
డబ్బింగ్ మొదలు పెట్టిన మెగాహీరో
వరుస హిట్స్తో మంచి ఫాంలో ఉన్న యంగ్ మెగా హీరో సాయిధరమ్ తేజ్ మరో సినిమాతో రెడీ అవుతున్నాడు. తిక్క సినిమాతో నిరాశపరిచిన సాయి... సక్సెస్ ఫుల్ హీరో అనిపించుకునేందుకు విన్నర్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. మాస్ యాక్షన్ సినిమాల దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న గోపిచంద్ మలినేని ఈ సినిమాకు దర్శకుడు.
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. కొత్త ఏడాదిలో డబ్బింగ్ పనులను ప్రారంభించిన దర్శకుడు గోపిచంద్ ఆ విషయాన్ని అభిమానులతో పంచుకున్నాడు. సాయిధరమ్ తేజ్ డబ్బింగ్ చెపుతున్న ఫోటోను తన సోషల్ మీడియా పేజ్లో ట్వీట్ చేశాడు. ఈ కామెంట్పై స్పందించిన హీరో సాయిధరమ్ తేజ్ 'కొత్త ఏడాదికి గొప్ప ప్రారంభం.. మా సినిమా ఈ ఏడాదికే విన్నర్ గానిలుస్తుంది' అంటూ ట్వీట్ చేశాడు.
Great start to the new year! It's gonna be a #winner of a year! ☺ https://t.co/qNEgqNJ8TS
— Sai Dharam Tej (@IamSaiDharamTej) 5 January 2017