బంగారు దర్శకుని కథ | K Vishwanath:director k viswanath biopic movie viswadarsanam | Sakshi
Sakshi News home page

బంగారు దర్శకుని కథ

Published Sat, Jul 28 2018 4:10 AM | Last Updated on Sat, Jul 28 2018 4:10 AM

K Vishwanath:director k viswanath biopic movie viswadarsanam - Sakshi

వివేక్‌ కూచిభొట్ల, జనార్దన మహర్షి, కె. విశ్వనాథ్, తనికెళ్ల భరణి, టి.జి. విశ్వప్రసాద్‌

దక్షిణాది చలన చిత్రసీమ గర్వించదగ్గ దర్శకులు కె.విశ్వనాథ్‌ జీవితం వెండితెరపైకి రానుంది. రచయిత, డైరెక్టర్‌ జనార్ధన మహర్షి దర్శకత్వంలో ‘విశ్వదర్శనం’ పేరుతో ఈ చిత్రం తెరకెక్కనుంది. ‘వెండి తెర చెప్పిన బంగారు దర్శకుని కథ’ అన్నది ట్యాగ్‌లైన్‌. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి.జి.విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు గురుపూర్ణిమ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లో జరిగాయి.

కె. విశ్వనాథ్‌ దంపతులు, నటుడు తనికెళ్ల భరణి, చిత్రనిర్మాత టి.జి. విశ్వప్రసాద్, చిత్ర సహనిర్మాత వివేక్‌ కూచిభొట్ల సినిమా స్క్రిప్ట్‌ని జనార్ధన మహర్షికి అందజేశారు.  ‘‘విశ్వనాథ్‌గారి చరిత్ర పలువురికి ఆదర్శం. ఇలాంటి మహనీయుడి చరిత్రను చూపించాలనే ఆకాంక్షతో ఈ చిత్రానికి శ్రీకారం చుట్టాం. ఆయన పుట్టుక నుంచి ఇప్పటి వరకూ ఆయన జీవితం ఎలా సాగింది? అనే నేపథ్యంలో కథ సాగుతుంది. ఆగస్టులో రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభిస్తాం. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో ప్రకటిస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. సంగీతం: స్వరవీణాపాణి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement