మూడే మూడు మాటలు! | Three words! | Sakshi
Sakshi News home page

మూడే మూడు మాటలు!

Published Fri, Mar 14 2014 11:39 PM | Last Updated on Sat, Sep 2 2017 4:42 AM

మూడే మూడు మాటలు!

మూడే మూడు మాటలు!

 అన్యోన్య దాంపత్యానికి చిరునామా అనదగ్గ స్థాయిలో ‘మిధునం’ చిత్రంలో భార్యాభర్తలుగా జీవించారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, లక్ష్మీ.     ఈ ఇద్దరి అభినయానికి ప్రేక్షకులు, విశ్లేషకులు ముగ్ధులయ్యారు.

మరోసారి ఈ ఇద్దరూ కలిసి నటించనున్నారు. తమిళ దర్శకురాలు మధు మిత ‘మిథునం’ చూసి ఈ పెయిర్‌ని చాలా ఇష్టపడ్డారట. అందుకే తను దర్శకత్వం వహిస్తున్న ‘మూండ్రే మూండ్రు వార్తయ్’ (‘మూడే మూడు మాటలు’ అని అర్థం) అనే చిత్రంలో ఎస్పీబీ, లక్ష్మీని నటింపజేయనున్నారు.

ఈ ఇద్దరూ హీరోకి తాత, నానమ్మలుగా కనిపిస్తారు. ఈ చిత్రాన్ని కాపిటల్ ఫిల్మ్‌వర్క్స్ పతాకంపై ఎస్పీబీ తనయుడు, గాయకుడు ఎస్.పి. చరణ్ నిర్మిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement