
వివేక్ కూచిభొట్ల, టీజీ విశ్వప్రసాద్, శ్రీవిష్ణు, కీర్తి, హసిత్ గోలి
వైవిధ్యంతో కూడిన కథలను ఎంచుకుంటూ హీరోగా సినిమాలు చేస్తుంటారు శ్రీవిష్ణు. తాజాగా మరో విభిన్న కథలో హీరోగా నటించబోతున్నారు. శ్రీవిష్ణు హీరోగా నటించిన ‘మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా’ చిత్రాలకు దర్శకత్వ శాఖలో పని చేసిన హాసిత్ గోలి ఈ సినిమాతో దర్శకునిగా పరిచయం కానున్నారు. టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాను నిర్మించనున్నారు. వివేక్ కూచిభొట్ల, కీర్తీ చౌదరి సహ–నిర్మాతలు. ‘‘వినూత్నమైన కథతో వినోదభరితంగా ఈ చిత్రం తెరకెక్కనుంది. జనవరిలో చిత్రీకరణ మొదలుపెడతాం. ఈ సినిమాకు వివేక్ సాగర్ సంగీతం అందిస్తారు. వేదరామన్ కెమెరామేన్‌గా పని చేస్తారు’’అని చిత్రబృందం పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment