమా చేసే అవకాశం ఇన్నేళ్లకు కుదిరింది. తొలిసారి ఒక లేడీ ప్రొడ్యూసర్‌తో (కల్పన) పని చేయడం హ్యాపీ’’ అన్నారు. ‘‘ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రమిది’’ అన్నారు కె. అచ్చిరెడ్డి. ‘‘ఈ సినిమాలో నటించడం అదృష్టంగా భావిస్తున్నాను’’ అన్నారు సోహైల్. -
'ఆర్గానిక్ మామ.. హైబ్రీడ్ అల్లుడు' మూవీ ప్రెస్‌మీట్ (ఫొటోలు)
-
అది కృష్ణారెడ్డిగారికే చెల్లింది – గోపీచంద్ మలినేని
‘‘దర్శకత్వం అంటేనే చాలా ఒత్తిడితో కూడిన క్రియేటివ్ వర్క్. అంత టెన్షన్ లోనూ తన ప్రతి సినిమాకి స్వయంగా సంగీతం అందించడం కృష్ణారెడ్డిగారికే చెల్లింది. దర్శకుల పేరు చూసి సినిమాకు వెళ్లే ట్రెండ్‌ను సృష్టించిన అతికొద్ది మందిలో కృష్ణారెడ్డిగారు ఒకరు’’ అన్నారు డైరెక్టర్ గోపీచంద్ మలినేని. డా. రాజేంద్ర ప్రసాద్, మీనా ప్రధానపా త్రల్లో, సోహైల్, మృణాళిని జంటగా ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు’. కె. అచ్చిరెడ్డి సమర్పణలో కోనేరు కల్పన నిర్మించారు. ఈ చిత్రంలోని ‘నమ్ముకోరా.. నమ్ముకోరా..’ అంటూ సాగే పాటని గోపీచంద్ మలినేని విడుదల చేశారు. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈపా టని రేవంత్ ఆలపించారు. ‘‘ఈ మూవీ సూపర్ హిట్టవుతుందని ఆశిస్తున్నాను’’ అన్నారు సి. కల్యాణ్. ‘‘మంచి ఫ్యామిలీ డ్రామాతోపా టు ఈ చిత్రంలో ఒక సందేశం ఉంటుంది. మార్చిలో రానున్న ఈ సినిమా హిట్ అవుతుంది’’ అన్నారు కె. అచ్చిరెడ్డి. ‘‘హిలేరియస్ కామెడీ, ఫ్యామిలీ, యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ చిత్రమిది. ఈ సినిమా చూసి ప్రేక్షకులు కొట్టే చప్పట్ల కోసం ఎదురు చూస్తున్నాను. ఈ సినిమాకు తొలిసారి డైలాగ్స్ రాశాను’’ అని ఎస్వీ కృష్ణారెడ్డి అన్నారు. -
ఎనిమిదేళ్ల విరామం తరువాత దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి రీ ఎంట్రీ
సాక్షి, తూర్పుగోదావరి(రాజానగరం): ‘కథ పాతదే అయినా చెప్పే విధానం కొత్తగా ఉంటే ప్రేక్షక్షులు ఎప్పుడూ ఆదరిస్తారు. ప్రస్తుతం కాసుల వర్షం కురిపిస్తున్న ‘కాంతార’, ఇటీవల విడుదలై సూపర్ హిట్ అయిన ‘కార్తికేయ –2’ చిత్రాలే ఇందుకు నిదర్శనం. పరమ మూఢభక్తితో కూడిన కథాంశంతో తీసిన చిత్రాలను కూడా ఈ రోజు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అంటే వారు ఎప్పుడూ ఒకే మూసలో ఉండే చిత్రాలను కాకుండా కొత్తదనం ఉన్న చిత్రాలనే ఆదరిస్తారని అర్థమవుతోంది’ అంటున్నారు ప్రముఖ సినీ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి. తూర్పు గోదావరి జిల్లాలోని కొంకుదురుకు చెందిన ఈయన రాజానగరంలో శుక్రవారంఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. 2014లో యమలీల–2 సినిమా తీసి, విరామం తీసుకున్న ఆయన తాజాగా మెగాఫోన్ పట్టారు. ఈ సందర్భంగా ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడిగా ఎనిమిదేళ్ల విరామం తరువాత ఇస్తున్న రీ ఎంట్రీ గురించి వివరించారు. ప్రశ్న: రాజేంద్రుడు–గజేంద్రుడు, మాయలోడు, వినోదం, మావిచిగురు, యమలీల, శుభలగ్నం వంటి అనేక సూపర్ హిట్లు ఇచ్చిన మీరు చాలా కాలంగా సినిమాలు తీయడం లేదు, ప్రస్తుతం ఏం చేస్తున్నారు? జవాబు: ‘ఆర్గానిక్ మామ – హైబ్రీడ్ అల్లుడు’ అనే చిత్రాన్ని తీస్తున్నాను. దాదాపుగా షూటింగ్ పార్టు అంతా పూర్తయింది. జనవరిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఈ చిత్రంలో సహాయ్లరగర్, మృణాళిని హీరో హీరోయిన్లు కాగా ఆర్గానిక్ మామగా రాజేంద్రప్రసాద్ నటిస్తున్నారు. అలాగే మీనా, సునీల్, అజయ్‌ఘోష్, సూర్య, హేమ ఇలా అనేకమంది తారాగణం ఉన్నారు. గతంలో నేను తీసిన చిత్రాలలో కనిపించే కుటుంబ నేపథ్య వాతావరణంతోపాటు హాస్యరసం, కష్టాలు, కన్నీళ్లు, చక్కటి సంగీతంతో కూడిన వినోదం.. అన్నీ ఉంటాయి. ప్రశ్న: ఎనిమిదేళ్ల అనంతరం ఈ సినిమా తీయడానికి కారణం? జవాబు: కాలంతోపాటు ప్రేక్షకుల ఆదరణలో వస్తున్న మార్పులను గమనిస్తున్న నేను ఖాళీగా కుర్చోవడం ఎందుకని ఒక కథ తయారు చేశా. దానికి స్క్రీన్‌ప్లే, మాటలు కూడా రాసిన తరువాత రూ. 10 కోట్ల వ్యయంతో ఈ సినిమాను తీశాను. క్లైమాక్స్‌లో కూడా నవ్వులు కురిపించే చిత్రంగా వచ్చింది. గతంలో మాయలోడు, వినోదం సినిమాలు వచ్చాయి. వాటిని మరింపిచే రీతిలో ఈ సినిమా ఉంటుంది. దీనిలో వ్యక్తుల మధ్య అనుబంధాలు, ఆప్యాయతలు, పగలు, ప్రతీకారాలు, అన్నీ మిళితమై ఉంటాయి. ప్రతి అంశంలోను కామెడీ ఉంటుంది. ప్రశ్న: మీ సినిమాలో సందేశం ఏమైనా ఉంటుందా? జవాబు: ‘ప్రేమను ప్రేమతోనే కలుపుకోవాలి గాని, పగలు, ప్రతీకారాలతో కాదనే’ సందేశంతో ఈ సినిమాను రూపొందించాం. ప్రేమించడం చేతనైన వాడికి కష్టం తెలియదు, పగతో రగిలిపోయేవాడికి సుఖం దొరకదు, ఇది జగమెరిగిన సత్యం. ప్రశ్న: తెలుగు సినిమా ప్రపంచ స్థాయికి చేరుకుంటున్న నేపథ్యంలో మీ స్పందన ఏమిటి? జవాబు: తెలుగు సినీ పరిశ్రమ ఎక్కడిక్కెడికో పరుగులు పెడుతోంది. ఆనందమే, కానీ బడ్జెట్ విషయంలో కాస్త కంట్రోలు ఉంటే బాగుంటుంది. కథ డిమాండ్‌ని బట్టి వ్యయం ఉండాలిగాని, గొప్పగా చెప్పుకునేందుకు కాలాన్ని, డబ్బును వృథా చేయకూడదు. వృథా చేస్తే డబ్బు సంపాదించుకోవచ్చునేమోగాని, కాలాన్ని వెనక్కి తీసుకురాలేం. ప్రశ్న: దర్శకుడిగా కెరీర్ కొనసాగిస్తారా? జవాబు: కొంతకాలం పాటు సినిమాలు తీయడం కొనసాగిస్తాను. ప్రేక్షకుల ఆదరణ కూడా ఉంటే.... -
యమలీల చేసిన వాణ్ణి మరో లీల చేయలేనా ?: ఎస్వీ కృష్ణారెడ్డి
‘ఎస్వీ కృష్ణారెడ్డి సినిమాలు అంటే ఒక రిలీఫ్. అన్ని వర్గాల ప్రేక్షకులకు కావాల్సిన అంశాలను చక్కగా ఏర్చి, కూర్చి అద్భుతమైన సంగీతంతో మనకు అందిస్తారు. ఉరుకు, పరుగుల ప్రస్తుత జనరేషన్‌కు రిలీఫ్ కోసం కృష్ణారెడ్డిగారి సినిమాలు ఎంతో అవసరం అని నా భావన. ఆయన సినిమాలలో కమర్షియల్ హంగులతో పాటు పిల్లలకు కావాల్సిన అంశాలన్నీ ఉంటాయి. ‘ఆర్గానిక్ మామ`హైబ్రిడ్ అల్లుడు’ మూవీ కృష్ణారెడ్డికి మంచి కమ్‌బ్యాక్ సినిమా అని ప్రముఖ దర్శఖుడు శేఖర్ కమ్ముల అన్నారు. సోహైల్, మృణాళినీ రవి జంటగా, రాజేంద్రప్రసాద్ కీలక పాత్రలో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న తాజా సినిమా ‘ఆర్గానిక్ మామ– హైబ్రీడ్ అల్లుడు’. ఈ సినిమాను కల్పన కోనేరు నిర్మిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం టీజర్ లాంచ్ కార్యక్రమం తాజాగా హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన శేఖర్ కమ్ముల మాట్లాడుతూ.. ‘ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు’ టీజర్ చాలా బాగుంది. ఈ సినిమాను ఇంత అద్భుతంగా నిర్మించిన నిర్మాత కోనేరు కల్పన గారికి యూనిట్ సభ్యులకు నా కృతజ్ఞతలు. కృష్ణారెడ్డి మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను అన్నారు. నిర్మాత సీ.కల్యాణ్ మాట్లాడుతూ.. దాదాపు 30 ఏళ్ల క్రితం ఆలీని హీరోగా పరిచయం చేస్తూ కృష్ణారెడ్డి గారు ఇండస్ట్రీ హిట్ ఇచ్చారు. చాలా కాలం తర్వాత మళ్లీ సోహెల్‌ను ఈ సినిమా ద్వారా పరిచయం చేస్తుండటం మేం సెంటిమెంట్‌గా భావిస్తున్నాం. చిరంజీవి గారు కెరీర్ ప్రారంభంలో ఎలా కష్టపడ్డారో అలాగే ఈ సినిమా కోసం సోహెల్ కూడా కష్టపడ్డాడు. నేను ప్రత్యక్షంగా చూశాను. ఈ సినిమా అందరికీ హిట్ ఇస్తుందని ఆశిస్తున్నా అన్నారు. ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఆర్గానిక్ మామ ` హైబ్రిడ్ అల్లుడు సినిమా ప్రేక్షకుల ముందుకు రావటానికి రెడీ అవుతోంది అంటే దానికి నేను కూడా ఒక కారణం తప్ప.. నేనే కారణం కాదు. నేను 40 దాకా సినిమాలు చేశాను. ఈ సినిమా నిర్మాత కల్పన గారి డెడికేషన్, ప్లానింగ్ చూసిన తర్వాత ఈ ప్రొడక్షన్ హౌస్ నా కెరీర్లో ది బెస్ట్ అని చెపుతున్నాను. ఈ సినిమా విషయంలో అచ్చిరెడ్డి గారికి, నిర్మాత కల్పన గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. 44 రోజుల్లోనే సినిమా పూర్తయిపోయింది. ఆర్టిస్ట్‌ల విషయంలో కూడా నేను బడ్జెట్‌ను దృష్టిలో పెట్టుకుని కొన్ని పాత్రలకు చిన్న వారిని, కొత్త వారిని ప్రపోజ్ చేసినా, ఆమె మాత్రం పేరున్న ఆర్టిస్ట్‌లను మాత్రమే తీసుకోవాలని పట్టుబట్టి మరీ వారి డేట్స్ సంపాదించారు. సోహైల్ కథ విని ఈ సినిమా చేస్తే నేను ఎక్కడికో వెళ్లిపోతాను సార్ అని ఆనందపడిపోయాడు. అతని కలవగానే.. యమలీల చేసిన వాణ్ణి మరో లీల చేయలేనా అనిపించింది. రాజేంద్రప్రసాద్ గారు అయితే.. డబ్బింగ్ టైంలో కొన్ని సీన్లు చూసి ఏంటి నేను ఇంత బాగా చేశానా, ఇంత ఎమోషన్ ఈ కేరెక్టర్లో ఉందా? అని ఆశ్చర్య పోయారు. ఇంతమంది మంచి మనుషులు నా చుట్టూ ఉంటే నా నుంచి ఒక పెద్ద హిట్ ఎందుకు రాకుండా ఉంటుంది?. ఈ సినిమా చూస్తున్నంత సేపు నవ్వుతూనే ఉంటారు. కచ్చితంగా అందరికి నచ్చుతుంది’ అన్నారు. ‘చిన్నప్పటి నుంచి కృష్ణారెడ్డి గారి సినిమాలు చూసి పెరిగాను. ఇప్పుడు ఆయన దర్వకత్వంలో నటించడం అంటే ఇప్పటికీ నమ్మలేని విషయంగానే అనిపిస్తుంది. నాలోని టాలెంట్‌ను నమ్మి నాకు అవకాశం ఇచ్చిన నిర్మాత కల్పన గారికి నా థ్యాంక్స్. బిగ్‌బాస్ వల్ల నేను చాలా మందికి పరిచయం అయ్యాను. ఇప్పుడు కృష్ణారెడ్డి గారి సినిమా అంటే ఇక ప్రతి కుటుంబానికి చేరువౌతాను అనే నమ్మకం ఉంది. ప్రతి సినిమా కోసం ఇలానే కష్టపడతాను’అన్నారు సోహైల్. ఈ కార్యక్రమంలో చిత్ర సమర్పకుడు, ప్రముఖ నిర్మాత కె. అచ్చిరెడ్డి , నటుడు అలీ, హేమ, నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్న కుమార్ తదితరులు పాల్గొన్నారు.