
సాక్షి, చిత్తూరు : తిరుమలలో శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో సెప్టెంబరు3న గోకులాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా గోసంరక్షణశాలలో గోపూజ, సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టనున్నారు. గోకుల నందనుడు శ్రీకృష్ణ భగవానుని జన్మదిన మహోత్సవాన్ని గోకులాష్టమిగా నిర్వహించడం హైందవ సంప్రదాయం. హిందువుల అతిముఖ్యమైన పండుగలలో ఒకటైన జన్మాష్టమి వేడుకలు, 4న ఉట్లోత్సవాన్ని ఘనంగా నిర్వహించడానికి టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది.
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబరు 12 నుండి 21వ తేదీ వరకు జరగనున్న నేపథ్యంలో శ్రీవారి ఆర్జిత సేవలు, బ్రేక్ దర్శనాలు, ప్రత్యేక ప్రవేశ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment