మహిళ దారుణహత్య | Brutal murder of woman | Sakshi
Sakshi News home page

మహిళ దారుణహత్య

Published Sat, Jun 18 2016 8:16 AM | Last Updated on Mon, Sep 4 2017 2:44 AM

మహిళ దారుణహత్య

మహిళ దారుణహత్య

మృతదేహం కాల్చివేత
ఇస్కాన్ మందిరం వెనుక ఘటన

 
 
అనంతపురం : ఆధ్యాత్మిక కేంద్రమైన ఇస్కాన్ మందిరం వెనుక దారుణం చోటు చేసుకుంది. మహిళ దారుణ హత్యకు గురైంది. గుర్తు పట్టలేని విధంగా మృతదేహాన్ని కాల్చడం కలకలం రేపుతోంది. భయోత్పాతం కల్గించేలా ఉన్న ఈ ఘటన శుక్రవారం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే...అనంతపురం మండలం సోమలదొడ్డి సమీపంలోని ఇస్కాన్ (రాధా పార్థసారథి) మందిరం వెనుక జాతీయ రహదారిపై ఉన్న బ్రిడ్జి కింది భాగంలో ఓ శవం కాలిబూడిదైందనే విషయం దావానలంలా వ్యాపించడంతో చుట్టుపక్కల ప్రాంతాల వారు అక్కడికి తరలివచ్చారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న రూరల్ సీఐ కృష్ణమోహన్, ఎస్‌ఐ జగదీష్, సిబ్బంది వెళ్లి పరిశీలించారు. అగంతకులు ఆనవాళ్లు కనిపించకుండా మృతదేహాన్ని పూర్తిగా కాల్చేశారు. శరీరం నుంచి రెండుకాళ్లూ వేరయ్యాయి. హ త్యానంతరం శరీరం నుంచి కాళ్లు వేరు చేసి పెట్రోలు పోసి నిప్పు పెట్టి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


 అంతా పథకం ప్రకారమే..
 పక్కా ప్రణాళికతోనే మహిళను మట్టుబెట్టినట్లు సంఘటన స్థలాన్ని చూస్తే అర్థమవుతుంది. చేతులు, ముఖం, పొట్టభాగం, ఛాతీ ఏమాత్రం కనిపించడం లేదు. బోర్లాపడిన మృతదేహాన్ని పోలీసులు వెల్లకిలా తిప్పించారు. కాలిన మృతదేహంలో ఓ కీచైను డాలరును గుర్తించారు. అందులో ‘శక్తి  కుమార్ మిల్స్ డిపో’ అని ఇంగ్లిష్ అక్షరాల్లో ఉంది. మెడలో ఓ పూసల దండ ఉంది. కాలిలో మెట్లు లేకపోవడంతో ఆమె అవివాిహ తా? లేక వితంతువా అనేది తెలియడం లేదు. తలలో దాదాపు వెంట్రుకలు  కాలిపోయాయి. ఉన్న కాసిన్ని వెంట్రుకలు తెల్లగా కనిపిస్తున్నందున వయసు మీద పడిన మహిళ అయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. వైద్యులు బ్రహ్మాజి నేతృత్వంలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. తల వెంట్రుకలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపనున్నారు.


 త్వరలోనే కేసు ఛేదిస్తాం
 ఈ కేసును చాలెంజ్‌గా తీసుకుని ఛేదిస్తామని సీఐ కృష్ణకుమార్ అన్నారు. ఆస్తుల గొడవ కారణంగా హత్య చేశారా? ఇతర కారణాలేవైనా ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని స్టేషన్లలోనూ నమోదైన మహిళ అదృశ్యం కేసుల వివరాలను ఆరా తీస్తున్నామని సీఐ తెలిపారు. వాటి ఆధారంగా బంధువులతో మాట్లాడుతున్నామన్నారు. వీలైనంత త్వరగా నిందితులను పట్టుకుంటామని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement