వివేక్ కూచిభొట్ల, గోపీచంద్, డింపుల్ హయతి, శ్రీవాస్
‘‘రామబాణం’లాంటి మంచి కథ ఇచ్చిన భూపతి రాజాగారికి థ్యాంక్స్. మంచి కమర్షియల్ ఫార్మాట్‌లో అద్భుతమైన ఎమోషన్స్‌తో ఈ కథ ఉంటుంది.. దాన్ని అంతే బాగా తీశాడు శ్రీవాస్. మా గత చిత్రాలు ‘లక్ష్యం, లౌక్యం’ లాగా ‘రామబాణం’ లోనూ మంచి వినోదం, ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి’’ అని హీరో గోపీచంద్ అన్నారు. శ్రీవాస్ దర్శకత్వంలో గోపీచంద్, డింపుల్ హయతి జంటగా నటించిన చిత్రం ‘రామబాణం’. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మించిన ఈ సినిమా ఈ నెల 5న రిలీజ్ అవుతోంది.
ఈ సందర్భంగా ఆదివారం నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో గోపీచంద్ మాట్లాడుతూ– ‘‘విశ్వ ప్రసాద్, వివేక్‌గార్లు ఎంత మంచి నిర్మాతలంటే.. ఏది కావాలని అడిగినా.. ‘ఇది ఎందుకు?’ అని అడగరు.. అలాంటి మంచి మనసున్న వారికి మంచి జరగాలి. ‘రామబాణం’ చాలా మంచి సినిమా అవుతుంది. ఈ చిత్రం తర్వాత డింపుల్‌కి మంచి భవిష్యత్ ఉంటుంది. ‘లక్ష్యం’ తర్వాత జగపతి బాబుగారు, నేను మళ్లీ ఈ చిత్రంలో అన్నదమ్ముల్లా చేశాం.. ఆయనతో చేస్తుంటే యాక్టర్ అని కాకుండా సొంత బ్రదర్‌లా అనిపిస్తారు.. అందుకే మా ఇద్దరి మధ్య సన్నివేశాలు, ఎమోషన్స్ బాగా పండాయి. నాది, అలీగారి కాంబినేషన్ చాలా బాగుంటుంది. 5న వస్తున్న ‘రామబాణం’ మీ అందరికీ (ఫ్యాన్స్, ఆడియన్స్) నచ్చుతుంది’’ అన్నారు.
డైరెక్టర్ శ్రీవాస్ మాట్లాడుతూ – ‘‘రామబాణం’ నిర్మాతలు విశ్వప్రసాద్, వివేక్‌గార్లు, నా లక్కీ హీరో గోపీచంద్‌గారు.. ఎలాంటి వివాదాలు లేకుండా పాజిటివ్‌గా ఉంటారు. అలా మా అందరి కాంబినేషన్‌లో సినిమా అనగానే ఓ పాజిటివ్ వైబ్రేషన్. హ్యాట్రిక్ కాంబినేషన్ అంటూ మా మనసులో ఓ ఆలోచన తిరుగుతూ ఉండేది.. అది మాకు మరింత నమ్మకాన్ని, సంకల్పాన్ని ఇచ్చింది. ‘రామబాణం’ ఫస్ట్‌కాపీ చూసిన తర్వాత నా అసిస్టెంట్ డైరెక్టర్స్.. ‘టెక్నీషియన్స్ అని మరచిపోయి సినిమా చూశాం’ అన్నారు.. అంటే సినిమాలో అంత లీనమయ్యారు.. ప్రేక్షకులు కూడా ఇదే అనుభూతికి లోనవుతారు. మా ‘లక్ష్యం, లౌక్యం’లకు మించి ‘రామబాణం’ పెద్ద హిట్ కావాలి. ఈ సినిమా ఎట్టి పరిస్థితిల్లోనూ గోపీచంద్‌గారి అభిమానుల అంచనాలకు తగ్గదు’’ అన్నారు.
సహ నిర్మాత వివేక్ కూచిభొట్ల మాట్లాడుతూ–‘‘రామబాణం’ లాంటి మంచి సినిమా తీశాం. ఈ చిత్రానికి మీరు(ప్రేక్షకులు) మంచి విజయాన్ని అందిస్తారని ఆశిస్తున్నాం’’ అన్నారు. ‘‘గోపీచంద్ 30 సినిమాలు చేస్తే దాదాపు 25 సినిమాల్లో తనతో కలిసి నేను నటించాను’’అన్నారు నటుడు అలీ. ఈ వేడుకలో నిర్మాత కేకే రాధామోహన్, డైరెక్టర్స్ మారుతి, సంపత్ నంది, కార్తీక్ దండు, హర్ష, రచయిత కోనా వెంకట్, నటులు సోనియా చౌదరి, కాశీ విశ్వనాథ్, సప్తగిరి, తరుణ్ అరోరా తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment