Krishnashtami Celebrations
-
బిగ్ బాస్ బ్యూటీ కృష్ణాష్టమి సందడి మామూలుగా లేదుగా! (ఫోటోలు)
-
కృష్ణాష్టమి వేడుకల్లో రచ్చ చేసిన రాజకుటుంబీకురాలు
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని శ్రీ జుగల్ కిషోర్ మందిరంలో వైభవోపేతంగా కృష్ణాష్టమి వేడుకలు జరుగుతున్న సమయంలో పన్నా రాజ కుటుంబీకురాలు జితేశ్వరీ దేవి ఆలయ నిబంధనలను ఉల్లంఘిస్తూ నేరుగా గర్భగుడిలోకి ప్రవేశించినందుకు పన్నా పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. అరెస్టు సమయంలో ఆమె మధ్యప్రదేశ్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో అవినీతి ఆరోపణలు చేశారు. Maharani Jiteshwari Devi of Panna Royal house of Madhya Pradesh arrested Due to widowhood of Queen, she was prevented from performing the Aarti of Shri Krishna in Jugal Kishore Temple in Panna#G20India2023 #G20जनता_विरोधी #G20_Anti_Social#सनातनी_ऐक_शैतानी #BharatMandapam #G20 pic.twitter.com/tR5hHx4kYz — Vikram Kumar (@VikramKumar6262) September 9, 2023 పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పన్నా జిల్లా బుందేల్‌ఖండ్ ప్రాంతంలోని ప్రఖ్యాత శ్రీ జుగల్ కిశోర్ మందిరంలో కృష్ణాష్టమి రోజున అర్ధరాత్రి కృష్ణ పరమాత్ముడి జన్మదిన వేడుకలు ఘనంగా జరగడం ఆనవాయితీ. అయితే ఈ ఉత్సవాల్లో రాజ కుటుంబీకులు ప్రతిమను చీపురుతో శుభ్రపరిచే 'చాన్వార్' సంప్రదాయాన్ని మాత్రమే ఆచరిస్తారని, అది కూడా పురుషులు మాత్రమే ఆచరిస్తారని తెలిపారు. कल रात जब उनकी विधवा पत्नी जेतेश्वरी देवी अपने बेटे को लेकर जुगल किशोर मंदिर पूजा करने के लिए आई और गर्भ गृह में घुसने लगी तो विधवा बता कर उन्हें और बेटे को रोक दिया गया। कुछ देर बाद जीतेश्वरी गर्भगृह के अंदर घुस गई और आरती करने लगी तो विधवा द्वारा आरती करना अशुभ बता कर कथित थाली… pic.twitter.com/svOZjgcW5y — काश/if Kakvi (@KashifKakvi) September 8, 2023 కానీ జితేశ్వరీ దేవి నిబంధనలను ఉల్లంఘిస్తూ నేరుగా గర్భగుడిలోకి ప్రవేశించి హారతినిచ్చారన్నారు. దీంతో అర్చకులు, అక్కడి సెక్యూరిటీ సిబ్బంది ఆమెను అడ్డుకోగా వారిపై కూడా దుర్భాషలాడారని తెలిపారు. పోలీసులు వచ్చి వారించినా ఆమె తగ్గలేదు. దీంతో పోలీసులు ఆమెను బలవంతంగా లాక్కుని తీసుకెళ్లామని ఆమెపై కేసు నమోదు చేశామని కూడా తెలిపారు. సోషల్ మీడియాలో ఈ వీడియోలు వైరల్ అయ్యాయి. पन्ना राजपरिवार की महारानी #jiteshwaridevi को श्री जुगलकिशोर जू मंदिर से बाहर फेंका गया pic.twitter.com/J7wKpELBYF — Piyush Kumar Shukla (@Piyushkumarshu8) September 8, 2023 అరెస్టు సమయంలో జితేశ్వరీ దేవి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయి ఆరోపణలు చేశారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం రక్షణ శాఖ సంక్షేమ నిధిలో సుమారు రూ.65,000 కోట్లు అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. ఈ కుంభకోణంపై అదేపనిగా ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలోనే ఆమెను అరెస్టు చేశారన్నారు. వైధవ్యం కారణంగానే గర్భగుడిలోకి ప్రవేశించకుండా ఆలయ సిబ్బంది ఆమెను అడ్డుకున్నారని సంఘటన సమయంలో ఆమె బాగా మద్యం సేవించి ఉన్నారని స్థానికులు తెలిపారు. बवाल के बाद महारानी जीतेश्वरी देवी अदालत जाते वक्त बोली- पुजारियों ने गलत किया! हमारे साथ बुरा बर्ताव किया, उन पर कोई FIR नहीं हुई#Queen #JiteshwariDevi #Court #Panna pic.twitter.com/BP40yRECQH — Punjab Kesari-MadhyaPradesh/Chhattisgarh (@punjabkesarimp) September 8, 2023 ఇది కూడా చదవండి: ప్రమాదవశాత్తూ తుపాకీ పేలి హెడ్ కానిస్టేబుల్ మృతి -
భజన కార్యక్రమాలతో ఇస్కాన్ టెంపుల్లో వేడుకలు
-
భీమవరంలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు
-
తిరుమలలో వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు
-
బంజారాహిల్స్ లోని హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ లో కృష్ణాష్టమికి ఏర్పాట్లు
-
కారు చీకటిలో కాంతిరేఖ కృష్ణుడు
అతడి రూపం నల్లటిది. కాని మనసు మాత్రం మరుమల్లె కన్న తెల్లనిది, పరిమళభరితమైనది, స్వచ్ఛమైనది. బాల్యం నుంచి – ఆ మాటకొస్తే పుట్టకముందు నుంచే ఆయన ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నాడు? ఎన్ని సవాళ్లను అధిగమించాడు? కన్నతల్లిదండ్రులకు దూరమయ్యాడు. స్వంత మేనమామే శత్రువై సంహరింప చూసినా చలించని, దేనికీ భయపడని, ఎవరికీ లొంగని ఆ ధీరోదాత్తుడే శ్రీకృష్ణుడు. కార్యసాధన అంటే ఏమిటో ఆచరించి చూపిన సిసలైన కార్యసాధకుడు, శరణన్న వారికి రక్షణగా నిలిచిన అసలైన రక్షకుడు, మోసాన్ని మోసంతోనే జయించాలని, ముల్లును ముల్లుతోనే తీసివేయాలని, తగిన ఉపాయముంటే ఎంతటి అపాయం నుంచయినా బయట పడవచ్చునని రుజువు చేసి చూపిన అసహాయ శూరుడు శ్రీకృష్ణుడు. అసలైన వ్యక్తిత్వ వికాసమంటే ఏమిటో గీత ద్వారా బోధించి చూపాడు. శ్రీకృష్ణుని లీలలు తెలుసుకోవడమే కాదు, ఆయన మంచితనాన్ని, ఉన్నత వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకుని ఆచరణలో పెట్టాలి. కిట్టనివాళ్లు ఆయనను మాయావి అన్నారు. ఓరిమితో సహించాడు. కొందరు కృష్ణుడంటే శృంగార పురుషుడే కదా! అన్నారు. చిరునవ్వులు చిందించాడు. కొందరు తాత్వికుడన్నారు. కాదనలేదు. నీవే పరమాత్ముడవంటూ పూజలు చేశారు. కాదు పొమ్మనలేదు... తనను ఎవరు ఏ దృష్టితో చూస్తే ఆ దృష్టితో దర్శనమిచ్చాడు. పదహారువేలమంది గోపికలన్నారు కానీ, వారిలో ఏ ఒక్కరైనా కృష్ణయ్య నన్ను చూసి నవ్వాడనో, కొంటెగా కన్నుగీటాడనో అనగా విన్న దాఖలాలు ఉన్నాయా ఎక్కడైనా? అష్టభార్యలన్నారు. వారిలో ఏ ఒక్కరైనా తనను నిర్లక్ష్యం చేశాడని మొరపెట్టుకున్నట్లు విన్నామా? లేదే! చీరలెత్తుకెళ్లిన చిలిపివాడన్నారు కానీ, గోపకాంతలు ఒడ్డున చీరలు వేసి, ఆదమరచి స్నానాలు చేస్తుంటే, వారికి తెలివి నేర్పటం కోసమే తానలా చేశానని కానీ, అజ్ఞానానికి సంకేతమైన నల్లని కుండ నుంచి జ్ఞానానికి ప్రతీక అయిన తెల్లని వెన్నను దొంగిలించి తినడం ద్వారా వారికి తాను ఎన్నో సంపదలను ప్రసాదించానని కానీ, దుష్టురాక్షసులను సంహరించటం ద్వారా వారికి ముక్తిని ప్రసాదించానని కానీ చెప్పుకోలేదు. దేనికీ చలించకుండా తన స్థితప్రజ్ఞతను లోకానికి చాటిన వాడే శ్రీకృష్ణుడు. కృష్ణాష్టమి ఎలా జరుపుకోవాలంటే... ఇది యావద్భారతం చేసుకునే పండుగ. ఈ పండుగను చేసుకునేవారు ఉదయాన్నే లేచి పరిశుద్ధులై, షోడశోపచారాలతో కృష్ణుని పూజించాలి. పగలంతా ఉపవసించి సాయంకాలం చిన్నికృష్ణుని విగ్రహాన్ని ఊరేగించి, తర్వాత ఊయలలో ఉంచి, ఊపాలి. దేవకీదేవి బాలకృష్ణునికి స్తన్యమిస్తున్నట్లుగా ఉండే విగ్రహాన్ని పూజించినా మంచిదే. అనంతరం కృష్ణునికి ప్రీతికరమైన పాలు, వెన్న, పండ్లు, అటుకులు మొదలైన వాటిని నైవేద్యం పెట్టి, వాటిని ప్రసాదంగా ఆరగించడం వల్ల అన్నింటా జయం సిద్ధిస్తుందని పురాణోక్తి. ఈ పుణ్యతిథి నాడు కృష్ణుని పూజించి, భాగవత గ్రంథాన్ని పఠించినా, దానం చేసినాlసకల పాపాలూ తొలగి, చతుర్విధ ఫల పురుషార్థాలు అంటే ధర్మం, అర్థం, కామం, మోక్షం ప్రాప్తిస్తాయని స్కాందపురాణం చెబుతోంది. – డి.వి.ఆర్. భాస్కర్ సకల అవతారాలకు మూలం శ్రీ కృష్ణస్వరూపం శ్రీ కృష్ణుని ఏ చిత్రం చూసినా మనకు ప్రధానంగా కనిపించేవి ఆయన గోపసఖులతో ఆటలాడుకోవడం, గోవులను కాయటం, వన్యప్రాణుల మధ్య పిల్లన గ్రోవిని పట్టుకొని మధుర వాయిద్యం చేయటం వంటివే! భగవంతుని స్వభావం కేవలం గంభీరంగా వ్యవహరిస్తూ దుష్టులను అంతమొందించటమే కాదు. అది కేవలం ఈ విశ్వనిర్వహణకు అవసరమయ్యే గుణం మాత్రమే. అందుకు తగ్గ ఐశ్వర్య సంపన్నమైన రూపమే విష్ణు లేదా నారాయణరూపం. ఆయనున్న ఆ ఐశ్వర్యధామానికే వైకుంఠమని పేరు. సాధారణంగా విష్ణువుతో భక్తులు దాస్యరస భావనను కలిగుంటారు. అంటే, తాము భగవంతుని నిత్యసేవకులమని, దాసులమని. కాని, భగవంతుని అసలైన రూపం, స్వభావం, తన భక్తులతో షడ్రస భావనతో మెలిగే తత్త్వం కేవలం కృష్ణ స్వరూపంలో మాత్రమే సంపూర్ణంగా వీక్షించగలం. భగవంతుడు అన్యరూపాన్ని ధరించక, ఎట్టి ఐశ్వర్యతత్త్వాన్ని వెళ్లబుచ్చక మన ముందు వచ్చి నిలబడితే ఎలా ఉంటుందో, ఆ రూపమే శ్రీ కృష్ణస్వరూపం. ‘కృష్ణస్తుభగవాన్ స్వయం’ అన్నది అందుకే మరి! దేవదేవుని అవతారాలు ఎన్నైనా, అంశలు అసంఖ్యాకమైనా, శ్రీ కృష్ణుడే స్వయంభగవంతుడని ప్రబోధించారు వేదవ్యాసులవారు. ప్రస్తుతం ప్రపంచాన్ని కుదిపేస్తున్న కోవిడ్–19 సమస్త మానవాళికి ఒక ముఖ్యమైన అనుభవాన్ని చవిచూపింది. జీవితసత్యాన్ని నేర్పించింది. కోవిడ్ అంటేనే ఎంతో మంది భయభ్రాంతులకు లోనవుతున్నారు. నిత్యం దాని గురించే ఆలోచిస్తూ, మితిమీరిన భావోద్వేగాలకు ఆస్కారమివ్వటమే ఇందుకు కారణం. అందుకు బదులుగా, మన దృష్టిని శ్రీ కృష్ణుని లీలావైభవాన్ని తెలుసుకునేందుకో, కీర్తించేందుకో మరల్చగలిగితే సత్వరం ఆ భావోద్వేగాల నుండి ఉపశమనం పొందగలం. ప్రతి ఒక్కరికీ శ్రవణం, కీర్తనం, స్మరణం చేయగల సామర్థ్యాలున్నాయి. వాటిని కృష్ణుని కోసం ఎందుకు ఉపయోగించరాదు? అదే మనకు మరోధైర్యాన్ని అందించే దివ్యౌషధం. ఈ సంక్లిష్ట పరిస్థితుల్లో మనం కలత చెందకుండా మనల్ని రక్షించగలిగే ఉపాయమొక్కటే – శ్రీ కృష్ణదివ్య నామాలు, లీలలను శ్రవణం, కీర్తనం, స్మరణం చేయటం. నేడు, రేపు జరిగే శ్రీ కృష్ణజన్మాష్టమి వేడుకల సందర్భంగా, ఆరోగ్య రక్షణ సూత్రాలను పాటిస్తూ వేడుకలలో పాలుపంచుకోండి. శ్రీ కృష్ణుని దివ్యనామాలను మనసారా కీర్తించండి: నిత్యం భగవన్నామాలను జపించండి. ఆనందంగా జీవించండి. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే – శ్రీమాన్ సత్యగౌర చంద్ర ప్రభుజీ, హరేకృష్ణ మూవ్ మెంట్ హైదరాబాద్ అధ్యక్షులు అక్షయపాత్ర ఫాండేషన్ ప్రాంతీయ అధ్యక్షులు. -
కృష్ణాష్టమి వేడుకల్లో అపశ్రుతి
ఐ.పోలవరం: కృష్ణాష్టమి వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకోవడంతో ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన తూర్పు గోదావరి జిల్లా ఐ.పోలవరం మండలంలో జరిగింది. మండలంలోని కొమరగిరి గ్రామంలో శుక్రవారం రాత్రి కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా గ్రామస్తులు ఉట్టి కొట్టేందుకు ఏర్పాటు చేశారు. ఉట్టి కొట్టేందుకు సిమెంట్ స్తంభాన్ని గ్రామానికి చెందిన నడింపల్లి సత్యనారాయణ రాజు (55) పాతాడు. ఆనందోత్సాహాల మధ్య ఉట్టికొట్టే సమయంలో ప్రమాదవశాత్తు తాను పాతిన సిమెంట్ స్తంభం అతడిపై పడింది. దీంతో అతడి తలకు బలమైన గాయమైంది. స్థానికులు అతడిని ముమ్మిడివరం ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందాడు. దీనిపై ఎస్సై సత్యారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సెప్టెంబర్ 3న శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు
సాక్షి, చిత్తూరు : తిరుమలలో శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో సెప్టెంబరు3న గోకులాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా గోసంరక్షణశాలలో గోపూజ, సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టనున్నారు. గోకుల నందనుడు శ్రీకృష్ణ భగవానుని జన్మదిన మహోత్సవాన్ని గోకులాష్టమిగా నిర్వహించడం హైందవ సంప్రదాయం. హిందువుల అతిముఖ్యమైన పండుగలలో ఒకటైన జన్మాష్టమి వేడుకలు, 4న ఉట్లోత్సవాన్ని ఘనంగా నిర్వహించడానికి టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబరు 12 నుండి 21వ తేదీ వరకు జరగనున్న నేపథ్యంలో శ్రీవారి ఆర్జిత సేవలు, బ్రేక్ దర్శనాలు, ప్రత్యేక ప్రవేశ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. -
మార్మోగిన హరేకృష్ణ నామస్మరణ
- ముగిసిన కృష్ణాష్టమి వేడుకలు - ఘనంగా శ్రీల ప్రభుపాదుల జయంతి అనంతపురం కల్చరల్: నగర శివారులోని ఇస్కాన్ మందిరం హరేకృష్ణ నామస్మరణతో మార్మోగింది. మూడు రోజులుగా ఇస్కాన్ మందిరంలో అంగరంగ వైభవంగా సాగిన శ్రీకృష్ణాష్టమి వేడుకలు బుధవారంతో ముగిశాయి. ఇస్కాన్ సంస్థాపకాచార్యులు భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారి ఆవిర్భావ సందర్భాన్ని పురస్కరించుకుని మందిరంలో విశేష పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటలకు స్వామివారికి సుగంధ ద్రవ్యాలతో పంచతులసులతో కూడిన పవిత్ర జలాలతో అభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆలయంలోని రాధాపార్థసారథులను సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు, మహామంగళహారతి నిర్వహించిన అనంతరం అన్నదాన సంతర్పణ నిర్వహించారు. సాయంత్రం స్వామివారి ముందు భజనలాలపిస్తూ భక్తజనం ఆనందతాండవం చేశారు. నిర్వాహకులు దామోదర్ గౌరంగదాసు, ఇస్కాన్ సేవా సభ్యులు, కృష్ణ మఠం సభ్యులు పాల్గొన్నారు. -
వెండికొండ ఒడిలో వెన్నదొంగ!
-
గోవిందుడు అందరివాడిలే
ప్రముఖ నర్తకి వాణీగణపతి.. ఆత్మగౌరవానికి అభినయం నేర్పిన కళాకారిణి. తనకొచ్చిన నాట్యంతో నలుగురికి తెలిసే కన్నా తనతో నాట్యం తెలిసేలా చేసిన సెల్ఫ్ప్రైడ్ ఉమన్. ఖాదర్ అలీబేగ్ థియేటర్ ఫౌండేషన్ నిర్వహించిన ‘విమెన్ ఇన్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్’ కార్యక్రమంలో పాల్గొనడానికి హైదరాబాద్‌కి శనివారం వచ్చారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ‘సిటీ ప్లస్’కి స్పెషల్ అతిథి అయ్యారు. నాట్యకృష్ణుడితో, హైదరాబాద్‌తో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు! నా వరకు నాకైతే కృష్ణుడు భగవంతుడిగా కాక ఓ హ్యూమన్ బీయింగ్గానే కనిపిస్తాడు. గోవిందుడు అందరివాడు. కొడుకుగా.. మంచి స్నేహితుడిగా.. రొమాంటిక్ లవర్‌గా.. ఇన్ని రూపాల్లో కనిపిస్తాడు. ద్రౌపది వస్త్రాపహరణం, కురుక్షేత్రయుద్ధం లాంటి సమయాల్లోనే.. ఆపద్బాంధవుడిగా, లోకరక్షకుడిగా దర్శనమిస్తాడు..కానీ మిగిలిన అన్ని సమయాల్లో సామాన్యుడిలా, ఆత్మీయుడిలా ఉంటాడు. కాబట్టి ఆయన దేవుడి కన్నా మనలాంటి మనిషిగానే అనిపిస్తాడు. నాకు తెలిసినంత వరకు చాలామంది తల్లులు తమ కొడుకులను చిన్నప్పుడు కన్నా, కృష్ణా అనే పిలుచుకుంటారు. డ్యాన్స్ పెర్ఫార్మెన్స్లో కృష్ణుడితో నాదీ అదే అనుబంధం. నా పూజగదిలో సాయిబాబాతో పాటు కృష్ణుడి ప్రతిమా ఉంటుంది. ఆ విగ్రహంతో ఓ స్నేహితుడితో మాట్లాడినట్లు అన్నీ షేర్ చేసుకుంటాను. ఎందుకిలా చేశావ్? నా ప్రాబ్లం సాల్వ్చేయడానికి ఎందుకింత ఆలస్యం చేస్తున్నావ్.. అంటూ నిలదీస్తాను. ఇదే క్లోజ్‌నెస్ నా డ్యాన్స్ పెర్ఫార్మెన్స్లోనూ ఉంటుంది. కృష్ణుడి రోల్‌తో చాలా కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతాను. ‘జగదోద్ధారణ’లో నేను యశోదగా వేస్తే నట్కట్ నంద్లాల్ నిజంగా నా కొడుకుగానే కనిపిస్తాడు. జయదేవుడి అష్టపదిలో రాధగా అభినయించినప్పుడు అద్భుతమైన ప్రేమికుడి చెంతనున్నట్టు ఫీలవుతాను. ఇవన్నీ కాక నేనే కృష్ణుడిగా అభినయించినప్పుడు ఆ సమయంలో నిజంగానే కృష్ణుడిగా మారిపోతాను. అదో అలౌకిక ఆనందం! ఒకసారి నా ఫ్రెండ్ ‘ఇలా ప్రతి ప్రోగ్రామ్‌లో కృష్ణుడికి సంబంధించి ఒక్క డ్యాన్స్ చేసే బదులు కృష్ణుడి డిఫరెంట్ యాస్పెక్ట్స్, డిఫరెంట్ రోల్స్ అన్నిటినీ ఒక్కచోట కూర్చి ఓ బాలే చేయొచ్చు కదా’ అంది. అప్పుడు ‘కలర్స్ ఆఫ్ కృష్ణ’ అని ఓ నృత్యరూపకం చేశాను. హైదరాబాద్‌తో కళాత్మకబంధం హైదరాబాద్‌తో నాది కళాత్మకబంధం. నా పెళ్లయిన కొత్తలో షూటింగ్స్, ఫిల్మ్ ఫెస్టివల్స్ కోసమే ఎక్కువగా ఇక్కడికి వస్తుండేదాన్ని. ఎప్పుడైతే నాకు ఖాదిర్ అలీబేగ్ థియేటర్ ఫౌండేషన్‌తో పరిచయం ఏర్పడిందో, అప్పటినుంచి పెర్ఫార్మెన్సెస్ కోసం రావడం మొదలుపెట్టాను. ఈ ఊళ్లో నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఇక్కడి భోజనం ఇష్టపడని వాళ్లుండరేమో! షాపింగ్ గురించి అయితే చెప్పక్కర్లేదు. చార్మినార్ వెళ్లి రకరకాల గాజులు, ముత్యాలు కొనుక్కోవడం.. ఓహ్..బ్యూటిఫుల్! ఉస్మానియా యూనివర్శిటీ.. హైకోర్ట్, సాలార్జంగ్ మ్యూజియంలాంటి కట్టాడాలు.. చౌమొహల్లా , ఫలక్‌నుమా లాంటి ప్యాలెస్‌లు..హైదరాబాద్ గొప్పతనమేమంటే.. ఇది ఇప్పటికీ ఆ పాత ఆర్కిటెక్చర్.. యాంటిక్విటీని కాపాడుకుంటుండటం. ఐ ఆల్వేస్ ఎంజాయ్ హైదరాబాద్. ఐ లవ్ వెరీమచ్ దిస్ సిటీ! .:: శరాది