iskcon temple
-
హైదరాబాద్ : అబిడ్స్ ఇస్కాన్ టెంపుల్ లో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)
-
హైదరాబాద్ లో వైభవంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు
-
భజన కార్యక్రమాలతో ఇస్కాన్ టెంపుల్లో వేడుకలు
-
తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు
సాక్షి, తిరుపతి/హైదరాబాద్: శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా జరుగుతున్నాయి. ఇస్కాన్ ఆలయాలు సర్వాంగసుందరంగా ముస్తాబయ్యాయి. భారీ సంఖ్యలో భక్తులు ఆలయాలకు వచ్చి పూజలు నిర్వహిస్తున్నారు. కృష్ణుడి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్ హరేకృష్ణ గోల్డెన్ టెంపుల్‌కు భక్తులు పొటెత్తారు తిరుపతి ఇస్కాన్ మందిరంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీకృష్ణుడిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేస్తున్నారు. తెల్లవారు జామున నుంచే ఇస్కాన్ మందిరానికి భక్తులు తరలి వస్తున్నారు. చదవండి: విశిష్టుడు, సర్వలోకహితుడైన "కృష్ణుడు" ధర్మపక్షపాతి -
బంగ్లాదేశ్‌లోని ఇస్కాన్ టెంపుల్‌పై 200 మంది మూకుమ్మడి దాడి
ఢాకా: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని ఇస్కాన్ టెంపుల్‌పై దాడి చేసి కూల్చి వేశారు. వివరాల ప్రకారం.. ఢాకాలోని లాల్మోహన్ సాహా వీధిలో ఉన్న ఇస్కాన్ రాధాకాంత ఆలయాన్ని సుమారు 200 మందితో కూడిన గుంపు గురువారం ధ్వంసం చేసి దోచుకుంది. ఈ దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన పలువురు గాయపడ్డారు. హాజీ షఫీవుల్లా నేతృత్వంలో ఈ దాడి జరిగినట్లు అధికారులు తెలిపారు. కాగా, ఈ ఘటనను ఇస్కాన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ రాధారామన్ దాస్ తీవ్రంగా ఖండించారు. ఆయన ట్విటర్లో.. "డోల్ యాత్ర & హోలీ వేడుకల సందర్భంగా ఇది చాలా దురదృష్టకర సంఘటనని అవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు గతంలో ఢాకాలోని టిప్పుసుల్తాన్ రోడ్లో, చిట్టగాంగ్‌లోని కొత్వాలీలో కూడా జరిగాయి. It's very very unfortunate incident on the eve of Dol Yatra & Holi celebrations. Just few days ago, United Nations passed a resolution declaring 15th March as International day to combat Islamophobia. We are surprised that same United Nations.....1/3 https://t.co/aMci2GdQdv — Radharamn Das राधारमण दास (@RadharamnDas) March 18, 2022 -
800 కేజీల భగవద్గీత ఆవిష్కరణ
న్యూఢిల్లీ: ఏకంగా 800 కేజీల బరువైన అతిభారీ భగవద్గీత గ్రంథాన్ని ప్రధాని మోదీ మంగళవారం ఢిల్లీలోని ఇస్కాన్( అంతర్జాతీయ కృష్ణచైతన్య సంఘం) ఆలయంలో ఆవిష్కరించారు. 2.8 మీటర్ల ఎత్తు, రెండు మీటర్ల వెడల్పు ఉన్న ఈ మహా గ్రంథంలో 670 పేజీలు ఉన్నాయి. ఇటలీలోని మిలాన్ నగరంలో ఈ గ్రంథాన్ని అచ్చువేశారు. పేజీలను యుపో(వైయూపీవో) సింథటిక్ కాగితంతో తయారుచేశారు. ఈ కాగితం తడవదు, అస్సలు చిరగదు. గ్రంథంలో సందర్భోచితంగా 18 అత్యంత మనోహరమైన పెయింటింగ్‌లను పొందుపరిచారు. కాగా, భగవద్గీత ఆవిష్కరణ కార్యాక్రమానికి మోదీ ఢిల్లీ మెట్రో రైళ్లో వచ్చారు. ఖాన్ మార్కెట్ స్టేషన్ నుంచి నెహ్రూ ప్లేస్ మెట్రో స్టేషన్ వరకు ఆయన ప్రయాణించారు. ఆ సమయంలో తోటి ప్రయాణికులతో సరదాగా మాట్లాడి, సెల్ఫీలు దిగారు. తిరుగుప్రయాణంలోనూ కైలాశ్ కాలనీ స్టేషన్లో ఎక్కి ఖాన్‌మార్కెట్ స్టేషన్లో దిగిపోయారు. -
కాబోయే భర్తతో ఆలయానికి ఇషా
ముంబై : దేశీ కార్పొరేట్ దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) ముకేశ్ అంబానీ ఏకైక కుమార్తె ఇషా అంబానీతో ప్రముఖ ఫార్మా ఇండస్ట్రియలిస్ట్ అజయ్ పిరమల్ కుమారుడు ఆనంద్ పిరమల్ వివాహం నిశ్చయమైనట్టు తెలిసింది. వీరిద్దరి పెళ్లి డిసెంబర్లో జరగనుందని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. త్వరలో మనువాడబోతున్న వీరిద్దరూ ఆదివారం రాత్రి ముంబైలోని ఇస్కాన్ ఆలయాన్ని దర్శించుకున్నట్టు తెలిసింది. ఇరువురి కుటుంబ సభ్యులతో ఇషా, ఆనంద్ ఇస్కాన్ ఆలయానికి వెళ్లారు. కాగా, ఇటీవలే ఇషా సోదరుడు ఆకాశ్ అంబానీ వివాహం కూడా రసెల్ మెహతా కూతురు శ్లోకా మెహతతో నిశ్చియమైన సంగతి తెలిసిందే. ముఖేష్‌కు కవల పిల్లలైన ఇషా, ఆకాశ్‌ల పెళ్లిళ్లతో అంబానీ ఇంట సందడి నెలకొంది. త్వరలో ఒకటి కాబోతున్న ఆనంద్, ఇషాలు కూడా ఎంతో కాలంగా స్నేహితులు కావడం విశేషం. అంతేకాక ఇరువురి కుటుంబాలకు కూడా నాలుగు దశాబ్దాలుగా మంచి పరిచయాలు ఉన్నాయి. మహాబలేశ్వరం ఆలయంలో ఆనంద్, ఇషాకు ప్రపోజ్ చేశారు. ఇందుకు ఇషా అంగీకరించడం, వెంటనే ఇరు కుటుంబాలు ఓ విందు కార్యక్రమం ఏర్పాటుచేయడం జరిగింది. ఈ విందు కార్యక్రమంలో ముకేశ్ అంబానీ ఆయన భార్య నీతా అంబానీ, ఆనంద్ తల్లిదండ్రులు అజయ్, స్వాతిలతోపాటు ఇషా నానమ్మ, అమ్మమ్మలు కోకిలాబెన్ అంబానీ, పూర్ణిమాబెన్ దలాల్, సోదరులు ఆకాశ్, అనంత్‌లు పాల్గొన్నారు. ఆనంద్ సోదరి నందిని ఇతర కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమానికి హాజరైనట్టు తెలిసింది. -
నేత్రపర్వంగా రాధాష్టమి
అనంతపురం కల్చరల్: స్వచ్చమైన ప్రేమకు రాధాకృష్ణులే ప్రతీకలని ప్రముఖ కృష్ణతత్వ ప్రచారకులు ఇస్కాన్ మందిరాల డివిజనల్ చైర్మన్ సత్యగోపీనాథ్ అన్నారు. రాధాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇస్కాన్ మందిరంలో మంగళవారం వేడుకలు నేత్రపర్వంగా జరిగాయి. ప్రత్యేక పుష్షాలతో సర్వాంగసుందరంగా రాధాపార్థసారథులను అలంకరించి వసంత శోభను నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఇస్కాన్ అధ్యక్షుడు దామోదర గౌరంగదాసుతో పాటు సత్యగోపీనాథ్ ఆధ్యాత్మిక ప్రవచనం చేశారు. సమాజంలో భక్తి భావాన్ని పెంపొందించేందుకు ఇస్కాన్ మందిరాలు చేపడుతున్న కృషిని వివరించారు. కార్యక్రమంలో ఇస్కాన్ శాశ్వత సభ్యులతో పాటు వందలాది మంది కృష్ణభక్తులు పాల్గొన్నారు. -
శ్రీల ప్రభుపాదులను దర్శించుకున్న తనికెళ్ల భరణి
అనంతపురం కల్చరల్: ఇస్కాన్ వ్యవస్థాపకులు శ్రీల ప్రభుపాదుల జయంతి సందర్భంగా బుధవారం రాత్రి ఇస్కాన్ మందిరానికి ప్రముఖ సినీనటుడు తనికెళ్ల భరణి విచ్చేశారు. తొలుత ప్రభుపాదుల విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం శ్రీకృష్ణలీలలుపై భాగవత ప్రవచనం చేశారు. ఆధ్యాత్మిక చరిత్రలో ఇస్కాన్ ఓ సంచలనమన్నారు. అంతకుముందు దేవేంద్రప్ప అనే భక్తుడు రాగిరేకులపై ముద్రించిన శ్రీల ప్రభుపాదుల చరిత్రను తనికెళ్ల భరణి చేతుల మీదుగా ఇస్కాన్ ఇన్చార్జి దామోదర గౌరంగదాసుకు అందించారు. ఈ సందర్భంగా తనికెళ్ల భరణికి ఇస్కాన్ నిర్వాహకులు స్వామివారి శాలువ, ప్రసాదాలు అందించి సత్కరించారు. -
మార్మోగిన హరేకృష్ణ నామస్మరణ
- ముగిసిన కృష్ణాష్టమి వేడుకలు - ఘనంగా శ్రీల ప్రభుపాదుల జయంతి అనంతపురం కల్చరల్: నగర శివారులోని ఇస్కాన్ మందిరం హరేకృష్ణ నామస్మరణతో మార్మోగింది. మూడు రోజులుగా ఇస్కాన్ మందిరంలో అంగరంగ వైభవంగా సాగిన శ్రీకృష్ణాష్టమి వేడుకలు బుధవారంతో ముగిశాయి. ఇస్కాన్ సంస్థాపకాచార్యులు భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారి ఆవిర్భావ సందర్భాన్ని పురస్కరించుకుని మందిరంలో విశేష పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటలకు స్వామివారికి సుగంధ ద్రవ్యాలతో పంచతులసులతో కూడిన పవిత్ర జలాలతో అభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆలయంలోని రాధాపార్థసారథులను సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు, మహామంగళహారతి నిర్వహించిన అనంతరం అన్నదాన సంతర్పణ నిర్వహించారు. సాయంత్రం స్వామివారి ముందు భజనలాలపిస్తూ భక్తజనం ఆనందతాండవం చేశారు. నిర్వాహకులు దామోదర్ గౌరంగదాసు, ఇస్కాన్ సేవా సభ్యులు, కృష్ణ మఠం సభ్యులు పాల్గొన్నారు. -
సుందరంగా ఇస్కాన్ మందిరం
అనంతపురం నగర శివారులోని సోములదొడ్డి వద్దగల ఇస్కాన్ మందిరం కృష్ణాష్టమికి సుందరంగా రూపుదిద్దుకుంటోంది. 60 అడుగుల ఎత్తులో నాలుగు అశ్వాలు రథాన్ని లాగుతున్నట్టుగా నిర్మితమైన ఇస్కాన్ మందిరం భక్తులను ఆకట్టుకుంటోంది. రాధాపార్థ సారథులు, వివిధ ఘట్టాలను తెలిపే మనోహర విగ్రహాలు మంత్రముగ్ధులను చేస్తున్నాయి. కృష్ణాష్టమిని పురస్కరించుకుని మందిరానికి నూతన రంగులతో ముస్తాబు చేస్తున్నారు. ఆగస్టు 15 నాటికి వివిధ దేవతా విగ్రహాలతో ఎగ్జిబిషన్ ప్రారంభిస్తున్నట్టు నిర్వాహకులు దామోదర గౌరంగదాసు తెలిపారు. -
ఇస్కాన్ మందిరం.. చూసొద్దాం రండి
భువిపై వెలసిన భూతల స్వర్గంగా భాసిల్లుతున్న అనంతపురంలోని ఇస్కాన్ మందిరం భక్తుల సుందర స్వప్న సాకారమై విరాజిల్లుతోంది. అరుదైన ఈ అపురూప కట్టడం అనంతపురం శివారులోని గుత్తి రోడ్డులో సోములదొడ్డి వద్ద ఉంది. భారతీయ శిల్పకళకు, సనాతన ధర్మానికి ప్రతిరూపంగా నిలిచిన ఈ మనోహర కట్టడం జిల్లాకే తలమానికంగా నిలిచింది. మందిర ప్రాంగణంలోనికి అడుగు పెట్టగానే ఏదో తెలియని ఆధ్యాత్మిక చింతన భక్తులను వెన్నాడుతుంది. శ్రీరాధాపార్థసారధుల మనోహర ప్రతిమలు జీవకళ ఉట్టిపడుతూ వింత శోభతో మంత్రముగ్ధులను చేస్తున్నాయి. పురాణ ఇతిహాసాల్లోని వివిధ ఘట్టాలు మందిరం చుట్టూ నేత్ర పర్వం చేస్తున్నాయి. సుమారు 60 అడుగుల ఎత్తుతో నిర్మించిన నాలుగు అశ్వాలు రథాన్ని లాగుతున్నట్లు నిర్మితమైన ఇస్కాన్ మందిరం ఏ మూల నుంచి చూసినా.. ఓ మధురానుభూతిని మిగుల్చుతోంది. రాత్రి వేళలల్లో విద్యుద్దీప కాంతులతో వెలుగులు విరజిమ్మే ఈ కృష్ణ మందిరాన్ని చూసేందుకు జాతీయ రహదారి గుండా ప్రయాణిస్తున్న వారు ఆసక్తి చూపుతుంటారు. - అనంతపురం కల్చరల్ -
వైభవంగా.. జగన్నాథ రథోత్సవం
అనంతపురం కల్చరల్ : ఇస్కాన్ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం జరిగిన జగన్నాథ రథయాత్రలో వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన ఇస్కాన్ కార్యకర్తలు, భక్తులతో ‘అనంత’ జనసంద్రంగా మారింది. ఇస్కాన్ 9వ వార్షికోత్సవంలో భాగంగా సాగిన రథయాత్రలో వందలాది మంది భక్తులు విష్ణుసహస్రనామ జపం, హరేరామ హరే కృష్ణ అంటూ ఇస్కాన్ కార్యకర్తల నామస్మరణతో నగర పురవీధులు మార్మోగాయి. స్థానిక కేఎస్ఆర్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన బహిtరంగ సభా వేదిక నుంచి 108 పవిత్ర కళశాలతో జగన్నాథుడి రథయాత్ర బయలుదేరి, సప్తగిరి సర్కిల్, సుభాష్ రోడ్, టవర్‌క్లాక్, ఆర్ట్స్ కళాశాల మైదానం, శ్రీకంఠం సర్కిల్, తాడిపత్రి బస్టాండు, పాతూరు వీధుల మీదుగా కళాశాల ప్రాంగణం చేరుకుంది. రథానికి నగరవాసులు అడుగుడుగునా కర్పూర హారతులు ఇచ్చారు. జిల్లాలోని పలు ఆధ్యాత్మిక సంస్థలే కాకుండా అధికార, అనధికారులు రథాన్ని లాగడానికి పోటీ పడ్డారు. రథయాత్రను జిల్లా ఎస్పీ ఎస్వీ రాజశేఖరబాబు ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. దక్షిణభారత దేశ ఇస్కాన్ మందిరాల అధ్యక్షుడు సత్య గోపీనాథ్ స్వామీజీ ఆధ్యాత్మిక సందేశమిచ్చారు. మూడోసారి అనంత వేదికగా జగన్నాథ రథయాత్ర సాగినట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న 108 పవిత్ర నెల్లూరు, తిరుపతి, బెంగళూరు, హైదరాబాదు, రాజమండ్రి తదితర ఇస్కాన్ మందిరాల నుంచి విచ్చేసిన నిర్వాహకులు, ఇస్కాన్ స్థలదాత డా.కేశన్న, స్థానిక టీటీడీ ధార్మిక మండలి జిల్లా అధ్యక్షుడు శ్రీపాద వేణు, ఫ్లెక్స్ రమణ, ఇంటెల్ ప్రతాపరెడ్డి, చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రధాన కార్యదర్శి రంగారెడ్డి తదితరులు రథయాత్రలో పాల్గొన్నారు. -
మహిళ దారుణహత్య
► మృతదేహం కాల్చివేత ► ఇస్కాన్ మందిరం వెనుక ఘటన అనంతపురం : ఆధ్యాత్మిక కేంద్రమైన ఇస్కాన్ మందిరం వెనుక దారుణం చోటు చేసుకుంది. మహిళ దారుణ హత్యకు గురైంది. గుర్తు పట్టలేని విధంగా మృతదేహాన్ని కాల్చడం కలకలం రేపుతోంది. భయోత్పాతం కల్గించేలా ఉన్న ఈ ఘటన శుక్రవారం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే...అనంతపురం మండలం సోమలదొడ్డి సమీపంలోని ఇస్కాన్ (రాధా పార్థసారథి) మందిరం వెనుక జాతీయ రహదారిపై ఉన్న బ్రిడ్జి కింది భాగంలో ఓ శవం కాలిబూడిదైందనే విషయం దావానలంలా వ్యాపించడంతో చుట్టుపక్కల ప్రాంతాల వారు అక్కడికి తరలివచ్చారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న రూరల్ సీఐ కృష్ణమోహన్, ఎస్ఐ జగదీష్, సిబ్బంది వెళ్లి పరిశీలించారు. అగంతకులు ఆనవాళ్లు కనిపించకుండా మృతదేహాన్ని పూర్తిగా కాల్చేశారు. శరీరం నుంచి రెండుకాళ్లూ వేరయ్యాయి. హ త్యానంతరం శరీరం నుంచి కాళ్లు వేరు చేసి పెట్రోలు పోసి నిప్పు పెట్టి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతా పథకం ప్రకారమే.. పక్కా ప్రణాళికతోనే మహిళను మట్టుబెట్టినట్లు సంఘటన స్థలాన్ని చూస్తే అర్థమవుతుంది. చేతులు, ముఖం, పొట్టభాగం, ఛాతీ ఏమాత్రం కనిపించడం లేదు. బోర్లాపడిన మృతదేహాన్ని పోలీసులు వెల్లకిలా తిప్పించారు. కాలిన మృతదేహంలో ఓ కీచైను డాలరును గుర్తించారు. అందులో ‘శక్తి కుమార్ మిల్స్ డిపో’ అని ఇంగ్లిష్ అక్షరాల్లో ఉంది. మెడలో ఓ పూసల దండ ఉంది. కాలిలో మెట్లు లేకపోవడంతో ఆమె అవివాిహ తా? లేక వితంతువా అనేది తెలియడం లేదు. తలలో దాదాపు వెంట్రుకలు కాలిపోయాయి. ఉన్న కాసిన్ని వెంట్రుకలు తెల్లగా కనిపిస్తున్నందున వయసు మీద పడిన మహిళ అయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. వైద్యులు బ్రహ్మాజి నేతృత్వంలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. తల వెంట్రుకలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపనున్నారు. త్వరలోనే కేసు ఛేదిస్తాం ఈ కేసును చాలెంజ్‌గా తీసుకుని ఛేదిస్తామని సీఐ కృష్ణకుమార్ అన్నారు. ఆస్తుల గొడవ కారణంగా హత్య చేశారా? ఇతర కారణాలేవైనా ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని స్టేషన్లలోనూ నమోదైన మహిళ అదృశ్యం కేసుల వివరాలను ఆరా తీస్తున్నామని సీఐ తెలిపారు. వాటి ఆధారంగా బంధువులతో మాట్లాడుతున్నామన్నారు. వీలైనంత త్వరగా నిందితులను పట్టుకుంటామని స్పష్టం చేశారు. -
ఇస్కాన్ దేవాలయ ప్రాంగణంలో అగ్నిప్రమాదం
మధుర: మధురలోని ఇస్కాన్ దేవాలయ ప్రాంగణంలోని పరిపాలన భవనంలో గత రాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. దాంతో దేవాలయం సిబ్బంది వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో ఇస్కాన్ దేవాలయం వద్దకు చేరుకున్నారు. దాదాపు మూడు గంటల పాటు ప్రయత్నించడంతో మంటలు అదుపులోకి వచ్చాయని దేవాలయ కార్యదర్శి మాధవ్ ఇందు వెల్లడించారు. ఆ ప్రమాదం జరిగిన సమయంలో దేవాలయంలో పెద్ద సంఖ్యలో భక్తులు ఉన్నారని చెప్పారు. అయితే ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని చెప్పారు. కానీ అగ్ని ప్రమాదం వల్ల పరిపాలన భవనంలోని జీఎం కార్యాలయం, స్టోర్ రూమ్, ఇతర గదులకు మంటలు వ్యాపించాయని చెప్పారు. ఆ మంటల్లో విలువైన డాక్యుమెంట్లు, ఫర్నీచర్‌తోపాటు దేవుని సామాగ్రి అగ్నికి ఆహుతి అయిందని చెప్పారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదని ఉన్నతాధికారులు వెల్లడించారు. -
ఈ వరుస పాటిస్తే ప్రపంచాన్ని జయించినట్టే...
ఇస్కాన్ దేవాలయంలో అడుగుపెట్టగానే భక్తులందరూ హరేకృష్ణ మంత్రాన్ని జపిస్తూ కనిపిస్తారు. ఎవరు దేవాలయంలో అడుగుపెట్టినా ఇస్కాన్ సేవకులు ఓ చిన్నకార్డు, ఓ జపమాల ఇస్తారు. రోజుకి 108సార్లు దానిపై ఉండే మంత్రాన్ని జపిస్తే ఆ శ్రీకృష్ణుడితో మీకు అనుబంధం ఏర్పడుతుందని చెబుతారు. అసలు ఆ భగవంతుడు ఎక్కడున్నాడు? ఉంటే ఆయనతో అనుబంధం ఎలా కుదురుతుంది? ఆ అనుబంధంవల్ల మనకు వచ్చేదేమిటి? మానవుని మస్తిష్కంలో మెదిలే ఈ ప్రశ్నలకు ఇస్కాన్ దక్షిణభారత అధ్యక్షులుగా పనిసత్యగౌరచంద్రదాస్ జవాబులివి... మనిషి తన బాహ్యప్రపంచాన్ని తనకు నచ్చినట్టు తీర్చిదిద్దుకున్నాడు కానీ, తన ఆంతరిక ప్రపంచాన్ని మాత్రం తన చేతుల్లోకి తెచ్చుకోలేపోతున్నాడు. అవసరమైతే భూమిని దాటి మరో గ్రహంలో ఆవాసం ఏర్పాటుచేసుకోగల మనిషి తన ఆత్మను కనుగొనే ప్రయత్నం మాత్రం చేయలేకపోతున్నాడు. ఏ పనిలోనైనా విజయం సాధించాలంటే సులువైన మార్గంలో ప్రయాణించాలి. మనసుని తమ నియంత్రణలో పెట్టుకునే దారి తెలియక రకరకాల ఇబ్బందులు పడుతున్న ఆధునిక మానవునికి గీతా సారాంశం ఓ దివ్యఔషధం అనడంలో సందేహం లేదు. అదెలాగంటారా...ముందుగా మన స్వరూపమేమిటో తెలుసుకోవాలి. మనలో ఎన్ని విభాగాలున్నాయో గుర్తించి ఓ వరుస (ప్రొటోకాల్) ప్రకారం వాటికి మర్యాదలు చేస్తే చాలు... ఆ పరమాత్మతో మీకు అనుబంధం ఏర్పడుతుంది. ఇంతకీ ఏమిటా ప్రొటోకాల్ అంటారా... శరీరం... ఇంద్రియాలు... మనస్సు... అహంకారం... బుద్ధి... పరమాత్మ... ఆత్మ. ఇదీ... మనిషి పాటించాల్సిన వరుస. ఇక్కడ మనిషి బాహ్య స్వరూపుడే కాదు ఆత్మ స్వరూపుడు కూడా. ఆత్మ ఏ నిర్ణయం తీసుకోవాలన్నా...ముందుగా పరమాత్మ దృష్టికి తీసుకెళ్లాలి. ఆ పరమాత్ముడితో చర్చించాలి. ఆ తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. కానీ, మనమేం చేస్తున్నాం... మనకన్నా(ఆత్మ)మూడు మెట్లు కిందనున్న మనస్సుతో ముచ్చటించి, అది చెప్పినదానికల్లా తలాడించి తోచినట్టు ప్రవర్తిస్తుంటాం. అది తప్పంటుంది గీత. ఎవరైనా మనల్ని తిట్టగానే మనకంటే ముందుగా మనస్సు బాధపడిపోతుంది. గతంలో ఆ వ్యక్తితో ఉన్న వైరం తాలూకు విషయాలన్నీ గుర్తుచేసి గందరగోళం సృష్టించేస్తుంది. ఇంద్రియాలకు, శరీరానికి, బుద్ధికి మనసే బాస్ కాబట్టి అది చెప్పిన పనిని చెప్పినట్టు వెంటనే చేసేస్తాయి. జరగాల్సిన నష్టం జరిగిపోయాక... పరమాత్మ గుర్తుకొస్తాడు. ‘అయ్యో...ఆ సమయంలో నేను అలా చేసి ఉండాల్సి కాద’ంటూ...’ భగవంతుడి ముందు తలొంచుకుంటాం. ఆ పనేదో...నిర్ణయాన్ని మనసుకి అప్పగించకముందు చేస్తే మనకంటే బలవంతుడు ఈ ప్రపంచంలో ఉండడు. ఏ సంస్థలోనైనా కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలంటే యజమానితో ఆలోచిస్తారు కాని గుమస్తాలతో, ఇంకా దిగువస్థాయి వారితో చర్చించరు కదా! అలాగే ఇక్కడ కూడా మన పైవాడితో ఆలోచిస్తే ప్రయోజనం ఉంటుంది కాని మనకన్నా మూడు స్థానాల కిందనున్న మనసు అభిప్రాయం అడిగితే అదొచ్చి మన నెత్తిన కూర్చుని తోచిన సలహాలిచ్చి మనల్ని అథముల్ని చేస్తుంది. అర్జునుడంతటివాడే... నీళ్లలో చేపకన్ను చూసి బాణం విసరగలిగాడంటే అర్జునుడెంత తెలివైనవాడో అర్థమవుతుంది. అంతటివాడే...ఒక సందర్భంలో కృష్ణుడిని ‘నన్ను తీసికెళ్లి ఏ అడవిలోనైనా వదిలిపెట్టు, నా మనసుకి ప్రశాంతత ప్రసాదించు’ అంటూ వేడుకున్నాడు. అంటే...మానవుడు ఎన్ని తెలివితేటలు, ఎంతటి పరిజ్ఞానం సంపాదించినా మనస్సును నియంత్రించుకోలేనపుడు దేహాన్ని వీడి పారిపోడానికి కూడా వెనకాడడు. పాతికేళ్లు నిండని యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే...దానికి అర్థం వారికి జీవితం భారమైపోయిందని కాదు...జీవించడం ఎలాగో అర్థం కాలేదని. అందుకే దుఃఖమొచ్చినా, సంతోషమొచ్చినా ముందుగా దాన్ని మీపైనున్న పరమాత్మ (భగవంతుడు)తో పంచుకోవాలి. ఆ తర్వాత మన (ఆత్మ) కిందున్న అహంకారాన్ని తగ్గించుకుని బుద్ధిగా ఆలోచించి మనసుతో పనులు చేస్తే మనిషికి ఎలాంటి సమస్యలూ రావు. కొన్ని సందర్భాల్లో నిర్ణయాలను పరమాత్మకు వదిలిపెట్టాలి. ఆ ఒక్క నిర్ణయంతో మీ మనసుకి సగం భారం తగ్గుతుంది. అహంకారాన్ని చంపుకుంటే చాలు పరిష్కారాలు వాటంతటవే వస్తాయి చిన్న చిన్నవాటికి బుద్ధిని ఉపయోగిస్తే సరిపోతుంది మనసున్నది వినడానికే కాని...చెప్పడానికి కాదని మరిచిపోకూడదు. ఇంద్రియాలకు, శరీరానికి తగినంత పని ఉండాలి. నామజపం వల్ల మన ఇంద్రియాలకు, శరీరానికి తగిన వ్యాయామంతో పాటు మనస్సుకి విశ్రాంతి దొరుకుతుంది. ఆలోచనలేమీ లేకుండా దేవుణ్ణి తలుచుకుంటూ పది నిమిషాలు నిర్మలంగాగడిపితే చాలు... మీరు రోజంతా ప్రశాంతంగా ఉండవచ్చు! - భువనేశ్వరి ఇస్కాన్ గురించి: ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణా కాన్షియస్నెస్(ఇస్కాన్)ని 1966లో శ్రీల ప్రభుపాదదాస్ అమెరికాలో స్థాపించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 108 ఇస్కాన్ దేవాలయాలున్నాయి. వీటిలో హరినామ స్మరణతో పాటు గీతాసారాంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం భక్తులకు, హరేకృష్ణా ఫౌండేషన్ సమావేశాలకు హాజరైన ప్రజలకు ఉపదేశాలు చేస్తుంటారు. సామాన్యులకు అర్థమయ్యేలా గీతాబోధ చేస్తారు. అంతేకాదు... ఇస్కాన్ ఆధ్వర్యంలో ఎన్నో సేవాకార్యక్రమాలను కూడా నిర్వర్తిస్తున్నారు. మన రాష్ర్టంలో పేదవిద్యార్థులకు ఉచితంగా భోజనం పెట్టే ‘అక్షయ పాత్ర’, పేదరోగులకు ఉచితంగా అన్నంపెట్టే ‘భోజనామృతం’ ఈ సంస్థ ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయి. కృష్ణకృపా సాగరంలో... శ్రీమాన్ సత్యగౌరచంద్రదాస్...మద్రాస్‌లో ఇంజినీర్‌గా పనిచేస్తున్న సమయంలో ఇస్కాన్ గురించి తెలిసింది. మొదట హరినామ జపం, ఆ తర్వాత గీతాపఠనం చేశాక... ఆ ఆనందాన్ని నిరంతరం అనుభవించడం కోసం ఇస్కాన్‌లో సభ్యుడిగా చేరారు. అప్పటి నుంచి ఇస్కాన్‌లో తన సేవలను పెంచుకుంటూ పోయారు. ప్రస్తుతం ఇస్కాన్ దక్షిణ భారతదేశ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.