vivek kuchibhotla
-
టాలీవుడ్ అగ్ర నిర్మాతపై అసభ్యకర కామెంట్స్.. ప్రముఖ సినీ రచయితపై కేసు.!
సినీ మాటల రచయిత రాజసింహపై కేసు నమోదైంది. ప్రముఖ నిర్మాత కూచిబొట్ల సుబ్రహ్మణ్య వివేకానంద ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే కథల విషయంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన వివాదమే కారణమని తెలుస్తోంది. రాజాసింహ తన కుటుంబ సభ్యులకు అసభ్యకరమైన, బెదిరింపు సందేశాలు పంపిస్తున్నట్లు వివేకానంద ఫిర్యాదులో పేర్కొన్నారు. తన ప్రతిష్టను అగౌరవపర్చేలా సామాజిక మాధ్యమాల్లోనూ సందేశాలు పెట్టాడని ఆయన ఆరోపించారు. అంతే కాకుండా దర్శకుడు రాఘవేంద్రరావు, వైవీఎస్ చౌదరి, ఠాగూర్ మధు లాంటి వారిని సైతం దూషిస్తూ సందే శాలు పెట్టాడని కూచిబొట్ల గురువారం పోలీసులను ఆశ్రయించారు. దీంతో జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసున్నారు. అసలు రాజాసింహ ఎవరు? ఇదిలా ఉండగా.. రాజసింహ తడినాడ దాదాపు 60 సినిమాలకు పైగా రచయితగా పనిచేశాడు. అల్లు అర్జున్ నటించిన ‘రుద్రమదేవి’ సినిమాకి డైలాగ్ రైటర్‌గా పని చేశారు. ఆ సినిమాలో అల్లు అర్జున్ పోషించిన ‘గోన గన్నా రెడ్డి’ పాత్రకి రాజసింహ రాసిన డైలాగులకి చాలా మంచి గుర్తింపు వచ్చింది. అదే క్రేజ్‌తో దర్శకుడిగా మారిన రాజసింహ.. యంగ్ హీరో సందీప్ కిషన్‌తో 'ఒక అమ్మాయి తప్ప' అనే సినిమా చేశాడు. ఈ మూవీ ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో రాజసింహకి సినిమా అవకాశాలు తగ్గాయి. అయితే పర్సనల్ లైఫ్‌లో ఇబ్బందుల కారణంగా రాజసింహ గతంలో ఒకసారి ఆత్మహత్యాయత్నం చేశాడు. అప్పటినుంచి రాజసింహ బయట పెద్దగా కనిపించడం లేదు. -
అన్నదమ్ముల అనుబంధం
సంపూర్ణేష్ బాబు, సంజోష్, ్ర΄ాచీ బన్సాల్, ఆర్తీ గు΄్తా కీలక ΄ాత్రల్లో నటించిన చిత్రం ‘సోదరా’. మన్మోహన్ మేనంపల్లి దర్శకత్వం వహించారు. చంద్ర చంగళ్ల నిర్మించిన ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని నిర్మాత వివేక్ కూచిభొట్ల రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో వినోదాత్మకంగా ‘సోదరా’ను రూ΄÷ందించాం. ఇటీవలే విడుదలైన మోషన్ ΄ోస్టర్‌కి మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాని త్వరలోనే విడుదల చేయనున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సునీల్ కశ్యప్, కెమెరా: జాన్. -
ఆ ప్రయత్నంలో విజయం సాధించాం
‘‘ఆదిపురుష్’ చిత్రాన్ని ఆదివారం వరకు ప్రపంచవ్యాప్తంగా కోటి మంది ప్రేక్షకులు చూశారు. అందుకే ఈ ప్రెస్‌మీట్‌ని రామకోటి ఉత్సవం అని పిలిచాం. రామ నామాన్ని ప్రతి గడపకు చేర్చాలన్నదే యూనిట్ ఆలోచన. ఆ ప్రయత్నంలో విజయం సాధించడం సంతోషంగా ఉంది’’ అని సహ నిర్మాత వివేక్ కూచిభొట్ల అన్నారు. ప్రభాస్ శ్రీరాముడిగా, కృతీసనన్ సీత పాత్రలో నటించిన చిత్రం ‘ఆదిపురుష్’. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 16న పాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ తెలుగులో రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో ‘రామ జయం, రఘురామ జయం’ పేరుతో నిర్వహించిన సక్సెస్ మీట్లో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘ఆదిపురుష్’ చిత్రాన్ని నైజాంలో దాదాపు 500 స్క్రీ¯Œ ్సకి పైగా రిలీజ్ చేశాం. తొలి రోజు నైజాంలో 13.65 కోట్లు, రెండో రోజు దాదాపు 8 కోట్లు వసూళ్లు వచ్చాయి’’ అన్నారు. ఈ కార్యక్రమంలో పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి, మాటల రచయిత భీమ్ శ్రీనివాస్ మాట్లాడారు. -
రావణుడు లుక్‌పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత.. అందుకే ఇలా!
ప్రభాస్ 'ఆదిపురుష్' థియేటర్లలో సంచలనాలు సృష్టిస్తోంది. టాక్ తో సంబంధం లేకుండా మూడు రోజుల్లోనే రూ.340 కోట్లు కలెక్షన్స్ సాధించి, రికార్డులు తిరగరాస్తోంది. అదే టైంలో ఈ సినిమాలో పాత్రలు, వాటి గెటప్స్ పై ఇప్పటికే ట్రోలింగ్ జరుగుతూనే ఉంది. మరీ ముఖ్యంగా రావణుడి లుక్ పై ఘోరంగా విమర్శలు వస్తున్నాయి. అసలు రావణుడి పాత్ర ఎందుకు అలా డిజైన్ చేయాల్సి వచ్చిందనేది నిర్మాత వివేక్ కూచిభొట్ల ఇప్పుడు కాస్త క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. టీ సిరీస్ సంస్థ నిర్మించిన 'ఆదిపురుష్'ని తెలుగులో ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పంపిణీ చేసింది. దాదాపు రూ.185 కోట్లు పెట్టి హక్కుల్ని కొనుగోలు చేసింది. సరే అదంతా పక్కనబెడితే మూడురోజుల్లో అంటే ఆదివారం వరకు ఈ సినిమాను కోటి మందికి పైగా చూశారు. దీంతో 'రామకోటి ఉత్సవం' పేరిట హైదరాబాద్ లో సోమవారం ఓ కార్యక్రమం నిర్వహించారు. ఇందులోనే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాత వివేక్ కూచిభొట్ల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీలోకి 22 సినిమాలు.. ఆ ఒక్కటి మాత్రం!) 'చిన్నపిల్లలకు అర్థమయ్యేలా ఓ సినిమా తీయాలి. రామాయణం అంటే పాతకాలంలాగా సంస్కృత పద్యాలు, డైలాగ్స్ తో సినిమా తీస్తే.. అప్డేట్ అవ్వండ్రా అని మీరే అంటారు. ఇప్పుడేమో అప్డేట్ అయి సినిమా తీస్తే.. మళ్లీ రావణాసురుడు ఏంటి ఇలా ఉన్నాడు? వాళ్లేంటి ఇలా ఉన్నారు? వీళ్లేంటి ఇలా ఉన్నారని అంటున్నారు. మీరు చూడలేదు, మేము చూడలేదు. మీ ఊహకు రావణాసురుడిని ఒకలా ఊహించుకున్నారు. మా ఊహకు రావణాసురుడిని ఒకలా ఊహించుకున్నాం.' 'కానీ ఈ సినిమాలో ఎక్కడా చరిత్రని తప్పుదోవ పట్టించలేదు. రాముడు ధీరోదాత్తుడు, సకలాగుణాభిరాముడు అనే చూపించారు. మంచి చెప్పడానికి.. ఈ రోజు పిల్లలకు అర్థమయ్యేటట్టు.. అంటే ఈ రోజు పిల్లలని తీసుకుంటే థార్, హల్క్, డిస్నీ క్యారెక్టర్స్ అన్నీ తెలుసు. కానీ వాళ్లకు జాంబవంతుడు, సుగ్రీవుడు, అంగదుడు అంటే ఎవరో తెలుసా? తెలియదు. బ్యాట్ మ్యాన్ ఫొటో చూపిస్తే వెంటనే గుర్తుపడతారు. అంగదుడిని గుర్తుపట్టలేరు. ఈ రకంగా అయినా మన పిల్లలకు రామాయణంలోని పాత్రలు పిల్లలకు తెలిసే అవకాశముంటుంది' అని నిర్మాత వివేక్ కూచిబొట్ల చెప్పుకొచ్చారు. (ఇదీ చదవండి: ‘ఆదిపురుష్’ ఎఫెక్ట్.. అక్కడ భారత్ సినిమాలపై నిషేధం!) -
సెకండ్ ఇన్నింగ్స్‌తో నా జీవితమే మారిపోయింది.. ఇప్పుడు ఆ ఒత్తిడి లేదు
‘‘గతంలో నేను చేసిన ‘శివరామరాజు’ చిత్రం అన్నదమ్ముల కథే. ఆ సినిమా చూశాక విడిపోయిన 24 కుటుంబాలు మళ్లీ కలిశాయి. ‘రామబాణం’ కూడా చాలా మంచి ఉద్దేశంతో చేసిన సినిమా’’ అని నటుడు జగపతిబాబు అన్నారు. గోపీచంద్, డింపుల్ హయతి జంటగా శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రామబాణం’. టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. వివేక్ కూచిభొట్ల సహనిర్మాత. ఈ చిత్రం రేపు (శుక్రవారం) విడుదలవుతోంది. ఈ మూవీలో కీలక పాత్ర చేసిన జగపతిబాబు విలేకరులతో చెప్పిన విశేషాలు. ► ఇండస్ట్రీలో ఇప్పుడు హారర్, యాక్షన్, థ్రిల్లర్ సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి... సెంటిమెంట్ తగ్గింది. నెగిటివిటీ పెరిగింది. సినిమా ఎంత క్రూరంగా ఉంటే అంత బావుంటోంది.. అందుకే నేను సక్సెస్ అయ్యాను (నవ్వుతూ). అయితే అంత నెగిటివిటీ లోనూ పాజిటివిటీ ఉందని చెప్పడానికి ‘రామబాణం’ వస్తోంది. ► సెకండ్ ఇన్నింగ్స్‌లో నేనిప్పటి వరకూ 70కిపైగా పాత్రలు చేశా. అయితే చెప్పుకోడానికి ఏడెనిమిది సినిమాలే ఉన్నాయి. కొందరు నన్ను సరిగ్గా వాడుకోలేదు. కానీ ‘రామబాణం’ విషయంలో అలా కాదు. ఈ చిత్రాన్ని బలంగా మలిచాడు శ్రీవాస్. ఇందులో ఆర్గానిక్ ఫుడ్ ప్రాధాన్యతని చక్కగా చూపించాం. ► నేను హీరో కాదు.. విలన్ కాదు.. యాక్టర్‌ని. అందులోనూ డైరెక్టర్స్ యాక్టర్‌ని. మన నుంచి వాళ్లు ఏం రాబట్టుకోవాలనుకుంటున్నారో వారి కళ్లు చూస్తే అర్థమౌతుంది. నాకు ఎప్పుడైనా కథే ముఖ్యం. కాంబినేషన్ కాదు. పాత్ర నచ్చకపోతే కుదరదని చెబుతున్నాను. ► సెకండ్ ఇన్నింగ్స్‌తో నా జీవితమే మారిపోయింది. హీరో అనేది పెద్ద బాధ్యత.. ఒత్తిడి ఉంటుంది. కానీ, ఇప్పుడు ఆ ఒత్తిడి లేకపోవడంతో నటనపైనే దృష్టి పెడుతున్నాను. ► చిన్న సినిమా అనేది ఉండదు. హిట్ అయితే అదే పెద్ద సినిమా అవుతుంది. నాకు డబ్బు ముఖ్యం కాదు.. పాత్ర, సినిమా ముఖ్యం. సల్మాన్ ఖాన్‌తో చేసిన ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ తర్వాత బాలీవుడ్ నుంచి కూడా అవకాశాలు వస్తున్నాయి. గాడ్ ఫాదర్ లాంటి పాత్ర చేయాలని ఉంది. అలాగే ‘గాయం’కి మరో స్థాయిలో ఉండే పాత్ర చేయాలనే ఆసక్తి ఉంది. ప్రస్తుతం నేను చేస్తున్న నాలుగైదు సినిమాలు పెద్ద బ్యానర్స్లోనివే. -
రామబాణం మంచి సినిమా
‘‘రామబాణం’లాంటి మంచి కథ ఇచ్చిన భూపతి రాజాగారికి థ్యాంక్స్. మంచి కమర్షియల్ ఫార్మాట్లో అద్భుతమైన ఎమోషన్స్‌తో ఈ కథ ఉంటుంది.. దాన్ని అంతే బాగా తీశాడు శ్రీవాస్. మా గత చిత్రాలు ‘లక్ష్యం, లౌక్యం’ లాగా ‘రామబాణం’ లోనూ మంచి వినోదం, ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి’’ అని హీరో గోపీచంద్ అన్నారు. శ్రీవాస్ దర్శకత్వంలో గోపీచంద్, డింపుల్ హయతి జంటగా నటించిన చిత్రం ‘రామబాణం’. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మించిన ఈ సినిమా ఈ నెల 5న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా ఆదివారం నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో గోపీచంద్ మాట్లాడుతూ– ‘‘విశ్వ ప్రసాద్, వివేక్గార్లు ఎంత మంచి నిర్మాతలంటే.. ఏది కావాలని అడిగినా.. ‘ఇది ఎందుకు?’ అని అడగరు.. అలాంటి మంచి మనసున్న వారికి మంచి జరగాలి. ‘రామబాణం’ చాలా మంచి సినిమా అవుతుంది. ఈ చిత్రం తర్వాత డింపుల్‌కి మంచి భవిష్యత్ ఉంటుంది. ‘లక్ష్యం’ తర్వాత జగపతి బాబుగారు, నేను మళ్లీ ఈ చిత్రంలో అన్నదమ్ముల్లా చేశాం.. ఆయనతో చేస్తుంటే యాక్టర్ అని కాకుండా సొంత బ్రదర్‌లా అనిపిస్తారు.. అందుకే మా ఇద్దరి మధ్య సన్నివేశాలు, ఎమోషన్స్ బాగా పండాయి. నాది, అలీగారి కాంబినేషన్ చాలా బాగుంటుంది. 5న వస్తున్న ‘రామబాణం’ మీ అందరికీ (ఫ్యాన్స్, ఆడియన్స్) నచ్చుతుంది’’ అన్నారు. డైరెక్టర్ శ్రీవాస్ మాట్లాడుతూ – ‘‘రామబాణం’ నిర్మాతలు విశ్వప్రసాద్, వివేక్గార్లు, నా లక్కీ హీరో గోపీచంద్‌గారు.. ఎలాంటి వివాదాలు లేకుండా పాజిటివ్‌గా ఉంటారు. అలా మా అందరి కాంబినేషన్లో సినిమా అనగానే ఓ పాజిటివ్ వైబ్రేషన్. హ్యాట్రిక్ కాంబినేషన్ అంటూ మా మనసులో ఓ ఆలోచన తిరుగుతూ ఉండేది.. అది మాకు మరింత నమ్మకాన్ని, సంకల్పాన్ని ఇచ్చింది. ‘రామబాణం’ ఫస్ట్‌కాపీ చూసిన తర్వాత నా అసిస్టెంట్ డైరెక్టర్స్.. ‘టెక్నీషియన్స్ అని మరచిపోయి సినిమా చూశాం’ అన్నారు.. అంటే సినిమాలో అంత లీనమయ్యారు.. ప్రేక్షకులు కూడా ఇదే అనుభూతికి లోనవుతారు. మా ‘లక్ష్యం, లౌక్యం’లకు మించి ‘రామబాణం’ పెద్ద హిట్ కావాలి. ఈ సినిమా ఎట్టి పరిస్థితిల్లోనూ గోపీచంద్‌గారి అభిమానుల అంచనాలకు తగ్గదు’’ అన్నారు. సహ నిర్మాత వివేక్ కూచిభొట్ల మాట్లాడుతూ–‘‘రామబాణం’ లాంటి మంచి సినిమా తీశాం. ఈ చిత్రానికి మీరు(ప్రేక్షకులు) మంచి విజయాన్ని అందిస్తారని ఆశిస్తున్నాం’’ అన్నారు. ‘‘గోపీచంద్ 30 సినిమాలు చేస్తే దాదాపు 25 సినిమాల్లో తనతో కలిసి నేను నటించాను’’అన్నారు నటుడు అలీ. ఈ వేడుకలో నిర్మాత కేకే రాధామోహన్, డైరెక్టర్స్ మారుతి, సంపత్ నంది, కార్తీక్ దండు, హర్ష, రచయిత కోనా వెంకట్, నటులు సోనియా చౌదరి, కాశీ విశ్వనాథ్, సప్తగిరి, తరుణ్ అరోరా తదితరులు పాల్గొన్నారు. -
పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్
‘‘శ్రీవాస్‌గారితో ‘లక్ష్యం, లౌక్యం’ సినిమాలు చేశాను. మూడో సినిమాగా ‘రామబాణం’ చేద్దామనుకున్నప్పుడు ఆ రెండు సినిమాల్లా పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయాలనుకున్నాం. అలాగే చేశాం. ‘రామబాణం’ వంటి మంచి సినిమా తీసిన విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్లగార్లకు థ్యాంక్స్. అందరికీ మా సినిమా తప్పకుండా నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అని హీరో గోపీచంద్ అన్నారు. శ్రీవాస్ దర్శకత్వంలో గోపీచంద్, డింపుల్ హయతి జంటగా నటించిన చిత్రం ‘రామబాణం’. టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమా మే 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో శ్రీవాస్ మాట్లాడుతూ– ‘‘రామబాణం’ ఔట్పుట్ చూశాక నమ్మకంగా ఉన్నాం. ఇంటర్వెల్, క్లయిమాక్స్ హైలెట్ అవుతాయి. సెకండ్ హాఫ్‌లోని భావోద్వేగ సన్నివేశాలు కుటుంబ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయి’’ అన్నారు. ‘‘ఈ వేసవిలో ప్రతి ఫ్యామిలీ చూడదగ్గ సినిమా ఇది’’ అన్నారు సహనిర్మాత వివేక్ కూచిభొట్ల. -
విశ్వనాథ్‌గారు ఆ నమ్మకాన్ని ఇచ్చారు
‘‘కె.విశ్వనాథ్‌గారు వృత్తి పరంగా, ప్రవృత్తి పరంగా (నటుడిగా) పరిపూర్ణమైన జీవితం అనుభవించారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకున్నా ఆణిముత్యాల్లాంటి సినిమాల ద్వారా శాశ్వితంగా మన మనసుల్లో ఉంటారు’’ అని హీరో చిరంజీవి అన్నారు. ఫిబ్రవరి 19న(ఆదివారం) కె.విశ్వనాథ్ జయంతి. ఈ సందర్భంగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూఛిబొట్ల ఆధ్వర్యంలో ‘కళాతపస్వికి కళాంజలి’ కార్యక్రమం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ వేడుకకి ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి మాట్లాడుతూ–‘‘కె.విశ్వనాథ్‌గారి జయంతిని మనం ఒక సంబరంలా జరుపుకోవాలి. ఆయన వదిలి వెళ్లిన కీర్తి, తీపి జ్ఞాపకాలు మనకు మిగిలిన గొప్ప అనుభవాలు.. జీవితాంతం మనం గుర్తుకు తెచ్చుకుని సంతోషించే ఆయన గుర్తులు. మూడు సినిమాల్లో నాకు అద్భుతమైన పాత్రలు ఇచ్చి, నాకు అవార్డులు తీసుకొచ్చిన నటనను నా నుంచి రాబట్టిన దర్శకుడాయన. నటనలో మెళకువలు చెబుతూ, హావభావాలు ఎలా పలికించాలో గురువులా నేర్పించారు. షూటింగ్ చేస్తున్నప్పుడు నన్ను ఒక నటుడిలాగా కాకుండా ఓ బిడ్డలాగా ఆయనతో పాటు కూర్చొబెట్టుకునేవారు. కంచిలో ఓ సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు ఆయన పెరుగు అన్నం కలిపించి నాకు పంపించినప్పుడు తినకుండా ఎలా కాదనగలను? ఆ సమయంలో ఓ తండ్రిలాగా అనిపించారాయన. యాక్షన్ హీరోగా నిలదొక్కుకుంటున్న సమయంలో ఆయనతో తొలిసారి ‘శుభలేఖ’ చేసే అవకాశం వచ్చింది. ఆయన చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారని తెలియడంతో కొంచె టెన్షన్‌గా ఉండేది. డైలాగులు ఫాస్ట్‌గా కాదు.. అర్థమయ్యేలా కరెక్ట్‌గా పలకాలని చెప్పారాయన. ఆయన ఓ అద్భుతమైన నటుడు.. మన నుంచి ఒరిజినాలిటీని రాబట్టుకుంటారు. నేను కూడా క్లాసికల్ డ్యాన్స్ చేయగలను అనే నమ్మకాన్ని ఇచ్చింది విశ్వనాథ్‌గారు. నేను మాస్ హీరోగా దూసుకెళుతున్న సమయంలో ‘స్వయం కృషి’ లాంటి మంచి సందేశాత్మక చిత్రం చేయించారాయన. ‘ఆపద్బాంధవుడు’ చిత్రంలో ఓ సీన్ కోసం ఆయనవద్దకు వెళ్లి రాత్రి రిహార్సల్స్ చేశాను.. మరుసటి రోజు ఆ సన్నివేశం అద్భుతంగా వచ్చింది. ఎమోషన్స్‌ని అద్భుతంగా తీయగలరు విశ్వనాథ్‌గారు. ఆయన వద్ద నేను నేర్చుకున్న అంశాలను నాతో పనిచేస్తున్న దర్శకులకు చెబుతుంటాను. విశ్వనాథ్‌గారి వద్ద పనిచేసే అవకాశం రావడం నా అదృష్టం’’ అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ–‘‘యువహీరో తారకరత్న పరమదించడం బాధగా ఉంది’’ అన్నారు. ‘కళాతపస్వికి కళాంజలి’ లో కె.విశ్వనాథ్‌తో పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు జ్ఞాపికలు అందించారు. ఈ సందర్భంగా ఆయనతో తమకున్న అనుబంధాలను వారు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో కె.విశ్వనాథ్ పెద్దబ్బాయి కె.నాగేంద్ర నాథ్, ఆర్.నారాయణ మూర్తి, కె.రాఘవేంద్ర రావు, రమేశ్ ప్రసాద్, కేఎస్ రామారావు, ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, మాజీ ఎంపీ ‘కళాబంధు’ టి.సుబ్బరామి రెడ్డి, ‘శంకరాభరణం’ ఝాన్సీ, మంజు భార్గవి, శివలెంక కృష్ణప్రసాద్, మురళీ మోహన్, సి.అశ్వినీదత్, దామోదర్ ప్రసాద్, సుమలత, రాజశేఖర్, అలీ, భానుచందర్, శేఖర్ కమ్ముల తదితరులు పాల్గొన్నారు. -
షూటింగ్స్‌కి స్టార్ హీరోలు రెడీయా?
షూటింగ్స్ చేసుకోండి అని రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చేసింది. కొన్ని గైడ్‌లైన్స్ సూచిస్తూ కేంద్ర ప్రభుత్వం కూడా రైట్ రైట్ అంది. చిన్న చిన్నగా చిన్న సినిమాలు ప్రారంభమయ్యాయి. మరి భారీ సినిమాల సంగతేంటి? షూటింగ్స్‌కి స్టార్ హీరోలు రెడీయా? కరోనా తగ్గేవరకూ నో కాల్షీట్.. వ్యాక్సిన్ వచ్చే వరకూ నో క్యారవ్యాన్... అంటున్నారా? లేదా రంగంలోకి దిగేద్దాం. షూటింగ్ చేసేద్దాం అంటున్నారా? పెద్ద బడ్జెట్ సినిమాలు ప్రారంభించడానికి నిర్మాతలు సిద్ధమా? ప్రస్తుతం చిత్రీకరణల గురించి ఇండస్ట్రీలో ఏమనుకుంటున్నారు? ఇదే విషయాలను పలువురు నిర్మాతలను అడిగాం. వాళ్లు ఈ విధంగా చెప్పారు. ఆ విశేషాలు. షూటింగ్‌లు చేయాల్సిందే – దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ప్రస్తుతం షూటింగ్‌లు చేసేవాళ్లు చేస్తున్నారు. కానీ జాగ్రత్తలు తీసుకుని చేసుకోవాలి. ఇప్పటికే కార్మికులు ఎంతోమంది ఉపాధి కోల్పోయారు. కరోనా అనేది రెండు నెలలో, మూడు నెలలో అనుకుంటే షూటింగ్‌లైనా, మిగతా పనులైనా ఆపి కూర్చోవచ్చు. కరోనా మరో రెండు, మూడేళ్లు ఖచ్చితంగా ఉంటుంది. అప్పటివరకు పనులు చేయకుండా ఇంట్లోనే కూర్చుంటే ఎలా గడుస్తుంది? అందుకని షూటింగ్ చేయటం అవసరం అనుకున్న ప్రతి ఒక్కరూ కరోనా వస్తుందనుకొని ప్రిపేర్ అయ్యి షూటింగ్‌లు చేసుకోవాల్సిందే. అప్పుడే వారికి ఉపాధి దొరుకుతుంది. ఇప్పటికే ఫిల్మ్ ఇండస్ట్రీలో పని చేసేవాళ్లు చాలా బ్యాడ్ పొజిషన్లో ఉన్నారు. కష్టాల నుంచి బయటపడాలంటే తప్పనిసరిగా వర్క్ చేయాల్సిందే. ఒకవేళ ఎవరికైనా షూటింగ్లో పాల్గొన్నపుడు కరోనా వస్తే భయపడకుండా ఆ రిస్క్‌ను తీసుకోవటానికి సిద్ధంగా ఉండాల్సిందే. తప్పదు మరి. కోట్ల రూపాయలు ఆదాయం వచ్చే బడా నిర్మాతలు, హీరోలు ఇప్పట్లో షూటింగ్‌లు చేయకపోయినా పర్లేదు. మధ్యస్తంగా ఉండేవారు తప్పనిసరిగా షూటింగ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం షూటింగ్ అంటే రిస్కే – ఎఫ్డీసీ చైర్మన్, నిర్మాత పి. రామ్మోహన్రావు రెండు నెలల క్రితమే రెండు తెలుగు రాష్ట్రాలు షూటింగ్‌లు చేసుకోవచ్చని పర్మిషన్ ఇచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు పర్మిషన్ ఇవ్వటంలో కొత్త పాయింటేం లేదు. ఏదేమైనా షూటింగ్లలో పాల్గొనటమా? లేదా అనేదే ఇక్కడ ప్రశ్న? ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో షూటింగ్లో పాల్గొనటం లైఫ్ రిస్కే. కానీ రిస్క్ అయినా çఫర్వాలేదు షూటింగ్ చేద్దాం అనుకునేవాళ్లు చేస్తున్నారు. వారి జాగ్రత్తలు వారు తీసుకుంటున్నారు. కాకపోతే పెద్ద నటీనటులెవరూ షూటింగుల్లో పాల్గొనటం లేదు. ప్రస్తుతానికి ఈ పరిస్థితి ఎన్నాళ్లు ఉంటుందో ఖచ్చితంగా చెప్పలేం. నేను, సునీల్ నారంగ్ నిర్మిస్తోన్న ‘లవ్‌స్టోరీ’ చిత్రం షూటింగ్‌ను సెప్టెంబర్ 7 నుండి చేయటానికి ప్లాన్ చేస్తున్నాం. హీరో నాగచైతన్య, దర్శకుడు శేఖర్ కమ్ముల షూటింగ్ చేయడానికి ముందుకొచ్చారు. కేవలం 15మందితో ఈ షూటింగ్‌ను ప్లాన్ చేస్తున్నాం. వారందరికీ మొదట కరోనా టెస్టులు చేయిస్తాం. అలాగే షూటింగ్ జరిగినన్ని రోజులూ ఎవరూ ఇంటికి వెళ్లం. అందరికీ లొకేషన్ దగ్గరే బస ఏర్పాటు చేయబోతున్నాం. షూటింగ్‌కి తొందరపడటంలేదు – పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ భాగస్వామి వివేక్ కూచిభొట్ల మేం ప్రస్తుతానికి చిన్న చిన్న ప్యాచ్ వర్క్ పనులు చేస్తున్నాం. ఎక్కువ క్రౌడ్ ఉండే సినిమాల షూటింగ్ చేయదలచుకోలేదు. ప్రస్తుతం పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో నాగశౌర్య ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’, సందీప్ కిషన్ ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’, శ్రీవిష్ణు ‘రాజ రాజ చోర’ సినిమాలు చేస్తున్నాం. కార్తికేయతో ఓ సినిమా చేస్తున్నాం. ఆ సినిమా చిత్రీకరణ ఫారిన్లో జరపాలి. ప్రస్తుతానికి షూటింగ్స్ చేయడంలేదు. థియేటర్స్ ఎప్పుడు తెరుస్తారో తెలియదు. అందుకే రిలీజ్ డేట్స్ కూడా ఫిక్స్ చేసుకోలేం. దాని వల్ల తొందరపడి షూటింగ్స్ స్టార్ట్ చేయాలని కూడా అనుకోవడం లేదు. కొన్ని రోజుల్లో ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’ సినిమా చిత్రీకరణ ప్రారంభించాలనుకుంటున్నాం. అది కూడా సీన్లో ఎక్కువ మంది జనం లేని సన్నివేశాలే ముందు షూట్ చేస్తాం’’ అన్నారు. ధైర్యం ఉన్నోళ్లు చేసుకోవచ్చు – నిర్మాత డి. సురేశ్‌బాబు ప్రభుత్వం షూటింగ్‌లు చేసుకోవచ్చని చెప్పింది. అలాగే కొంతమంది షూటింగ్‌లు చేసుకుంటున్నారు కూడా. కానీ మా బ్యానర్లో తీసే సినిమాల షూటింగ్‌లు చేయటానికి మరో రెండు, మూడు నెలల సమయం పడుతుంది. నా ఆర్టిస్టులు, టెక్నీషియన్ల ఆరోగ్య భద్రత ఎంతో ముఖ్యం. అది నేనివ్వగలనని గ్యారంటీ లేదు. మా బేనర్లో తీస్తున్న ఓ సినిమాకి 27 రోజుల షూటింగ్ మిగిలి ఉంది. అవన్నీ యాక్షన్ సీక్వెన్స్‌లే. ప్రతి సీన్లో దాదాపు 50 నుంచి 100 మంది జూనియర్ ఆర్టిస్టులతో పాటు మెయిన్ ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ కలిపితే 150మంది వరకు అవుతారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అంతమందిని కాపాడగలమని నమ్మకం లేదు. రోడ్ మీదకి వెళ్లినప్పుడు మాస్క్ వేసుకుని వెళ్లాలని చెప్తే దాన్ని కూడా కొంతమంది సరిగ్గా ఆచరించటం లేదు. దాదాపు 30 శాతం మంది మాస్క్ పెట్టుకోమంటే అదేదో తప్పులా ఫీలవుతున్నారు. ఆ సంగతలా ఉంచితే ఇప్పుడు నేను త్వరత్వరగా షూటింగ్ పూర్తి చేసుకుని ఎక్కడ విడుదల చేయాలి? నేను వ్యక్తిగతంగా నా ఫ్యామిలీతో కానీ స్నేహితులతో కానీ సినిమా థియేటర్‌కి వెళ్లి ఇప్పట్లో సినిమా చూడను. కారణం ఏంటంటే క్లోజ్డ్ ఏసీ థియేటర్లలో ముక్కుకి, మూతికి మాస్క్ పెట్టుకుని నవ్వొస్తే నవ్వకుండా సినిమా ఫీల్‌ను ఎంజాయ్ చేయలేను. ఉపాధి కోసం షూటింగ్ చేయటం మంచిదే కానీ దాన్ని ఎవరు ఏ విధంగా హ్యాండిల్ చేస్తారనేది ఇక్కడ పాయింట్. ఉదాహరణకు టీవీ వాళ్లు ఉన్నారు. వాళ్లు ఈ రోజు షూటింగ్ చేసి ఆ కంటెంట్‌ను అమ్మితే ఓ యాభైవేల రూపాయలు లాభం వస్తుంది అనే గ్యారంటీ ఉంటుంది కాబట్టి వాళ్లు చేయొచ్చు. సినిమావాళ్లకి ఆ గ్యారంటీ ఎక్కడ ఉంటుంది? ఉపాధి కోసమే కదా బాలూ (ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం)గారు షూటింగ్ చేసింది. ఆయన పరిస్థితేంటి? లక్కీగా బయటపడ్డారు కాబట్టి సరిపోయింది. లేకుంటే ఆయనకు, సినిమా పరిశ్రమకు ఎంత నష్టం జరిగేది. షూటింగ్ చేయటం, చేయకపోవటం అనేది పూర్తిగా వ్యక్తిగతం. కొంతమందికి చాలా ధైర్యం ఉంటుంది. వాళ్లు చేసుకోవచ్చు. నాలాంటి వాళ్లకు ధైర్యం ఉండదు. పరిస్థితులన్నీ నార్మల్ అయ్యాక, అన్నీ సక్రమంగా ఉన్నప్పుడే షూటింగ్స్ మొదలుపెడతాను. -
వినోదం.. వినూత్నం
వైవిధ్యంతో కూడిన కథలను ఎంచుకుంటూ హీరోగా సినిమాలు చేస్తుంటారు శ్రీవిష్ణు. తాజాగా మరో విభిన్న కథలో హీరోగా నటించబోతున్నారు. శ్రీవిష్ణు హీరోగా నటించిన ‘మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా’ చిత్రాలకు దర్శకత్వ శాఖలో పని చేసిన హాసిత్ గోలి ఈ సినిమాతో దర్శకునిగా పరిచయం కానున్నారు. టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాను నిర్మించనున్నారు. వివేక్ కూచిభొట్ల, కీర్తీ చౌదరి సహ–నిర్మాతలు. ‘‘వినూత్నమైన కథతో వినోదభరితంగా ఈ చిత్రం తెరకెక్కనుంది. జనవరిలో చిత్రీకరణ మొదలుపెడతాం. ఈ సినిమాకు వివేక్ సాగర్ సంగీతం అందిస్తారు. వేదరామన్ కెమెరామేన్‌గా పని చేస్తారు’’అని చిత్రబృందం పేర్కొంది. -
నాన్నా... ఈ సినిమా మీ కోసమే
‘‘వెంకీమామ’ పక్కా తెలుగు చిత్రం. వల్గారిటీ తప్ప సినిమాలో అన్ని అంశాలు ఉన్నాయి’’ అన్నారు డి. సురేష్‌బాబు. వెంకటేష్, నాగచైతన్య హీరోలుగా కేఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వెంకీమామ’. పాయల్‌రాజ్‌పుత్, రాశీఖన్నా కథానాయికలుగా నటించారు. డి. సురేష్‌బాబు, టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. వివేక్ కూచిభొట్ల సహ–నిర్మాత. ఈ సినిమా ఈ నెల 13న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో వెంకటేష్ మాట్లాడుతూ– ‘‘నా కెరీర్లో ఎన్నో సినిమాలు చేశాను. కానీ ‘వెంకీమామ’ ప్రత్యేకమైనది. రానా, నాగచైతన్యలతో కలిసి పని చేయాలనుకుంటాను. ఆ కల నేరవేరిందని చెప్పొచ్చు. నాన్నగారు (డి.రామానాయుడు) మా అందరితో సినిమా చేయాలనుకునేవారు. నాన్నగారు ఉండి ఉంటే ఈ సినిమా చూసి ఎంజాయ్ చేసేవారు. ‘నాన్నా.. ఈ సినిమా మీ కోసమే’. ఇందులో నాగచైతన్య ఆల్‌రౌండర్ పెర్ఫార్మెన్స్ చేశాడు. మామా అల్లుళ్ల కథను చాలా సెన్సిబుల్‌గా తెరకెక్కించాడు బాబీ. తమన్ మంచి సంగీతం ఇచ్చాడు’’ అన్నారు. ‘‘నేను ఎన్ని సినిమాలు చేసినా ‘మనం, వెంకీమామ’ నాకు మంచి జ్ఞాపకాలుగా గుర్తుండిపోతాయి. కాస్త ఆలస్యమైనా సురేష్ ప్రొడక్షన్స్‌లో సినిమా చేయాలనే నా ఆశ నేరవేరింది. ‘ప్రేమమ్’ సినిమాలో ఓ చిన్న సన్నివేశంలో మామయ్య వెంకటేష్‌గారితో కలిసి నటించినప్పుడే చాలా ఎగ్జైట్ అయ్యాను. ఇప్పుడు ‘వెంకీమామ’లో మామయ్యతో కలిసి చేయడం చాలా సంతోషంగా ఉంది. రాశీతో కలిసి ఇంకా సినిమాలు చేయాలని ఉంది’’ అన్నారు నాగచైతన్య. ‘‘వెంకీమామ’ సినిమా షూటింగ్ టైమ్‌లో నా మామయ్య సురేంద్ర నాకు గుర్తుకు వచ్చారు. అలా ఈ చిత్రం చూసిన ప్రతి ఒక్కరికీ వాళ్ల జీవితాల్లోని వారి మామయ్యలు గుర్తుకు వస్తారు. బాబీ సినిమాను బాగా తీశాడు. నాకు సినిమా అంటే చాలా భయం. ఈ సినిమా ఫస్ట్ కాపీ చూశాను. నాకంటూ ఓ అభిప్రాయం ఉన్నప్పటికీ ఇతరుల అభిప్రాయల కోసం కంగారుగా ఎదురుచూస్తుంటాను. ఈ సినిమాను తొలిసారి తమన్ చూశాడు. చాలా ఎమోషనల్‌గా ఉందన్నాడు. వెంకటేశ్, నాగచైతన్యలు కూడా చూసి బాగుందన్నారు. మా డిస్ట్రిబ్యూటర్స్ కూడా సినిమా నచ్చిందన్నారు. చివర్లో వచ్చి సినిమాలో చాలా కీలకమైన పాత్ర చేసిన ప్రకాశ్‌రాజ్‌గారికి థ్యాంక్స్’’ అన్నారు డి. సురేష్‌బాబు. ‘‘సురేష్‌బాబుగారికి కథ చెప్పబోతున్నాను అన్నప్పుడు కొందరు భయపెట్టారు. ఆయన బుక్ లాంటి వారు అన్నారు. నేను కథ చెప్పిన తర్వాత ‘సూపర్బ్ సూపర్బ్’ అన్నారు. ఈ సినిమా చూసేప్పుడు ప్రతి ఇంట్లో ఉన్న మేనమామకి తన అల్లుడు, అల్లుడికి తన మామ గుర్తుకు వస్తారు. వెంకటేష్‌గారికి కథ చెప్పినప్పుడు.. చైతూ పాత్రను ఇంకొంచెం బాగా చేయమన్నారు. అప్పడు నాకు మరింత తెలిసింది.. నిజమైన మామాఅల్లుళ్ల బంధం గురించి. ఇద్దరూ బాగా నటించారు’’ అన్నారు బాబీ. ‘‘భావోద్వేగ సన్నివేశాల్లో వెంకటేష్‌గారు మాస్టర్. ఇక ఈ సినిమాలో నాగచైతన్య కూడా ఎమోషనల్ సీన్స్‌లో బాగా నటించారు’’ అన్నారు వివేక్ కూచిభొట్ల. ‘‘ఎమోషన్స్‌తో కూడిన ఎంటర్టైనింగ్ చిత్రం ఇది’’ అన్నారు టీజీ విశ్వప్రసాద్. ‘‘వెంకటేష్‌గారితో నాకు కొన్ని కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి. ఆయనతో కలిసి నటించడం సంతోషంగా ఉంది. చైతూ మంచి కో–స్టార్’’ అన్నారు రాశీఖన్నా. -
నిర్మాణం అంటే రోజుకో పెళ్లి చేసినట్టే
‘‘నిర్మాణంలో ముగ్గురు, నలుగురు ఇన్వాల్వ్ అయినప్పుడు వ్యత్యాసాలు రావడం సహజం. కానీ, మా అందరిలో ఒకరి బలం ఏంటో మరొకరికి తెలుసు. అలా అందరం కలసి సాఫీగా వర్క్ చేశాం. మా అందరి రథసారథి సురేశ్‌బాబు’’ అని సునీత తాటి, వివేక్ కూచిభొట్ల అన్నారు. సమంత లీడ్ రోల్లో లక్ష్మీ, రాజేంద్రప్రసాద్, రావు రమేశ్, నాగశౌర్య కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘ఓ బేబీ’. నందినీ రెడ్డి దర్శకత్వం వహించారు. సురేశ్ బాబు, సునీతా తాటి, వివేక్ కూచిభొట్ల నిర్మించిన ఈ సినిమా ఈ నెల 5న విడుదలైంది. ఈ సందర్భంగా సునీత తాటి మాట్లాడుతూ– ‘‘ఇంతకు ముందు ‘కొరియర్ బాయ్, సాహసం శ్వాసగా సాగిపో’ వంటి సినిమాలకు నిర్మాతగా వ్యవహరించాను. 2017లో ‘ఓ బేబీ’ సినిమా మొదలైంది. ఈ పాత్రకు లక్ష్మీగారు బావుంటారన్నది నందినీరెడ్డి ఐడియా. రాజేంద్రప్రసాద్ లుక్ బాగా సెట్ అయింది. ఆయన లుక్‌ని అల్లు అర్జున్ కూడా బాగా అభినందించారు. ‘ఓ బేబీ’ను హిందీలో రీమేక్ చేస్తాం. ఆలియా భట్ హీరోయిన్ అయితే బాగుంటుందనుకుంటున్నాం. వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్తుంది. కన్నడ, బెంగాలీలోనూ రీమేక్ కోసం అడుగుతున్నారు. చైనాలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం. ఈ సినిమాను బూసాన్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు తీసుకెళ్తున్నాం. ఇంత మంచి కథ ఇచ్చినందుకు మేం వాళ్లకు ఇవ్వబోయే గౌరవం అది’’ అన్నారు సునీత. వివేక్ కూచిభొట్ల మాట్లాడుతూ– ‘‘మా సినిమా విడుదలైన తొమ్మిదో రోజు కూడా బుక్ మై షోలో ట్రెండింగ్‌లో ఉంది. ఓవర్సీస్లో కూడా బాగా ఆడుతోంది. సినిమా నిర్మాణం అంటే రోజుకో పెళ్లి చేసినట్టే. ఫిల్మ్ మేకింగ్ చాలా ఈజీగా అనిపించేట్టు సురేశ్‌బాబు చేశారు. ఆయన సినిమాల్లో ప్రాఫిట్స్ ఇచ్చి మాకు పాఠాలు నేర్పారు. ప్రస్తుతం మేం చేస్తున్న ‘వెంకీ మామ’ సినిమా 70శాతం పూర్తయింది. దసరాకు రిలీజ్ చేద్దామనుకుంటున్నాం. మా ముగ్గురి కాంబినేషన్లో మూడు సినిమాలు రెడీ అవుతున్నాయి. త్వరలోనే వివరాలు చెబుతాం’’ అన్నారు. -
తెర పైకి క్రికెటర్ బ్రావో
తక్కువ కాలంలోనే మంచి కాంబినేషన్‌తో సినిమాలు చేసి తమ ఉనికిని గట్టిగా చాటుకొన్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఓ షార్ట్ ఫిలింను ఎనౌన్స్ చేశారు. అది కూడా ప్రముఖ వెస్టీండీస్ ఆల్‌రౌండర్ డారెన్ బ్రావోతో కావడం విశేషం. ప్రస్తుతం సమంత ముఖ్యపాత్రలో ‘ఓ బేబి’, వెంకటేశ్, నాగచైతన్య కాంబినేషన్లో మల్టీస్టారర్ మూవీ ‘వెంకీమామ’ చిత్రాన్ని నిర్మిస్తోందీ సంస్థ. అలాగే అనుష్క, మాధవన్ కాంబినేషన్లో మరో చిత్రాన్ని నిర్మిస్తోంది. ‘‘డారెన్ బ్రావోతో ఓ షార్ట్ ఫిలింను ప్లాన్ చేశాం’’ అని నిర్మాత టి.జి. విశ్వప్రసాద్ తెలిపారు. కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా శనివారం బ్రావో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి ఒప్పందం జరిగింది. కోయంబత్తూర్, తమిళనాడు, వెస్ట్ండీస్లోని ట్రినిడాడ్, టొబాగోలలో చిత్రీకరణ జరుపుకోనుంది. ఈ కార్యక్రమంలో బ్రావోతో పాటు, టి.జి.విశ్వప్రసాద్, నిర్మాత వివేక్ కూచిభొట్ల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నటరాజ్ పిళ్లై పాల్గొన్నారు. -
బంగారు దర్శకుని కథ
దక్షిణాది చలన చిత్రసీమ గర్వించదగ్గ దర్శకులు కె.విశ్వనాథ్ జీవితం వెండితెరపైకి రానుంది. రచయిత, డైరెక్టర్ జనార్ధన మహర్షి దర్శకత్వంలో ‘విశ్వదర్శనం’ పేరుతో ఈ చిత్రం తెరకెక్కనుంది. ‘వెండి తెర చెప్పిన బంగారు దర్శకుని కథ’ అన్నది ట్యాగ్‌లైన్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి.జి.విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు గురుపూర్ణిమ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లో జరిగాయి. కె. విశ్వనాథ్ దంపతులు, నటుడు తనికెళ్ల భరణి, చిత్రనిర్మాత టి.జి. విశ్వప్రసాద్, చిత్ర సహనిర్మాత వివేక్ కూచిభొట్ల సినిమా స్క్రిప్ట్‌ని జనార్ధన మహర్షికి అందజేశారు. ‘‘విశ్వనాథ్‌గారి చరిత్ర పలువురికి ఆదర్శం. ఇలాంటి మహనీయుడి చరిత్రను చూపించాలనే ఆకాంక్షతో ఈ చిత్రానికి శ్రీకారం చుట్టాం. ఆయన పుట్టుక నుంచి ఇప్పటి వరకూ ఆయన జీవితం ఎలా సాగింది? అనే నేపథ్యంలో కథ సాగుతుంది. ఆగస్టులో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో ప్రకటిస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. సంగీతం: స్వరవీణాపాణి. -
బసంతి సాంగ్ టీజర్ ఫొటోలను విడుదల చేసిన ఎన్. టీ. ఆర్.