అతుల్ కులకర్ణి
అతుల్ కులకర్ణి, మనోజ్ మిశ్రా, తనికెళ్ల భరణి, యశ్‌పాల్ శర్మ, షిజ్జు, సంజు శివరామ్ ముఖ్య తారలుగా రాజేష్ టచ్ రివర్ దర్శకత్వంలో తెలుగు, ఒడిస్సాలో రూపొందుతోన్న క్రైమ్ థ్రిల్లర్ ‘పట్నఘడ్’. ‘23 ఫిబ్రవరి 2018, ఒడిస్సా’ అనేది ట్యాగ్‌లైన్. రేంజ్ రాయల్ సినీ ల్యాబ్స్‌పై శ్రీధర్ మార్తా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను దసరాకు రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ‘ఒడిస్సాలో జరిగిన ఓ సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం. ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్‌గా అతుల్ కులకర్ణి నటిస్తున్నారు’’ అన్నారు రాజేష్. ‘‘ప్రోస్థటిక్ మేకప్ డిజైనర్‌గా ఎన్.జి. రోషన్ వర్క్ చేస్తున్నారు. హిందీ చిత్రం ‘102 నాటౌట్’ ఫేమ్ జార్జి జోసెఫ్ సంగీతం అందిస్తున్నారు. ఆర్.పి. పట్నాయక్ ఈ సినిమా కోసం ఫోక్ సాంగ్‌ను కంపోజ్ చేయడం విశేషం’’ అన్నారు నిర్మాత శ్రీధర్ మార్తా.
Comments
Please login to add a commentAdd a comment