శ్రీల ప్రభుపాదులను దర్శించుకున్న తనికెళ్ల భరణి | thanikella bharani in iskcon temple | Sakshi
Sakshi News home page

శ్రీల ప్రభుపాదులను దర్శించుకున్న తనికెళ్ల భరణి

Published Wed, Aug 16 2017 9:57 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

శ్రీల ప్రభుపాదులను దర్శించుకున్న తనికెళ్ల భరణి - Sakshi

శ్రీల ప్రభుపాదులను దర్శించుకున్న తనికెళ్ల భరణి

అనంతపురం కల్చరల్‌: ఇస్కాన్‌ వ్యవస్థాపకులు శ్రీల ప్రభుపాదుల జయంతి సందర్భంగా బుధవారం రాత్రి ఇస్కాన్‌ మందిరానికి ప్రముఖ సినీనటుడు తనికెళ్ల భరణి విచ్చేశారు. తొలుత ప్రభుపాదుల విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం శ్రీకృష్ణలీలలుపై భాగవత ప్రవచనం చేశారు. ఆధ్యాత్మిక చరిత్రలో ఇస్కాన్‌ ఓ సంచలనమన్నారు. అంతకుముందు దేవేంద్రప్ప అనే భక్తుడు రాగిరేకులపై ముద్రించిన శ్రీల ప్రభుపాదుల చరిత్రను తనికెళ్ల భరణి చేతుల మీదుగా ఇస్కాన్‌ ఇన్‌చార్జి దామోదర గౌరంగదాసుకు అందించారు. ఈ సందర్భంగా తనికెళ్ల భరణికి ఇస్కాన్‌ నిర్వాహకులు స్వామివారి శాలువ, ప్రసాదాలు అందించి సత్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement