ఆ ప్రయత్నంలో విజయం సాధించాం | Producer Vivek Kuchibhotla SpeechAdipurush success meet | Sakshi
Sakshi News home page

ఆ ప్రయత్నంలో విజయం సాధించాం

Published Tue, Jun 20 2023 3:43 AM | Last Updated on Tue, Jun 20 2023 3:43 AM

Producer Vivek Kuchibhotla SpeechAdipurush success meet - Sakshi

‘‘ఆదిపురుష్‌’ చిత్రాన్ని ఆదివారం వరకు ప్రపంచవ్యాప్తంగా కోటి మంది ప్రేక్షకులు చూశారు. అందుకే ఈ ప్రెస్‌మీట్‌ని రామకోటి ఉత్సవం అని పిలిచాం. రామ నామాన్ని ప్రతి గడపకు చేర్చాలన్నదే యూనిట్‌ ఆలోచన. ఆ ప్రయత్నంలో విజయం సాధించడం సంతోషంగా ఉంది’’ అని సహ నిర్మాత వివేక్‌ కూచిభొట్ల అన్నారు. ప్రభాస్‌ శ్రీరాముడిగా, కృతీసనన్‌ సీత పాత్రలో నటించిన చిత్రం ‘ఆదిపురుష్‌’. ఓం  రౌత్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 16న పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలైంది.

ఈ చిత్రాన్ని పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌ తెలుగులో రిలీజ్‌ చేశారు. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో ‘రామ జయం, రఘురామ జయం’ పేరుతో నిర్వహించిన సక్సెస్‌ మీట్‌లో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్‌ శశిధర్‌ రెడ్డి మాట్లాడుతూ– ‘‘ఆదిపురుష్‌’ చిత్రాన్ని నైజాంలో దాదాపు 500 స్క్రీ¯Œ ్సకి పైగా రిలీజ్‌ చేశాం. తొలి రోజు నైజాంలో 13.65 కోట్లు, రెండో రోజు దాదాపు 8 కోట్లు వసూళ్లు వచ్చాయి’’ అన్నారు. ఈ కార్యక్రమంలో పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి, మాటల రచయిత భీమ్‌ శ్రీనివాస్‌ మాట్లాడారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement