ఢాకా: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని ఇస్కాన్ టెంపుల్‌పై దాడి చేసి కూల్చి వేశారు. వివరాల ప్రకారం.. ఢాకాలోని లాల్‌మోహన్ సాహా వీధిలో ఉన్న ఇస్కాన్ రాధాకాంత ఆలయాన్ని సుమారు 200 మందితో కూడిన గుంపు గురువారం ధ్వంసం చేసి దోచుకుంది. ఈ దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన పలువురు గాయపడ్డారు. హాజీ షఫీవుల్లా నేతృత్వంలో ఈ దాడి జరిగినట్లు అధికారులు తెలిపారు.
కాగా, ఈ ఘటనను ఇస్కాన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ రాధారామన్ దాస్ తీవ్రంగా ఖండించారు. ఆయన ట్విటర్‌లో.. "డోల్ యాత్ర & హోలీ వేడుకల సందర్భంగా ఇది చాలా దురదృష్టకర సంఘటనని అవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు గతంలో ఢాకాలోని టిప్పుసుల్తాన్ రోడ్‌లో, చిట్టగాంగ్‌లోని కొత్వాలీలో కూడా జరిగాయి.
It's very very unfortunate incident on the eve of Dol Yatra & Holi celebrations. Just few days ago, United Nations passed a resolution declaring 15th March as International day to combat Islamophobia. We are surprised that same United Nations.....1/3 https://t.co/aMci2GdQdv
— Radharamn Das राधारमण दास (@RadharamnDas) March 18, 2022
Comments
Please login to add a commentAdd a comment