![Thousands Of Men Attended Non Vegetarian Feast In Madurai - Sakshi](/styles/webp/s3/article_images/2023/01/8/Food.jpg.webp?itok=dK8BMilb)
సాక్షి, తిరువొత్తియూరు: సాధారణంగా గొప్ప వంటను గురించి చెప్పాలంటే నలభీమ పాకం అని వర్ణిస్తుంటారు. ఆరితేరిన వంటగాళ్ల గురించి చెప్పాలంటే చారిత్రకపరంగా, సాంస్కృతిక పరంగా మగవాళ్లనే ఉదాహరణగా చెబుతుంటారు. దీన్ని నిజం చేస్తూ.. మదురై జిల్లా తిరుమంగళం సమీపం కరడిక్కల్ పంచాయతీలోని గ్రామం అనుపంపట్టి గ్రామంలో శనివారం చేపట్టిన మాంసాహార విందుకు వేలామంది పురుషులు హాజరయ్యారు.
(కావల్ దైవం) కాపలా దేవుడుగా ప్రసిద్ధి చెందిన కరుపారై ముత్తయ్య సామి ఆలయంలో ఏటా మార్గళి మాసంలో పౌర్ణమి మరుసటి రోజున ఈ విందు కార్యక్రమం నిర్వహిస్తారు. ఇక్కడ భోజనం చేస్తే వీరులైన మగ సంతానం వృద్ధి చెందడంతో పాటు వంశం అభివృద్ధి చెందుతుందని భక్తుల నమ్మకం. శుక్రవారం అర్ధరాత్రి పూజలు ప్రారంభించి 60కి పైగా మేకలతో 50 బస్తాల బియ్యంతో మాంసాహార భోజనం తయారు చేశారు. శనివారం ఉదయం ముత్తయ్యస్వామికి ప్రత్యేక పూజలు చేసి తరువాత అందరికీ విందు పెట్టారు.
(చదవండి: తమిళనాడులో దారుణం..)
Comments
Please login to add a commentAdd a comment