
తనికెళ్ల భరణి
‘మిథునం’ సినిమాతో దర్శకుడిగా మారారు రచయిత, నటుడు తనికెళ్ల భరణి. వృద్ధదంపతుల అన్యోన్యతను, పిల్లలకు దూరంగా ఉంటున్న బాధను అద్భుతంగా తెరకెక్కించారు భరణి. ‘మిథునం’లో యస్పీ బాలసుబ్రహ్మణ్యం, లక్ష్మీ జంటగా నటించారు. ఇప్పుడు దర్శకుడిగా రెండో సినిమా పట్టాలెక్కించే పనిలో ఉన్నారట తనికెళ్ల భరణి. ‘అమ్మ ఇంకా బతికే ఉంది’ అనే టైటిల్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారని సమాచారం. ఇందులో షావుకారు జానకి ముఖ్య పాత్రలో కనిపించనున్నారట. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.