
సుందరంగా ఇస్కాన్ మందిరం
అనంతపురం నగర శివారులోని సోములదొడ్డి వద్దగల ఇస్కాన్ మందిరం కృష్ణాష్టమికి సుందరంగా రూపుదిద్దుకుంటోంది. 60 అడుగుల ఎత్తులో నాలుగు అశ్వాలు రథాన్ని లాగుతున్నట్టుగా నిర్మితమైన ఇస్కాన్ మందిరం భక్తులను ఆకట్టుకుంటోంది. రాధాపార్థ సారథులు, వివిధ ఘట్టాలను తెలిపే మనోహర విగ్రహాలు మంత్రముగ్ధులను చేస్తున్నాయి. కృష్ణాష్టమిని పురస్కరించుకుని మందిరానికి నూతన రంగులతో ముస్తాబు చేస్తున్నారు. ఆగస్టు 15 నాటికి వివిధ దేవతా విగ్రహాలతో ఎగ్జిబిషన్ ప్రారంభిస్తున్నట్టు నిర్వాహకులు దామోదర గౌరంగదాసు తెలిపారు.