జనవరిలో పెద్ద సినిమాలు ఎక్కువగా రిలీజై బాక్సాఫీస్‌ను దున్నేశాయి. అయితే ఫిబ్రవరిలో మాత్రం అందుకు భిన్నంగా పెద్ద సినిమాల హడావుడి కొంత తగ్గిందనే చెప్పాలి. ఏదో ఒకటీరెండు మాత్రమే స్టార్ హీరోల చిత్రాలు రిలీవగా ఎక్కువగా చిన్న సినిమాలే థియేటర్లలో సందడి చేశాయి. వాటిలో కొన్ని ప్రేక్షకులను కట్టిపడేశాయి కూడా! ఫిబ్రవరి నెల ముగియడానికి ఇంకా ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉంది. మార్చికి స్వాగతం పలుకుతూ పలు చిత్రాలు రిలీజ్‌కు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ వారం అటు థియేటర్లలో, ఇటు ఓటీటీలో రిలీజవుతున్న సినిమాలేంటో చూసేద్దాం..
థియేటర్లలో రిలీజయ్యే సినిమాలు..
బలగం
ప్రియదర్శి, కావ్య కల్యాణ్ రామ్, మురళీధర్ గౌడ్, సుధాకర్ రెడ్డి ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం బలగం. వేణు ఎల్దండి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు ప్రొడక్షన్స్ పతాకంపై హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మించారు. భీమ్స్ సంగీతం అందించారు షూటింగ్ సహా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ మార్చి 3న థియేటర్లలో రిలీజ్ కానుంది.
ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు
బిగ్‌బాస్ కంటెస్టెంట్ సోహైల్ హీరోగా, మృణాళిని హీరోయిన్‌గా రాజేంద్రప్రసాద్, మీనా ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో కె.అచ్చిరెడ్డి సమర్పణలో కోనేరు కల్పన ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇది కూడా మార్చి 3న విడుదలవుతోంది.
రిచిగాడి పెళ్లి
సత్య, చందన్‌రాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం రిచిగాడి పెళ్లి. కె.ఎస్ హేమరాజ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని కేఎస్ ఫిలిం వర్క్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ శుక్రవారం(మార్చి 3) రిచిగాడి పెళ్లి విడుదల కానుంది.
సాచి
బిందు అనే యువతి నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం సాచి. సంజన రెడ్డి, గీతిక రధన్ ప్రధాన పాత్రల్లో నటించారు. వివేక్ పోతగోని దర్శకత్వం వహించడంతో పాటు ఉపేన్ నడిపల్లితో కలిసి నిర్మించారు. ఈ సినిమా కూడా ఫ్రైడే రిలీజ్ అవుతోంది.
గ్రంథాలయం
విన్ను మద్దిపాటి, స్మిరిత రాణి జంటగా నటించిన చిత్రం గ్రంథాలంయ. సాయి శివన్ జంపన దర్శకత్వం వహించిన ఈ సినిమాను వైష్ణవి శ్రీ నిర్మించారు. ఈ మూవీ మార్చి 3న విడుదల కానుంది.
ఓటీటీలో రిలీజయ్యే సినిమాలు..
హాట్‌స్టార్
ది మాండలోరిన్ (వెబ్ సిరీస్) - మార్చి 1
గుల్మొహర్ - మార్చి 3
ఎలోన్ - మార్చి 3
అమెజాన్ ప్రైమ్ వీడియో
డైసీ జోన్స్ అండ్ ద సిక్స్ (వెబ్ సిరీస్) - మార్చి 3
జీ5
తాజ్: డివైడెడ్ బై బ్లడ్ (వెబ్ సిరీస్) - మార్చి 3
నెట్‌ఫ్లిక్స్
హీట్ వేవ్ - మార్చి 1
సెక్స్ లైఫ్ (వెబ్ సిరీస్) - మార్చి 2
థలైకూతల్ - మార్చి 3
Comments
Please login to add a commentAdd a comment