నేత్రపర్వంగా రాధాష్టమి | radhashtami in iskcon temple | Sakshi
Sakshi News home page

నేత్రపర్వంగా రాధాష్టమి

Published Tue, Aug 29 2017 10:46 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

నేత్రపర్వంగా రాధాష్టమి - Sakshi

నేత్రపర్వంగా రాధాష్టమి

అనంతపురం కల్చరల్: స్వచ్చమైన ప్రేమకు రాధాకృష్ణులే ప్రతీకలని  ప్రముఖ కృష్ణతత్వ ప్రచారకులు ఇస్కాన్‌ మందిరాల డివిజనల్‌ చైర్మన్‌ సత్యగోపీనాథ్‌ అన్నారు. రాధాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇస్కాన్‌ మందిరంలో మంగళవారం వేడుకలు నేత్రపర్వంగా జరిగాయి. ప్రత్యేక పుష్షాలతో సర్వాంగసుందరంగా రాధాపార్థసారథులను అలంకరించి వసంత శోభను నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఇస్కాన్‌ అధ్యక్షుడు దామోదర గౌరంగదాసుతో పాటు సత్యగోపీనాథ్‌ ఆధ్యాత్మిక ప్రవచనం చేశారు. సమాజంలో భక్తి భావాన్ని పెంపొందించేందుకు ఇస్కాన్‌ మందిరాలు చేపడుతున్న కృషిని వివరించారు. కార్యక్రమంలో ఇస్కాన్‌ శాశ్వత సభ్యులతో పాటు వందలాది మంది కృష్ణభక్తులు పాల్గొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement