‘‘ప్రేక్షకుల్ని నవ్వుల్లో ముంచెత్తటానికే ‘ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు’ తీశాం. తెరమీద పాత్రలు మిమ్మల్ని (ప్రేక్షకులు) నవ్విస్తుంటే.. మీరు నవ్వుతూ ఉంటే చూసే రోజు కోసం(3వ తేదీ) ఎదురు చూస్తున్నాను’’ అని డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి అన్నారు. సోహైల్, మృణాళిని జంటగా రాజేంద్ర ప్రసాద్, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు’. కె. అచ్చిరెడ్డి సమర్పణలో కోనేరు కల్పన నిర్మించిన ఈ సినిమా ఈ నెల 3న విడుదల కానుంది.
మంగళవారం నిర్వహించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ– ‘‘మా మూవీ ట్రైలర్‌కి ఇక్కడున్న వారు కొట్టిన చప్పట్లతో సినిమా విజయంపై మరింత విశ్వాసం పెరిగింది. ఈ సినిమాకు అన్నీ చక్కగా కుదిరాయి’’ అన్నారు. నిర్మాత సి. కల్యాణ్ మాట్లాడుతూ–‘‘నా దృష్టిలో తరాలు మారొచ్చు కానీ సినిమా అనేది నిరంతరం సాగే ప్రపంచం. మనసున్న ప్రతి ఒక్కరి కళ్లు చెమర్చేలా సన్నివేశాలు తీశారు కృష్ణారెడ్డిగారు’’ అన్నారు.
‘‘ఇప్పటి ట్రెండ్‌ను ఫాలో అవుతూ ఈ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు కృష్ణారెడ్డిగారు’’ అని కె. అచ్చిరెడ్డి అన్నారు. ‘‘హీరోగా నిరూపించుకోవడానికి నాకు వచ్చిన మంచి అవకాశం ‘ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు’ చిత్రం అని గర్వంగా చెబుతున్నాను’’ అన్నారు సోహైల్.
Comments
Please login to add a commentAdd a comment