మార్మోగిన హరేకృష్ణ నామస్మరణ | krishnashtami celebrations in iskcon | Sakshi
Sakshi News home page

మార్మోగిన హరేకృష్ణ నామస్మరణ

Published Wed, Aug 16 2017 9:23 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

మార్మోగిన హరేకృష్ణ నామస్మరణ - Sakshi

మార్మోగిన హరేకృష్ణ నామస్మరణ

- ముగిసిన కృష్ణాష్టమి వేడుకలు
- ఘనంగా శ్రీల ప్రభుపాదుల జయంతి


అనంతపురం కల్చరల్‌: నగర శివారులోని ఇస్కాన్‌ మందిరం హరేకృష్ణ నామస్మరణతో మార్మోగింది. మూడు రోజులుగా ఇస్కాన్‌ మందిరంలో అంగరంగ వైభవంగా సాగిన శ్రీకృష్ణాష్టమి వేడుకలు బుధవారంతో ముగిశాయి. ఇస్కాన్‌ సంస్థాపకాచార్యులు భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారి ఆవిర్భావ సందర్భాన్ని పురస్కరించుకుని మందిరంలో విశేష పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటలకు స్వామివారికి సుగంధ ద్రవ్యాలతో పంచతులసులతో కూడిన పవిత్ర జలాలతో అభిషేకం చేశారు.

ఈ సందర్భంగా ఆలయంలోని రాధాపార్థసారథులను సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు, మహామంగళహారతి నిర్వహించిన అనంతరం అన్నదాన సంతర్పణ నిర్వహించారు. సాయంత్రం స్వామివారి ముందు భజనలాలపిస్తూ భక్తజనం ఆనందతాండవం చేశారు. నిర్వాహకులు దామోదర్‌ గౌరంగదాసు, ఇస్కాన్‌ సేవా సభ్యులు, కృష్ణ మఠం సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement