Banerjee
-
మహోజ్వల భారతి: సరెండర్ నాట్ బెనర్జీ
సురేంద్రనాథ్ బెనర్జీ బ్రిటిష్ ఇండియా భారత రాజకీయాలలో ముఖ్య నాయకులు. ‘ఇండియన్ నేషనల్ అసోసియేషన్’ స్థాపకులు. ‘ఇండియన్ నేషనల్ కాంగ్రెస్’ వ్యవస్థాపక సభ్యులలో ఒకరు. బెనర్జీ బెంగాల్ ప్రావిన్స్‌లోని కలకత్తాలో బెంగాలీ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. అతని తండి దుర్గా చరణ్ బెనర్జీ వైద్యులు, ఉదారవాద, ప్రగతిశీల ఆలోచనలు గలవారు. బెనర్జీపై తండ్రి ప్రభావం ఎక్కువగా ఉంది. కలకత్తా విశ్వవిద్యాలయం నుండి పట్టా పొందిన తరువాత బెనర్జీ ఇండియన్ సివిల్ సర్వీస్ పరీక్షలను రాయడానికి ఇంగ్లండ్ వెళ్లారు. పరీక్షల్లో విజయం సాధించి సిల్హెట్లో (నేటి బంగ్లాదేశ్) అసిస్టెంట్ మేజిస్ట్రేట్‌గా నియామకం పొందారు. 1905లో బెంగాల్ ప్రావిన్స్ విభజనను నిరసించిన ముఖ్య ప్రజా నాయకులలో సురేంద్రనాథ్ బెనర్జీ కూడా ఉన్నారు. మితవాద రాజకీయ నాయకుల ప్రజాదరణ క్షీణించడం భారత రాజకీయాల్లో బెనర్జీ పాత్రను ప్రభావితం చేసింది. 1909 లో మింటో–మార్లే సంస్కరణలకు బెనర్జీ మద్దతు ఇచ్చారు. భారతీయ ప్రజా, జాతీయవాద రాజకీయ నాయకులలో చాలామందికి అది ఆగ్రహం కలిగించింది. అంతేకాదు, మహాత్మాగాంధీ ప్రతిపాదించిన శాసనోల్లంఘన ఉద్యమాన్ని బెనర్జీ విమర్శించడం, తర్వాత్తర్వాత బెంగాల్ ప్రభుత్వంలో ఆయన మంత్రి పదవిని అంగీకరించడం అనేకమంది జాతీయవాదులకు కోపం తెప్పించింది. అయినప్పటికీ భారత రాజకీయాల మార్గదర్శక నాయకుడిగా మొదట భారత రాజకీయ సాధికారత కోసం మార్గం నడపడం వల్ల బెనర్జీ చరిత్రలో గొప్ప నేతగా నిలిచిపోయారు. ‘సర్’ అనే బ్రిటిష్ హోదాకు అర్హులయ్యారు. బెనర్జీ చివరి రోజులలో బ్రిటిష్‌వారు ఆయన్ని ఆయన దృఢత్వానికి చిహ్నంగా ‘సరెండర్ నాట్’ బెనర్జీగా గౌరవించారు. బెనర్జీ తన 76 ఏళ్ల వయసులో 1925 ఆగస్టు 6న కన్నుమూశారు. -
అతడు ఆమె ప్రియుడు..టీజర్ చాలా బాగుంది
‘‘అతడు ఆమె ప్రియుడు’ సినిమా టీజర్ చాలా బాగుంది. ఈ సినిమా అద్భుత విజయం సాధించి, యూనిట్‌కి మంచి పేరు, డబ్బులు రావాలి’’ అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. సునీల్, కౌశల్, బెనర్జీ, మహేశ్వరి ముఖ్య పాత్రల్లో యండమూరి వీరేంద్రనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అతడు ఆమె ప్రియుడు’. కూనం కృష్ణకుమారి సమర్పణలో రవి కనగాల, రామ్ తుమ్మలపల్లి నిర్మించిన ఈ చిత్రం టీజర్‌ని అవంతి శ్రీనివాస్ విడుదల చేశారు. యండమూరి వీరేంద్రనాథ్ మాట్లాడుతూ– ‘‘చిరంజీవి నటించిన పలు బ్లాక్ బస్టర్స్‌కు కథలు అందించిన నేను ఆయనకు పెద్ద ఫ్యాన్. రవి కనగాల–తుమ్మలపల్లి ఖర్చుకు వెనకాడకుండా ఈ సినిమా నిర్మించారు’’ అన్నారు. ‘‘అతి త్వరలో మా సినిమా విడుదల కానుంది’’ అన్నారు రవి కనగాల, రామ్ తుమ్మలపల్లి. -
‘అసలు మీరెవరు.. మమ్మల్ని అడగడానికి?’
ప్రస్తుతం టాలీవుడ్ సెన్సేషన్ స్టార్ విజయ్ దేవరకొండ అటు సోషల్ మీడియాలోనూ ఇటు మీడియాలోనూ హైలైట్‌గా నిలిచారు. కరోనా కష్టకాలంలో తనపై, తన సహాయక కార్యక్రమాలపై అసత్య ఆరోపణలతో వార్తలు రాసిన వెబ్సైట్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ విజయ్ ఓ వీడియో విడుదల చేశాడు. అంతేకాకుండా ‘కిల్ ఫేక్ న్యూస్’ అంటూ పిలుపునిచ్చాడు. దీంతో విజయ్‌కు మద్దతుగా టాలీవుడ్ ఇండస్ట్రీ ముందుకు కదిలింది. టాలీవుడ్ ప్రముఖులు చిరంజీవి, మహేశ్‌బాబు, నాగార్జున, రవితేజ, కొరటాల శివ, అనిల్ రావిపూడి తదితరులు విజయ్‌కు అండగా నిలుస్తూ ట్వీట్లు చేశారు. తాజాగా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) తాత్కాలిక అధ్యక్షుడు బెనర్జీ కూడా విజయ్‌కు సంఘీభావం తెలిపాడు. ‘మధ్యతరగతి కుటుంబాలు ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎంత అవసరమైనా ఎవరి ముందు చేతులు చాచి అడగలేరు. ఎందుకంటే వారికి ఆత్మాభిమానం అడ్డొస్తుంది. అలాంటి మిడిల్‌క్లాస్ కుటుంబాల కోసం విజయ్ దేవరకొండ ఓ ఛారిటీ ఏర్పాటు చేసి సహాయం అందించడం అభినందనీయం. అదేవిధంగా కరోనా క్రైసిస్ ఛారిటీ(సీసీసీ)కి విరాళం ప్రకటించి తన గొప్ప మనసును చాటుకున్నాడు. అయితే అతడు చేస్తున్న మంచి పనులను అభినందించకున్నా పర్లేదు కానీ బురద జల్లడం మంచిది కాదు. అసలు మీరెవరండి? హు ఆర్ యూ? మేం ఎంత విరాళం ఇస్తాం, ఎవరికి ఇస్తాం అనేది మా(ఆర్టిస్టులు) ఇష్టం. విరాళం ఎందుకు ఇవ్వడం లేదు? ఎక్కడ దాక్కున్నాడు అంటూ రాయడం సరికాదు. ఇలా విజయ్ దేవరకొండకు అనే కాదే సినీ ఇండస్ట్రీలో ఎవరికి ఇలాంటి సమస్య ఎదురైనా మేమందరం ఉన్నాం. అండగా నిలుచుంటాం. సినీ ఇండస్ట్రీ అంతా ఒక్కటే’ అని బెనర్జీ ఆ వీడియోలో పేర్కొన్నాడు. చదవండి: తమిళ హీరో సూర్యకు బిగ్ షాక్ ! శివాజీరాజాకు గుండెపోటు var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1081263436.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
నేను స్లోగా వెళుతున్నానా అనిపించింది
‘‘ఎంఎంఓఎఫ్’ ట్రైలర్ చూశాక నేను నిదానంగా వెళుతున్నానా? సినిమా తీసినవారు ఫాస్ట్‌గా ఉన్నారా? అనే అనుమానం కలిగింది. ఈ సినిమా ట్రైలర్ చాలా కొత్తగా ఉంది. జేడీ చక్రవర్తి ఇలాంటి కొత్త కథలతో మరెన్నో సినిమాలు చేయాలి’’ అన్నారు డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ. జేడీ చక్రవర్తి, బెనర్జీ, అక్షత, మనోజ్ నందన్ ప్రధాన పాత్రల్లో యన్.యస్.సి. దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ఎంఎంఓఎఫ్’. అనుశ్రీ సమర్పణలో ఆర్ఆర్ఆర్ ప్రొడక్షన్స్ జేకే క్రియేష¯ŒŒ్స బ్యానర్స్‌పై ఆర్ఆర్ఆర్ రాజశేఖర్, జేడీ కాశీం నిర్మిస్తున్న ఈ చిత్రం ట్రైలర్‌ని హైదరాబాద్‌లో రామ్‌గోపాల్ వర్మ విడుదల చేశారు. డైరెక్టర్ శివ నాగేశ్వరరావు మాట్లాడుతూ– ‘‘వర్మలా సినిమాలు చేయాలని, అతన్ని అనుకరించాలని చాలామంది అనుకుంటారు. కానీ అది అసాధ్యం. జేడీ చక్రవర్తి మంచి నటుడు. ఈ ట్రైలర్ చూస్తుంటే త్వరగా సినిమా చూడాలనిపిస్తోంది’’ అన్నారు. ‘‘జేడీ చక్రవర్తితో చాలా కాలం తర్వాత నటించాను. ఆర్జీవీగారి దాదాపు అన్ని సినిమాల్లో నేను నటించాను. తెలుగు సినిమాకు డిఫరెంట్ మేకింగ్‌ను పరిచయం చేసిన వ్యక్తి ఆయన. ‘ఎంఎంఓఎఫ్’ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు నటుడు బెనర్జీ. జేడీ చక్రవర్తి, నటులు ఉత్తేజ్, మనోజ్ నందం, నిర్మాత రామసత్యనారాయణ పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సాయి కార్తీక్, కెమెరా: ‘గరుడవేగ’ అంజి. -
సెలవులో నరేశ్.. బెనర్జీకి ఛాన్స్
సాక్షి, హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) తాత్కాలిక అధ్యక్షుడిగా బెనర్జీ ఎన్నికయ్యారు. ప్రస్తుత అధ్యక్షుడు సీనియర్ నరేశ్ 41 రోజులు సెలవు పెట్టడంతో బై లాస్ ప్రకారం ఉపాధ్యక్షుడు బెనర్జీకి అధ్యక్ష బాధ్యతలను అప్పగించారు. ఈ విషయంపై బుధవారం ఫిల్మ్ చాంబర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో డిసిప్లినరీ, ఎగ్జిక్యూటీవ్ కమిటీ సభ్యులు పాల్గొని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో రెబల్ స్టార్ కృష్ణంరాజు, మెగాస్టార్ చిరంజీవి, సీనియర్ నటుడు మురళీమోహన్, సీనియర్ నటి జయసుధ, ‘మా’ జనరల్ సెక్రటరీ జీవితా రాజశేఖర్, నటీనటులు హేమ, రాజీవ్ కనకాల, శివబాలాజీ, అనితా చౌదరీ, జయలక్ష్మి, కరాటే కళ్యాణి, ఏడిద శ్రీరామ్, రవి ప్రకాష్ టార్జాన్, పసునూరి శ్రీనివాస్, రాజా రవీంద్ర, అలీ, సురేష్ కొండేటి, తనీష్, ఆశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇక ఈ ఏడాది ప్రారంభంలో ‘మా’ డైరీ ఆవిష్కరణ కార్యక్రమం రసాభాసాగా సాగిన విషయం తెలిసిందే. కృష్ణంరాజు, చిరంజీవి, మోహన్‌బాబు వంటి అతిరథుల సమక్షంలోనే మాజీ ఉపాధ్యక్షుడు రాజశేఖర్ అధ్యక్షుడు నరేశ్‌పై ఆరోపణలు చేశారు. అయితే సభ్యులతో రాజశేఖర్ ప్రవర్తించిన తీరు, వేదికపై మాట్లాడిన తీరుపై చిరంజీవి అసహనం వ్యక్తం చేశారు. అంతేకాకుండా రాజశేఖర్‌పై వెంటనే క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో మనస్తాపానికి గురైన రాజశేఖర్ తన ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అయితే ఇదే సమయంలో ‘మా’ సభ్యులు వివాదాలు మానుకొని కలసి పనిచేయాలని చిరంజీవి సూచించారు. అంతేకాకుండా తెలుగు సినిమా అభివృద్ధికి అందరం కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చిన సంగతి విదితమే. -
శృంగారం, పోర్నోగ్రఫీ ఒకటేనా?
న్యూఢిల్లీ: మన దేశంలో శృంగారాన్ని, పోర్నోగ్రఫీని ఒకేవిధంగా చూస్తున్నారని ప్రముఖ రచయిత్రి అమృత నారాయణన్ అభిప్రాయపడ్డారు. ఈ రెండింటికీ చాలా తేడా ఉందని.. శృంగారం ఆత్మాశ్రయమని ఇందులో ఒకరిపట్ల ఒకరికి ఆపేక్ష, భావోద్వేగాలు కలగలసి ఉంటాయని వెల్లడించారు. పోర్నోగ్రఫీలో కామం మాత్రమే ఉంటుందని వివరించారు. సాహిత్య ఆజ్‌తక్ కార్యక్రమంలో భాగంగా ‘రైటింగ్ ఎరోటికా ఇన్ ఇండియా’ అంశంపై జరిగిన చర్చలో మాధురి బెనర్జీతో కలిసి ఆమె పాల్గొన్నారు. మన భావాలను స్వేచ్ఛగా వెల్లడించే అవకాశం పుస్తకాలు కల్పిస్తాయని, అందుకే తాను రాయడం మొదలుపెట్టానని అమృత వెల్లడించారు. ‘కష్టపడి పనిచేసే మనుషులున్న దేశంగానే స్వాతంత్ర్యం వచ్చాక మనదేశం గుర్తింపు కోరుకుంది. హార్డ్‌వర్క్, లైంగికత రెండింటినీ కలపలేదు. స్వాతంత్ర్యం వచ్చాక సాంస్కృతిక వారసత్వంలో ఈ అంశాన్ని మనం వదిలేశాం. మన దేశానికి ఇంగ్లీషు పరిచయమైన కొత్తలో మనల్ని అనాగరీకులుగా చూశారు. మనం కూడా అలాగే వ్యవహరించాం. నైతిక విలువలను మధ్యతరగతి మీద రుద్దడంతో అది కూడా ఇలాగే కొనసాగింది. ఎందుకంటే దేశాన్ని ప్రమోట్ చేయడానికి ఈ ఇమేజ్ అవసరమైంది. అయితే పుస్తకాలు చదివినంతమాత్రాన ప్రజలు స్వతంత్రులుగా మారరు. తమంతట తామే ప్రజలు స్వేచ్ఛ సాధించాలి. దీనికి కచ్చితంగా పుస్తకాలు సహాయపడతాయ’ని అమృత వివరించారు. క్లినికల్ సైకాలజిస్ట్ అయిన ఆమె పారెట్స్ ఆఫ్ డిజైర్, ఏ ప్లెజెంట్ కెండ్ ఆఫ్ హెవీ వంటి పుస్తకాలు రాశారు. భారతదేశ శృంగార చరిత్రపై పరిశోధన కూడా సాగించారు. మాధురి బెనర్జీ మాట్లాడుతూ.. ‘కామసూత్ర’ స్థాయిలో ‘తమిళ సంగం’ పుస్తకాలకు పేరు రావాల్సివుందని అభిప్రాయపడ్డారు. ఈ పుస్తకాల్లో భావోద్వేగాలు ఉంటాయని, కామసూత్రలో ఎటువంటి ఎమోషన్స్ ఉండవని చెప్పారు. శృంగార సాహిత్యంవైపు ఎందుకు మొగ్గుచూపారని ప్రశ్నించగా.. ‘నేను మానవ సంబంధాల గురించి మాట్లాడుతున్నాను. మహిళ కన్యత్వాన్ని కోల్పోతే సమాజం ఎలా స్పందిస్తుందనే దాని గురించి నా మొదటి పుస్తకంలో రాశాను. మన దేశంలో సెక్సువాలిటీ గురించి బహిరంగంగా మాట్లాడరు. నా పుస్తకం 2010లో విడుదలైంది. లైంగికత గురించి చర్చ జరగాలని ఈ పుస్తకం రాశాను. కానీ నా లక్ష్యం నెరవేరలేదు. నా పుస్తకాలు లైంగికత, శృంగారానికి పరిమితం కావు. మానవ సంబంధాలను లోతుగా చర్చిస్తాయి. శృంగార సాహిత్యాన్ని మన విద్యావ్యవస్థలో భాగం చేయాలి. లైంగికత గురించి గోప్యత పాటిస్తుండటంతో పిల్లలు ఇంటర్నెట్ను ఆశ్రయించి పెడతోవ పడుతున్నారు. లైంగికతపై పిల్లలకు సదావగాహన కల్పించి, వారి భావాలను స్వేచ్ఛగా వెల్లడించేలా చేయాల’ని చెప్పారు. మాధురి బెనర్జీ.. లాసింగ్ మై వర్జినిటీ, గాళ్స్ నైటవుట్, మై క్లింజీ గాళ్‌ఫ్రెండ్, అడ్వాంటేజ్ లవ్, ఫర్బిడెన్ డిజైర్స్ వంటి శృంగార సాహిత్య పుస్తకాలు రాశారు. (చదవండి: పోర్న్ ఎక్కువగా చూడటం వల్ల...) -
యువత కోసం
బిష్ణు, హిమాంశి కురానా, అపర్ణ శర్మ ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘ఏక్’. ‘బీయింగ్ హ్యూమన్’ అనేది ఉపశీర్షిక. రుద్రారపు సంపత్ డైరెక్షన్లో కె.వరల్డ్ మూవీస్ బ్యానర్‌పై హరికృష్ణ నిర్మించిన ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ– ‘‘మానవీయ విలువలతో, మంచి కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది. యూత్‌ని టార్గెట్ చేసుకుని తీసిన చిత్రమిది. ‘మంత్ర’ ఆనంద్ స్వరపరచిన మా చిత్రం పాటలను హీరో నాగార్జునగారు విడుదల చేయగా చాలా మంచి స్పందన వచ్చింది. హిందీ డబ్బింగ్ రైట్స్ కోసం ఫ్యాన్సీ ఆఫర్స్ వచ్చాయి. ఏప్రిల్‌లో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. సుమన్, బెనర్జీ, పృథ్వీ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: చక్రవర్తి ఘనపాటి, స్టోరీ– స్క్రీన్‌ప్లే– డైలాగ్స్– నిర్మాత: హరికృష్ణ కొక్కొండ. -
35 ఏళ్ల ఆకాంక్ష నెరవేరింది!
‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా కాలరెగరేసింది. మరోసారి టాలీవుడ్ కాలరెగరేసింది. వరల్డ్ సినిమాతో పోటీపడి మరీ ‘రక్తం’ అనే తెలుగు సిన్మా 22వ ‘ఇండీ గేదరింగ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్’ (అమెరికన్)లో ఐదు నామినేషన్లు దక్కించుకుంది. ‘నా బంగారు తల్లి’ వంటి సినిమాను ప్రేక్షకులకు అందించిన దర్శక–నిర్మాతలు సునీతాకృష్ణన్, రాజేశ్ టచ్‌రివర్ ఈ సినిమా తీశారు. ఫీచర్ ఫిల్మ్–నిర్మాత సునీతాకృష్ణన్, డైరెక్టర్–రాజేశ్ టచ్‌రివర్, లీడ్ యాక్టర్–బెనర్జీ, లీడ్ యాక్ట్రెస్–మధుశాలిని, సినిమాటోగ్రాఫర్–రామతులసిలకు నామినేషన్లు దక్కాయి. ఈ సందర్భంగా దర్శకుడు రాజేశ్ టచ్‌రివర్, నటుడు బెనర్జీలతో ఇంటర్వ్యూలు.... ♦ కంగ్రాట్స్ బెనర్జీగారు.... ఎలా అనిపిస్తోంది? థ్యాంక్స్! అమెరికన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ‘ఉత్తమ నటుడు’ కేటగిరీలో తెలుగు నటుడికి నామినేషన్ రావడం అరుదైన విషయం. అదీ మన దేశం నుంచి నామినేషన్ దక్కించుకుని హాలీవుడ్ నటులతో పోటీపడుతున్నది నేనొక్కడినే. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ అండ్ గ్రేట్. ఈ సందర్భంగా నా తల్లిదండ్రులకు, కళామతల్లికి కృతజ్ఞతలు. అలాగే, మా దర్శకుడు రాజేశ్ టచ్‌రివర్, నిర్మాత సునీతాకృష్ణన్, సహనిర్మాత మున్షీ రియాజ్ అహ్మద్, ‘రక్తం’ యూనిట్ సభ్యులకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. ♦ రాజేశ్ టచ్‌రివర్ ‘నా బంగారు తల్లి’ వంటి సినిమాలు తీశారు. ఆయన మిమ్మల్ని సంప్రదించినప్పుడు మీరేమైనా ఆలోచించారా? రాజేశ్‌తో నాకు ఇంతకు ముందు పరిచయం కూడా లేదు. నన్ను, నా నటనను నమ్మి ‘రక్తం’లో లీడ్ రోల్‌కి సంప్రదించారు. కథ చెప్పిన వెంటనే ఓకే చెప్పేశా. నటుడిగా నా ప్రయాణం ప్రారంభించి 35 ఏళ్లవుతుంది. ఇన్నేళ్లూ ఇటువంటి సినిమా చేయాలని, ఇటువంటి పాత్రలో నటించాలని ఎదురుచూశా. నా 35 ఏళ్ల ఆకాంక్ష ‘రక్తం’తో తీరింది. ♦ మీరు కమర్షియల్ సినిమాల్లో నటిస్తుంటారు. ఓ ఆఫ్–బీట్ సినిమా చేయడం రిస్కేమో అనుకున్నారా? నటులెప్పుడూ మంచి క్యారెక్టర్స్ వస్తే ఎగ్జయిటవుతారు. తమ ప్రతిభను ప్రేక్షకులకు చూపించాలనుకుంటారు. నేనూ అంతే. ఎవరూ డబ్బు గురించి ఆలోచించరు. ముఖ్యంగా నేను! 30 ఏళ్లుగా నేను చిత్ర పరిశ్రమలో ఉన్నాను. ఎన్నో పాత్రలు చేశా. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కి నామినేషన్ వచ్చేంత కెపాసిటీ ఉన్న క్యారెక్టర్ వస్తే ఎందుకు వదులుకుంటాను? నన్ను నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లే పాత్ర ఇది. కెరీర్‌పై ఎఫెక్ట్ చూపిస్తుందేమో? రిస్కేమో! అనుకోలేదు. ‘రక్తం’ చూశాక దర్శక–రచయితలు నా కోసం మరిన్ని మంచి పాత్రలు రాస్తారని నమ్ముతున్నా! ♦ ∙‘ప్రాణాలు తీయడం ద్వారా విప్లవం తీసుకురాలేం’ అనే కథాంశంతో ‘రక్తం’ తీశానని రాజేశ్ టచ్‌రివర్ చెప్పారు. ఇందులో మీ పాత్ర ఎలా ఉంటుంది? ఓ దళానికి నాయకుడిగా కనిపిస్తా. అందులో యువతీయువకులు, వయసైనవారు, బాగా చదువుకుని మంచి భావాలతో వచ్చినవారు... ఒక్కొక్కరూ ఒక్కోలా ఆలోచిస్తారు. మధ్య ఎవరైనా మరణిస్తే ‘అయ్యో పాపం’ అని కొందరు అంటే... ఏది ఏమైనా హైకమాండ్ అప్పగించిన పనిని పూర్తి చేయాలని మరికొందరు అంటారు. వాళ్లకు పరిస్థితులు అర్థమయ్యేలా వివరిస్తూ, అందర్నీ సమన్వయం చేసే పాత్ర. ఈ క్రమంలో మన విప్లవాన్ని ప్రజలు వ్యతిరేకించేలా, అసహ్యించుకునేలా ఉండకుండా చూసుకునే పాత్ర. ♦ మీరు ఎంతో అనుభవమున్న నటుడు... రాజేశ్ టచ్‌రివర్ రెగ్యులర్ కమర్షియల్ డైరెక్టర్ కాదు. సెట్లో మీ ఇద్దరి వర్కింగ్ స్టైల్ ఎలా ఉండేది? ఆయన ప్రతి సీన్ డిస్కస్ చేసి, నటించి చూపించమనేవారు. నచ్చితే బాగుందనే వారు. ఒకవేళ చిన్న చిన్న మార్పులుంటే చెప్పేవారు. ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు. నా నుంచి ‘ది బెస్ట్ యాక్టింగ్’ తీసుకున్నారు. దర్శకుల్లో కమర్షియల్, ఆఫ్ బీట్ తేడాలు ఉండవు. నటీనటుల ప్రతిభను తెరపైకి తీసుకొచ్చేది వాళ్లే. ‘అంతా నాకే వచ్చు’ అనుకుంటే నా నటనలో మొనాటనీ వచ్చేస్తుంది. దర్శకులు చెప్పింది చేశాను కాబట్టే.. ఇన్నేళ్లుగా వైవిధ్యమైన పాత్రలు చేయగలిగాను. ఇప్పుడు ప్రతి ఐదేళ్లకు సినిమా రంగంలో కొత్త మార్పులొస్తున్నాయి. ఐయామ్ వెరీ హ్యాపీ. అందర్నీ చంపేస్తే కొత్త లోకం ఎక్కణ్ణుంచి వస్తుంది? ♦ కంగ్రాట్స్ రాజేశ్‌గారు... ఐయామ్ హ్యాపీ! ఇంగ్లీష్ సినిమాలతో పోటీ పడుతూ ఓ తెలుగు సినిమాకు అవార్డు రావడం, నటీనటులకు నామినేషన్స్ రావడం పెద్ద విషయమే కదా. ఆనందంగా ఉంది. ♦ ‘రక్తం’ కథేంటి? ఈ సినిమాలో మీరు ఏం చెబుతున్నారు? ఫ్రెంచ్ తత్వవేత్త, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఆల్బర్ట్ కామ్స్ 1949లో రాసిన ‘లెస్ జస్టిస్’ నాటకం స్ఫూర్తితో ‘రక్తం’ తీశా. అప్పటికి, ఇప్పటికి పరిస్థితుల్లో పెద్దగా మార్పు లేదనిపించింది. చత్తీస్‌ఘడ్‌లో గతేడాది కొందరు పోలీసులను మావోయిస్టులు చంపేశారు. విప్లవం పేరుతో పలు దేశాల్లో ఇటువంటి మారణహోమాలు జరుగుతున్నాయి. ఓ మనిషిని చంపడం ద్వారా విప్లవం తీసుకురాలేరనే సందేశంతో ‘రక్తం’ రూపొందించా. చంపకుండా కూడా విప్లవం తీసుకురావొచ్చు. అందర్నీ చంపేస్తే కొత్త లోకం ఎక్కణ్ణుంచి వస్తుంది? అనేది నా ప్రశ్న. ♦ ‘నా బంగారు తల్లి’, ఇప్పుడీ ‘రక్తం’... ఓ సామాజిక బాధ్యతతో కూడిన సినిమాలే తీస్తున్నారెందుకు? నా దృష్టిలో ప్రతి ఒక్కరికీ సామాజిక బాధ్యత ఉంది. గద్దర్‌గారు పాట ద్వారా, జర్నలిస్టులు వార్తల ద్వారా, వేర్వేరు వ్యక్తులు వేర్వేరు పద్ధతుల ద్వారా తమ బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. విప్లవాన్ని తీసుకొస్తున్నారు. ఓ దర్శకుడిగా నా సినిమాల ద్వారా ప్రజలకు మంచి చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఇప్పుడు నేను ప్రేమకథలు, కమర్షియల్ సినిమాలు తీయాలనుకుంటే తీయొచ్చు. కానీ, సెన్సిబిల్ సిన్మాలు తీయాలనేది నా నిర్ణయం! ♦ ‘నా బంగారు తల్లి’కి వచ్చిన అవార్డులు–రివార్డులు పక్కన పెడితే, ప్రేక్షకుల స్పందన పట్ల మీరు హ్యాపీనా? మూడు జాతీయ అవార్డులు, నాలుగు నంది అవార్డులు, పదిహేను అంతర్జాతీయ అవార్డులు వచ్చాయి. థియేటర్లలో 25 రోజులు ఆడింది. టీవీలో వచ్చినప్పుడు ప్రేక్షకుల కోరిక మేరకు ఒక్కో నెల్లో నాలుగైదు సార్లు టెలికాస్ట్ చేశారు. అంతకు మించిన ఆనందం ఏముంటుంది చెప్పండి! ♦ ‘రక్తం’ సిన్మాను ఎప్పుడు విడుదల చేస్తారు? మంచి విడుదల తేదీ కోసం ఎదురు చూస్తున్నాం. అంతకంటే ముందు ఇంకా బోలెడన్ని ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌కు సిన్మాను పంపించాలనుకుంటున్నా. -
పేదింట్లో చదువుల ‘జాబిలి’
♦ బాల్య వివాహం వద్దని..గొప్ప చదువులే ముద్దని.. ♦ టెన్త్‌లో 10 జీపీఏ సాధించింది ♦ మెతుకు సీమలో మెరిసిన మమత పాపన్నపేట: పేదింట్లో చదువుల జాబిలి వికసించింది. పేదరికం పరిహసిస్తుంటే పట్టుదలతో పుస్తకం పట్టింది. లక్ష్య సాధన కోసం నిరంతర శ్రామికురాలిగా మారింది. బాల్య వివాహం వద్దంటూ.. గొప్ప చదువులే ముద్దంటూ కన్న వారిని ఎదిరించింది. చదువే లోకంగా.. ఏకాగ్రతే అస్త్రంగా సన్నద్ధమై పదో తరగతి పరీక్షలు రాసి జిల్లా టాపర్‌గా నిలిచింది. మరి ఇప్పుడు పెద్ద చదువులకే దారేది అంటూ దిక్కులు చూస్తుంది మమత. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం కొడుపాక గ్రామానికి చెందిన ఉప్పరి కిష్టయ్య, శంకరమ్మ దంపతుల పెద్ద కుమార్తె మమత చిన్నప్పటి నుంచే చదువుల్లో రాణించడంతో రెండవ తరగతి వరకు లక్ష్మీనగర్‌లోని ఓ ప్రైవేట్ స్కూల్లో చదివించారు. కాని అలవి కాని ఆ ఫీజులు భరించలేక మూడు నుంచి కొడుపాక ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. అయితే, పేదరికం పరిహసిస్తుంటే మమతలో పట్టుదల పెరిగింది. స్నేహితులంతా పాఠశాల నుంచి విహారయాత్రలకు వెళ్తుంటే.. ఇంటి పరిస్థితి తెలసిన మమత మౌనంగా రోదించేది. తోటి వాళ్లు రంగు రంగుల కొత్త బట్టలు వేసుకొస్తే .. ఉన్నవాటితోనే తృప్తిపడేది. కానీ ఈ ఆర్థిక అంతరాలు మమత మనసుపై చెరగని ముద్ర వేశాయి. చదువులపై పట్టుదలను పెంచాయి. క్లాస్మేట్స్ గైడ్లు కొనుక్కొంటే.. ఉచిత పుస్తకాలనే జల్లెడ పట్టేది. బాల్య వివాహాన్ని ఎదిరించి.. నిరుపేద తల్లి దండ్రులకు పెద్ద కుటుంబం శాపంగా మారింది. వర్షాలు లేక మంజీరమ్మ తడారి పోవడంతో వీరి వ్యవసాయ భూమి ఎడారిలా మారింది. ఇద్దరు ఆడపిల్లలు ఉండటంతో ఈ యేడు పెద్దమ్మాయి పెళ్లి చేసి కాస్త బరువు దించుకోవాలనుకున్నారు. వారి నిర్ణయం వినగానే మమత నిప్పు కణికలా రగిలింది. ‘అవసరమైతే నా బతుకు నేను బతకగలను.. నన్ను మాత్రం నేను చదివినంత వరకు చదివించండి. అదే జన్మకు పదివేల’ంటూ ప్రాథేయ పడింది. ఫ్రీ సీటు వస్తేనే చదివిస్తారట.. పట్టుదలతో చదివి పదో తరగతిలో 10 జీపీఏ సాధించా. ట్రిపుల్ ఐటీలో చేరి మంచి ఇంజనీర్ కావాలనుంది. కాని మావాళ్లు మాత్రం ఫ్రీ సీటు వస్తేనే చదివిస్తామంటున్నారు. డబ్బులు కట్టడం మా వల్ల కాదంటున్నారు. ఇంతకీ ట్రిపుల్ ఐటీ పూర్తి చేయడానికి ఎన్ని డబ్బులు అవసరమవుతాయో.. నా లక్ష్యాన్ని ఎలా చేరుతానో తెలియక తీవ్ర ఆందోళనకు గురవుతున్నాను. మనసున్న మారాజు లెవరైనా నాకు దారి చూపి గమ్యం చేర్చాలని వేడుకుంటున్నా. - మమత -
సో మచ్ టు సే...సంతోషం
సినిమా వెనుక స్టోరీ - 3 లంచ్ బ్రేక్. బెనర్జీ, దశరథ్ ఇద్దరూ భోంచేస్తున్నారు. మధ్యలో ఏవో పిచ్చాపాటీ కబుర్లు. ‘‘నీ దగ్గర కథలేమైనా ఉన్నాయా?’’ యథాలాపంగా అడిగారు బెనర్జీ. ‘‘ఓ... చాలా ఉన్నాయ్ సార్. మీరు చేతులు వాష్ చేసుకు రండి. ఇప్పటికిప్పుడు ఓ కథ చెప్తా’’ అన్నాడు దశరథ్.‘నువ్వు-నేను’ షూటింగ్ స్పాట్ అది. తేజ డెరైక్టర్. దశరథ్ అసిస్టెంట్ రైటర్ కమ్ అసోసియేట్ డెరైక్టర్. నటుడు బెనర్జీకి ఇండస్ట్రీలో పరిచయాలెక్కువ. టాలెంట్‌ను ఎంకరేజ్ చేసే గుణమున్నవాడు కాబట్టి, దశరథ్‌ని తీసుకెళ్లి నిర్మాతలు కేఎల్ నారాయణ, ఎస్. గోపాలరెడ్డిలకు పరిచయం చేశాడు. వాళ్లిద్దరూ కలసి పెట్టిన దుర్గా ఆర్ట్స్ టాప్ బేనర్. ‘క్షణక్షణం, హలో బ్రదర్, దొంగాట, ఇంట్లో ఇల్లాలు-వంటింట్లో ప్రియురాలు’ అన్నీ సూపర్ హిట్సే. వాళ్లు మంచి స్టోరీ కోసం వెతుకుతున్నారు. దశరథ్ వచ్చాడు... ‘వన్ హౌస్’ కథ చెప్పాడు. సింగిల్ సిట్టింగ్‌లో ఓకే. స్మాల్ బడ్జెట్... సింగిల్ లొకేషన్... థర్టీ డేస్ షూటింగ్... హీరో తరుణ్ ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. కాల్ షీట్స్ ఫుల్ టైట్. ఫోర్ మంత్స్ తర్వాతే షూటింగ్ పెట్టుకోవాలి. అందుకే మధ్య మధ్యలో ‘నువ్వు-నేను’ వర్క్‌కు అటెండ్ అవుతున్నాడు దశరథ్. కేఎల్ నారాయణ, గోపాలరెడ్డిలకు ఈ సినిమాతో పాటు ఇంకో సినిమా కూడా లైన్లో ఉంది. నాగార్జున డేట్స్ రెడీ. కానీ కథే లేదు. ఎవరెవరో రైటర్స్ వస్తున్నారు... చెబుతున్నారు... వెళుతున్నారు. దశరథ్ దగ్గర ఓ యాక్షన్ కథ ఉంది. ఈ ఇద్దరికీ చెప్పాడు. నచ్చేసింది. స్థలం దొరికితే ఇల్లు కట్టడం ఎంతసేపు! నాగార్జున దగ్గరకు కథ వెళ్లింది. అంతా ఓకే. కానీ డైలమా. షాజీ కైలాస్ డెరైక్షన్‌లో ‘శ్రీరామ్’ అనే యాక్షన్ సినిమా కమిటయ్యాడు నాగ్. ఒకేసారి రెండు యాక్షన్ సినిమాలంటే కష్టం. ‘‘ఏదైనా ఫ్యామిలీ కథ ఉంటే చూడమనండి’’ చెప్పాడు నాగ్. హీరో చెప్పాడంటే ఇక తిరుగేముంది! దశరథ్, రైటర్ గోపీమోహన్ క్లోజ్ ఫ్రెండ్స్. ఇద్దరూ ఓ రెస్టారెంట్లో కూర్చున్నారు. ‘‘గోపీ! ఇది మనకు గోల్డెన్ చాన్స్. నాగార్జున గారికి అర్జంట్‌గా మంచి ఫ్యామిలీ కథ చేయాలి మనం’’ చెప్పాడు దశరథ్ ఉద్వేగంగా. ఇద్దరూ ఏవేవో అనుకున్నారు. ఆ రాత్రి దశరథ్‌కి నిద్ర పట్టలేదు. నాగ్‌కి మంచి కథ చేయాలి. ‘హమ్ దిల్ దే చుకే హై సనమ్’ హిందీ సినిమా గుర్తొచ్చింది. అందులో అజయ్ దేవగణ్ క్యారెక్టరైజేషన్ ఎక్స్లెంట్. అలా ఉండాలి నాగ్ క్యారెక్టరైజేషన్. బుర్రలో లైట్స్ ఆన్. వారంలో లైన్ రెడీ. నాగ్‌కి చెబితే ఫ్లాట్. ఎస్... తనకు రైట్ టైమ్‌లో రైట్ సబ్జెక్ట్. పూర్తి స్క్రిప్టు చేయమని నాగ్ ఆదేశం.దశరథ్ ఆ పనిలో ఉన్నాడు. మొత్తానికి బౌండ్ స్క్రిప్ట్ రెడీ. నాగ్ మళ్లీ విన్నాడు. కానీ ఏం మాట్లాడలేదు. నచ్చలేదా? దశరథ్‌లో డౌట్. ‘నువ్వు - నేను’ కోసం ‘గాజువాక పిల్లా...’ పాట షూట్ చేస్తున్నారు. బోలెడంత మంది స్టూడెంట్స్... హంగామా. దశరథ్ చాలా బిజీగా ఉన్నాడు. అసోసియేట్ కదా! ‘‘ప్లీజ్ కాల్ మీ అర్జంట్’’ అంటూ గోపాలరెడ్డి దగ్గర నుంచీ పేజర్ మెసేజ్. లంచ్ బ్రేక్‌లో కాల్ చేశాడు దశరథ్. ‘‘కంగ్రాట్స్! నాగార్జున గారికి కథ బాగా నచ్చేసింది. నిన్నే డెరైక్ట్ చేయమంటున్నారు’’ చెప్పారు గోపాలరెడ్డి. దశరథ్ ఉలిక్కిపడ్డాడు. ‘‘ఏంటి సార్... మీరనేది?’’ ‘‘అవును దశరథ్! నాగార్జునగారు ఆగస్టు నుంచి డేట్లు కూడా ఇచ్చేశారు. నువ్వు రెడీ అవ్వు’’ అన్నారు గోపాలరెడ్డి. దశరథ్‌కి కాళ్లూ చేతులూ ఆడడం లేదు. ఏదో అనుకుంటే, ఇంకేదో అవుతోంది. తనకిది నిజంగా బంపర్ ఆఫరే! మరి తరుణ్ సినిమా? ‘‘లేదు లేదు... తరుణ్‌తో మేం మాట్లాడతాం. నీకేమీ ఇబ్బంది ఉండదు’’ అని గోపాలరెడ్డి భరోసా ఇచ్చారు. అయినా దశరథ్‌లో టెన్షన్ తగ్గలేదు. ‘‘సార్..! నాగార్జున లాంటి పెద్ద హీరోతో ఇప్పటికిప్పుడు సినిమా అంటే కష్టం. నా వల్ల కాదు. కథ వరకూ తీసుకోండి... ఇచ్చేస్తాను’’ అని చెప్పేశాడు.నాగార్జున దాకా వెళ్లింది విషయం. ఆయనకు దశరథ్ మీద ఫుల్ కాన్ఫిడెన్స్. తానెంతమంది కొత్త డెరైక్టర్లను చూడలేదు! మొదట్లో ఇలానే బెరుకు ఉంటుంది. ‘‘దశరథ్ రియల్ ప్రాబ్లమేంటో కనుక్కోండి’’ - మళ్లీ నాగ్ ఆదేశం. ‘‘నా మీద నాకు కాన్ఫిడెన్స్ రావాలి. నవంబర్ అయితే ఓకే. ఈలోగా నేనూ రెడీ అవుతా’’ అని చెప్పేశాడు దశరథ్. నాగ్ లాంటి స్టార్ హీరో అన్నాళ్లు ఆగుతాడా? కానీ ఆగాడు. కథ అంతలా నచ్చేసింది మరి. టైటిల్ కూడా బాగా కుదిరింది. ‘సంతోషం’. గోపీమోహన్ పెట్టాడు. ఇద్దరు హీరోయిన్లు కావాలి. ‘లగాన్’ ట్రయిలర్ రిలీజైంది ఫ్రెష్‌గా. ‘రాధా కైసాన జలే...’ అంటూ హీరోయిన్ గ్రేసీసింగ్ కవ్విస్తోంది. గ్రేసీ అయితే గ్రేస్‌ఫుల్‌గా ఉంటుందనిపించింది దశరథ్కు. ఈలోగా ‘లగాన్’ రిలీజై, బ్లాక్‌బస్టర్ అయిపోయింది. గ్రేసీకి పెద్ద క్రేజ్. అంత సులువుగా డేట్లు దొరుకుతాయా? దొరికేశాయ్. కథ నచ్చేసింది మరి! మరి ఇంకో హీరోయిన్? రకరకాల ఆప్షన్లు. ఈ వెతుకులాట ఇలా ఉండగా పబ్లిసిటీ డిజైనర్ కృష్ణ ఆఫీసుకెళ్లాడు దశరథ్. ఏదో పోస్టర్ డిజైన్ చేస్తున్నాడు కృష్ణ. ఉషాకిరణ్ మూవీస్ వాళ్ల సినిమా ‘ఇష్టం’. హీరోయిన్ కొత్తమ్మాయి. క్యూట్‌గా ఉంది. కొత్తావకాయలా ఉంది. కానీ మరీ టీనేజ్ గాళ్లా కనబడుతోంది. నాగ్ పక్కన సూటవుతుందా? ఫొటోసెషన్ పెట్టారు. అంతా ఓకే. సెకండ్ హీరోయిన్గా శ్రీయ సెలక్ట్. ఈ సినిమాలో ఓ స్పెషల్ క్యారెక్టర్ ఉంది. ఇంట్రస్టింగ్ యాక్టర్ ఎవరైనా కావాలి. ప్రభుదేవా పేరు సూచించారు గోపాలరెడ్డి. అతనుంటే సెకండాఫ్‌లో మంచి డాన్స్ సాంగ్ కూడా పెట్టొచ్చని ఐడియా. ప్రభుదేవా ఓకే అన్నాడు. త్రివిక్రమ్, చంద్రసిద్ధార్థ్, ఆర్పీ పట్నాయక్, దశరథ్, సునీల్... వీళ్లంతా ఓ గ్యాంగ్. సోమాజీగూడా ‘ట్రైలక్’ రెస్టారెంట్... వీళ్ల అడ్డా. అక్కడే వీళ్ల కెరీర్‌కు బీజాలు పడ్డాయి మరి. ఆర్పీ, దశరథ్ అక్కడే కూర్చుని పాటల గురించి మాట్లాడుకునేవారు. చంద్రసిద్ధార్థ్ రాగానే ‘‘ చందూ బాయ్..! పదండి గండిపేటకు వెళ్దాం’’ అని తొందరపెట్టేసేవారు. ఆ గ్యాంగ్‌లో చంద్రసిద్ధార్థ్ ఒక్కడికే కారు. మిగతా వాళ్లందరికీ బైక్‌లు. ఆ ట్రావెలింగ్‌లోనే మ్యూజిక్ సిట్టింగ్స్. ఓ సిట్యుయేషన్లో ఇంగ్లిషు పాట పెడదామనుకున్నారు. ఆర్పీ ఏదో ట్యూన్ చెబుతున్నాడు. కారు డ్రైవ్ చేస్తున్న చంద్రసిద్ధార్థ్ చాలా క్యాజువల్‌గా ‘సో మచ్ టు సే...’ అంటూ పాడేస్తున్నాడు. ‘‘ఈ పాట ఎందులోది?’’ అడిగాడు ఆర్పీ. ‘‘నువ్వు కట్టిన ట్యూన్‌కి నేను క్యాజువల్‌గా లిరిక్ చెప్పానంతే’’ అని భుజాలెగరేశాడు చంద్రసిద్ధార్థ్. ఆర్పీ చిన్నపిల్లాడిలా సంబరపడిపోతూ ‘‘చందూ గారూ..! ఈ ఇంగ్లిషు పాట మీరే రాయలి’’ అన్నాడు. అలా డెరైక్టర్ చంద్రసిద్ధార్థ్తో ఆ ఇంగ్లిషు పాట రాయించేశారు స్క్రిప్ట్ బాగా వచ్చింది. కానీ క్లైమాక్స్ ఏదో కొడుతోంది. డైలాగ్స్‌లో ఇంకా ఏదో నింపాలి. దశరథ్‌కి త్రివిక్రమ్ గుర్తొచ్చాడు. చిన్న మీటింగ్. క్లైమాక్స్ ప్యాట్రన్ చెప్పాడు దశరథ్. పెన్నూ పేపర్ పట్టుకోకుండా త్రివిక్రమ్ ఒక ఫ్లోలో డైలాగులు చెప్పేశాడు. అదిరింది... క్లైమాక్స్ అదిరింది. దశరథ్‌కి కాన్ఫిడెన్స్ వచ్చేసింది. 2001 నవంబర్ 15. ఊటీలో ఫస్ట్ షాట్ తీశారు. షూటింగ్ స్పీడ్‌గా సాగుతోంది. నాగార్జున, గ్రేసీసింగ్ మీద పాట. రాజు సుందరం కొరియోగ్రఫీ. ఆర్పీ వేడివేడిగా పాట చేసుకొచ్చాడు. ‘‘గల గల గోదారిలా... కిలకిలా రావే చెలి...’’ అంటూ పాట ప్లే అవుతోంది.రాజు సుందరం మొహం చిట్లించాడు. ‘‘ఛా... ఇదేం పల్లవి... నాకు నచ్చలేదు...’’. దశరథ్ గుండెల్లో రాయిపడింది. ఇదేంట్రా బాబూ... కొరియోగ్రాఫర్‌కి కూడా పాట నచ్చాలా? ఏం చెయ్యాలి? తప్పదు. రాజు సుందరం టాప్ కొరియోగ్రాఫర్ కదా! ఆర్పీకి, దశరథ్‌కి ఒకటే రూమ్. ఇద్దరూ రాత్రంతా నిద్రపోలేదు. కొత్త పల్లవి కావాలి. లిరిక్ రైటర్ కులశేఖర్‌కి కాల్ చేస్తే అవుటాఫ్ కాలింగ్ ఏరియా. ఇద్దరూ ఆ మాటా ఈ మాటా అనుకుంటూ పల్లవి రాసేశారు. ‘‘దేవుడే దిగివచ్చినా స్వర్గమే నాకిచ్చినా షాజహాన్ తిరిగొచ్చినా తాజ్‌మహల్ రాసిచ్చినా ఇప్పుడీ సంతోషం ముందర చిన్నబోతాయి అన్నీ కదరా...’’ రాజు సుందరం పల్లవి విని అదిరిందన్నాడు. సునీల్ ఫ్రెండు కాబట్టి మంచి క్యారెక్టర్ ఇవ్వాలి. కానీ ఏదో కొడుతోంది. సునీల్‌తో అదే చెప్పాడు దశరథ్. ‘‘అయితే ఓ పని చేద్దామా? నేను ప్రభుదేవాకు డాన్సు నేర్పించే సీన్ క్రియేట్ చెయ్. బల్బు పెడుతున్నట్టు, ట్యాప్ తిప్పుతున్నట్టు స్టెప్స్ నేర్పిస్తా... ఎలా ఉంది ఐడియా’’ అన్నాడు సునీల్. అందరికీ నచ్చేసింది. అప్పటికప్పుడు అనుకుని అప్పటికప్పుడు తీసేశారు సీన్. 2002 మే 9. ‘సంతోషం’ రిలీజ్. సూపర్‌హిట్ టాక్. ఇది కలో, నిజమో దశరథ్‌కి ఇంకా అర్థం కావడం లేదు. ఏదో ట్రాన్స్‌లోనే ఉన్నాడతను. వరసపెట్టి ఫోన్లు.. మెసేజ్‌లు... గ్రీటింగ్స్... బొకేలు... ఆ రోజు మధ్యాహ్నం ఇంట్లో లంచ్ చేస్తున్నాడు దశరథ్. ఫోన్ మోగింది. ‘‘కంగ్రాట్స్’’... అవతల మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్. ఆయన చెప్పాడంటే తిరుగే ఉండదు. దశరథ్ మనసు నిండిపోయింది... సంతోషంతో! - పులగం చిన్నారాయణ మీ ఫ్యూచర్ టీచర్: ‘నేను ఒక మనిషిని చంపాను’ ఈ వాక్యాన్ని భవిష్యత్ కాలం లో చెప్పండి. చింటూ: మీరు జైలుకు వెళతారు. వెరీ ఇంట్రెస్టింగ్ ఠి నాగార్జునకు ‘సంతోషం’తో ఉత్తమ నటునిగా నంది అవార్డు లభించింది. చిరంజీవి (‘ఇంద్ర’ సినిమా)తో కలసి ఈ పురస్కారాన్ని పంచుకున్నారు. ఇలా ఇద్దరు నటులకు కలిపి, ఉత్తమ నటునిగా నంది అవార్డు ఇవ్వడం ఇదే ఫస్ట్ టైమ్. తరుణ్‌తో చేద్దామనుకున్న ‘వన్ హౌస్’ స్క్రిప్టుతో ఆ తర్వాత గోపీమోహన్ డెరైక్షన్ చేయాలనుకున్నారు. ఉదయ్‌కిరణ్‌ను హీరోగా అనుకున్నారు. కుదర్లేదు. -
‘ఉపకారం’ ఊసేది..?
జాడలేని ‘ఉపకార వేతనాల’దరఖాస్తు ప్రక్రియ ముగుస్తున్న విద్యాసంవత్సరం ఇప్పటికీ స్పష్టత ఇవ్వని సర్కార్ ఫీజులు చెల్లించాలంటూ ఒత్తిడి చేస్తున్న కళాశాల యాజమాన్యాలు ఆందోళనలో లక్షలాది విద్యార్థులు రంగారెడ్డి జిల్లా కందుకూరుకుచెందిన పి.మమతకు ఇబ్రహీంపట్నంలోని కళాశాలలో బీటెక్ (మెకానికల్) సీటు వచ్చింది. కన్వీనర్ కోటాలో సీటు రావడంతో నాలుగేళ్ల కోర్సు ఉచితంగా చదవొచ్చని భావించింది. కానీ తొలిఏడాది పూర్తికావస్తున్నా.. ఇప్పటివరకు ఉపకారవేతనం, ఫీజు రాయితీపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో దరఖాస్తు సైతం చేసుకోలేదు. మరోవైపు కళాశాల యాజమాన్యం ట్యూషన్ ఫీజు చెల్లించాలని, ప్రభుత్వం విడుదల చేస్తే తిరిగి చెల్లిస్తామంటూ ఒత్తిడి చేస్తోంది. దీంతో నాలుగేళ్లు సాఫీగా సాగుతుందనుకున్న మమతకు ఆదిలోనే కష్టాలు మొదలయ్యాయి. మెదక్‌జిల్లా సిద్దిపేటకు చెందిన ఆశిష్ రంగారెడ్డిజిల్లా ఘట్కేసర్ సమీపంలోని కళాశాలలో బీటెక్ ఫైనలియర్ చదువుతున్నాడు. కోర్సు ముగుస్తున్న తరుణంలో పట్టుదలతో చదివి మంచి మెరిట్‌తో ఉద్యోగం సంపాదించాలనేది అతని లక్ష్యం. కానీ ఈ ఏడాది ప్రభుత్వం ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ దరఖాస్తుల ప్రక్రియ చేపట్టలేదు. దీంతో ఈ ఏడాది ఉపకార వేతనం అందలేదు. దీంతో హాస్టల్లో బకాయి పేరుకుపోయింది. మరోవైపు ప్రభుత్వం ఫీజు రాయితీ స్పష్టత ఇవ్వకపోవడంతో కళాశాల యాజమాన్యం సైతం ఫీజు చెల్లిస్తేనే సెమిస్టర్ పరీక్షలకు అనుమతిస్తామని తేల్చిచెప్పింది. ఫలితంగా ఒత్తిడికి గురైన ఆశిష్.. చదవుపై ధ్యాస పెట్టలేకపోతున్నాడు. సాక్షి, రంగారెడ్డి జిల్లా: కళాశాల విద్యార్థులు కష్టాల్లో పడ్డారు. ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంటుతో ఉన్నత విద్యను సాఫీగా పూర్తిచేయాలని భావించగా.. ప్రస్తుత పరిస్థితులు అందుకు ప్రతిబంధకంగా మారాయి. 2014-15 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం ఉపకార వేతన దరఖాస్తుల ప్రక్రియే ప్రారంభించలేదు. వార్షిక సంవత్సరం ముగుస్తుండగా.. దరఖాస్తులే స్వీకరించకపోవడంతో ఈ ఏడాది ఉపకారవేతనాలు, ఫీజు రాయితీ అందుతాయా, లేదా? అని విద్యార్థులు సందిగ్ధంలో పడ్డారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 8.6 లక్షల మంది విద్యార్థులు పోస్టుమెట్రిక్ కోర్సులు చదువుతున్నారు. అర్హులా.. కాదా..? సాధారణంగా విద్యాసంవత్సరం ప్రారంభమైన రెండు, మూడు నెలల్లో ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి వివరాలను ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ప్రభుత్వం విద్యార్థులకు కల్పిస్తుంది. దాదాపు నెలరోజుల గడువుతో ఈ ప్రక్రియ ముగిసిన అనంతరం వచ్చిన దరఖాస్తులను సంక్షేమాధికారులు కళాశాలల వారీగా క్షేత్రపరిశీలన చేస్తారు. ఈ సందర్భంలోనే వడపోత చేపట్టి అర్హులైన విద్యార్థులను ధ్రువీకరిస్తారు. ఈ క్రమంలో ఆయా విద్యార్థులు ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హత సాధిస్తారు. ఈ ప్రక్రియ దాదాపు రెండున్నర నెలలపాటు సాగుతుంది. గత విద్యాసంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా 8,56,422 మంది ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తులను పరిశీలించిన అధికారులు 7,78,565 మందిని అర్హులుగా గుర్తిం చారు. ప్రస్తుత విద్యాసంవత్సరంలో దరఖాస్తుల ప్రక్రియే ఇంకా ప్రారంభం కాకపోవడం విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. కొత్త రాష్ట్రంలో ఏర్పాటైన ప్రభుత్వం విధించే నిబంధనలతో దరఖాస్తు చేసుకున్నప్పటికీ.. తాము అర్హులమవుతామా, లేదా? అనే సందేహం వారిని తొలచివేస్తోంది. మరోవైపు కళాశాల యాజమాన్యాలు కూడా ఫీజులు చెల్లించాలంటూ విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నాయి. ఫీజులిస్తేనే పరీక్షలకు అనుమతిస్తామంటూ తేల్చిచెప్పడం విద్యార్థులకు భయాందోళన కు గురిచేస్తోంది. ఈ ఏడాది కష్టమే..! విద్యార్థుల ఉపకార వేతనాలకు సంబంధించి ప్రభుత్వం దరఖాస్తుల ప్రక్రియపై ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేదు. ఒకవేళ ఇప్పటికిప్పుడు దరఖాస్తుల స్వీకరణకు ఉపక్రమించినప్పటికీ.. ఈ వార్షిక సంవత్సరం ముగిసేనాటికి విద్యార్థులకు ఉపకారవేతనాలు అందడం కష్టమే. ఎందకంటే దరఖాస్తుల ప్రక్రియకు గరిష్టంగా నెలరోజుల గడువు అవసరం. అనంతరం వాటిని పరిశీలించి ధ్రువీకరించడానికి మరికొంత సమయం అవసరమవుతుంది. ఈలోపు ప్రస్తుత వార్షిక సంవత్సరం సైతం పూర్తి కానుండడంతో ఈ ఏడాదిలో విద్యార్థులకు ఉపకార వేతనాలు, ఫీజు రాయితీ పొందే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. మరోవైపు వార్షిక పరీక్షలు, సెమిస్టర్ పరీక్షలు ముంచుకొస్తుండడంతో దరఖాస్తుల ప్రక్రియ విద్యార్థులకు సైతం తలనొప్పి కానుంది. ఇంతవరకు ఏమీ రాలేదు నేను కాలేజీలో చేరిన దగ్గరినుంచి ఇప్పటివరకు రూపాయి రాలేదు. చాలా ఇబ్బందిగా ఉంది. మొదట్లో ఏమీ అనకపోయినా కళాశాల వర్గాలు ఇప్పుడు ఫీజు కట్టమంటున్నాయి. పరీక్షలు దగ్గర పడుతున్న కొద్దీ టెన్షన్‌గా ఉంది. కళాశాల యాజమాన్యం ఇప్పుడు ఒత్తిడి చేయకపోయినా పరీక్షల సమయంలో చేస్తే ఏం చేయాలో అర్థం కావడం లేదు. - పి. అరుణ్, డిగ్రీ ఫస్టియర్, డీజీఆర్ఎం డిగ్రీ కళాశాల, తుంగతుర్తి, నల్లగొండ త్వరలో దరఖాస్తులు స్వీకరిస్తాం పోస్టుమెట్రిక్ విద్యార్థుల ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పద్ధతిలో మార్పు లేదు. గతేడాది విధానాన్నే ఈ సారి కూడా అనుసరిస్తామని ప్రభుత్వం చెప్పింది. దీంతో త్వరలో దరఖాస్తుల స్వీకరణకు మార్గదర్శకాలిస్తుంది. - వి.వి.రమణారెడ్డి, జిల్లా వెనుకబడిన తరగతుల శాఖ ఉప సంచాలకులు -
ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలి మౌన పోరాటం
పోచమ్మమైదాన్ : ప్రియుడి ఇంటి ఎదుట ఓ యువతి మౌన పోరాటానికి దిగిన సంఘటన నగరంలోని క్రిస్టియన్ కాలనీలో బుధవారం సాయంత్రం జరిగింది. బాధితురాలి కథనం ప్రకారం.. కిస్ట్రియన్ కాలనీకి చెందిన బైరపాక అఖిల్(సన్నీ), అదే ప్రాంతానికి చెందిన పోలేపాక మమత ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అరుుతే అతడు మమతను మోసం చేసి మరో యువతిని ఈ నెల 6న వివాహం చేసుకుంటున్నాడని తెలియడంతో బుధవారం సాయంత్రం ఆమె మహిళా సంఘాలతో వచ్చి ఇంటి ముందు దీక్షకు కూర్చుంది. మమతకు మహిళా సంఘాల సభ్యులు కూడా అండగా నిలిచి, బైఠారుుంచారు. ఈ సందర్భంగా మమత మాట్లాడుతూ ఏడేళ్లుగా కలిసి తిరిగామని, తమ ఇం ట్లోనో ఉండేవాడని, తీరా ఇప్పుడు మరో అమాయిని పెళ్లి చేసుకుంటున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. మూడేళ్లుగా పెళ్లి విషయూన్ని వారుుదా వేస్తూ వచ్చాడని, నవంబర్ 29న రిజిస్ట్రర్ మ్యారేజ్ చేసుకుందామన్నాడని, అంతేగాక బీరువా, బోల్లు, మంచం కోసం అని రూ.20 వేలు సైతం తీసుకెళ్లాడని చెప్పింది. తనను మోసం చేసి కాజీపేటకు చెందిన అమ్మాయిని వివాహం చేసుకునేం దుకు సిద్ధమయ్యూడని విలపించింది. చర్చి కమిటీ, సీఐ కి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, ఇప్పటికైనా తనకు న్యాయం చేయాలన్నారు. ధర్నాలో టీఆర్ఎస్ మిహ ళా నాయకులు తాళ్ల ఉమాదేవి, రేణుక పాల్గొన్నారు. -
మమతను వణికిస్తున్న ‘శారద’
శారదా చిట్‌ఫండ్ దక్షిణ బరసత్ ప్రాంత ఏజెంట్ చక్రవర్తి ఖాతాదారులను ఆకర్షించడానికి మమత ఫొటోను ఉపయోగించుకున్నాడు. ఇలాంటి పొంజి సంస్థలు దేశంలో 80 వరకు ఉన్నాయని పార్లమెంటులో యూపీఏ ప్రకటించడం దీనికి కొసమెరుపు. రాజకీయ స్పర్శతో అవినీతి, మోసం, దగా వంటి పదాల అర్థం, లోతు విశేషంగా విస్తరించాయి. ప్రస్తుతం పశ్చిమ బెంగా ల్‌నూ, అక్కడ రాజ్యమేలుతున్న తృణమూల్ కాంగ్రెస్‌నూ ఎబోలాను మించి వణికిస్తున్న శారదా చిట్‌ఫండ్ కుంభకోణా నికి ఆ మూడు లక్షణాలు ఉన్నాయి. రూపాయి పెట్టుబడికి మూడేళ్లలో రూపాయి లాభం అంటూ ప్రజలను బురిడీ కొట్టించే పొంజి తరహా కుంభకోణమిది. దేశంలోనే అతి పెద్ద పొంజీ మార్కు (పొంజి అనేవాడు అమెరికాలో ఇలాగే మోస గించాడని ఆ పేరే ఖాయం చేశారు) కుంభకోణంగా పేరు మోసిన ఈ వ్యవహారంతో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, మంత్రులు, ఎంపీలు, పోలీసు ఉన్నతాధికారులు, మాజీ నక్సల్, గొప్ప కళాకారులు పీకల్లోతు కష్టాల్లో చిక్కుకున్నారు. శారదా చిట్‌ఫండ్ తూర్పు భారతంలోనే పెద్ద సంస్థ. పది పత్రికలు, కొన్ని టీవీ చానళ్లు ఉన్నాయంటేనే ఆ సంస్థ విస్తృతి ఎంతో అర్థమవుతుంది. 2006లో ఆరంభమైన ఈ సంస్థ ఏడేళ్ల లోనే రూ. 20,000 కోట్ల వ్యాపారానికి ఎదిగిపోయింది. ఈ మహా సామ్రాజ్యాన్ని నిర్మించినవాడే సుదీప్తసేన్. ఏప్రిల్ 15, 2013న ఈ కుంభకోణం ఉరుములేని పిడు గులా పశ్చిమబెంగాల్ మీద పడింది. తన మూడు సెల్ఫోన్లకు గళ దిగ్బంధనం చేసి, సేన్ పరారీ కావడంతో గగ్గోలు మొద లైంది. అయితే ఏప్రిల్ 23నే ఇతడిని కాశ్మీర్లో అరెస్టు చేయ డంతో అనేక దేవరహస్యాలు పత్రికలకెక్కాయి. పశ్చిమ బెంగా ల్లోని 19 జిల్లాలలో నాలుగు లక్షల మంది మదుపుదారులను సుదీప్త నిలువునా ముంచాడు. ఈ కుంభకోణం మొత్తం రూ.10,000 కోట్లని సీబీఐ తేల్చింది. నిజానికి 1990లో సంచయని సేవింగ్స్ చిట్‌ఫండ్ సంస్థ దివాలా అనుభవం బెంగాల్‌కు ఉంది. సుదీప్త చేసినది తాజా మోసం. శారద చిట్‌ఫండ్ కార్యకలాపాలు ఎలా ఉండేవి? దక్షిణ బరసత్ ఏజెంట్ చక్రవర్తి ఉదంతం చూస్తే చాలు, అంతా అర్థమ వుతుంది. ఇతడు 500 మందిని తన కింద నియమించాడు. వీరంతా 50మంది వంతున ఖాతాదారులను చేర్చారు (మొత్తం 3 లక్షల మంది ఏజెంట్లు). శారద సంస్థ రకరకాల ప్యాకేజీలను జనం ముందుకు తెచ్చింది. ఇంటి స్థలం, ఇల్లు కొనవచ్చు. వ్యవసాయోత్పత్తులలో పెట్టుబడులు పెట్టొచ్చు. కొంత మదుపు తరువాతైనా ఉపసంహరించుకోవచ్చు. ఉపసంహరిం చిన మొత్తం మీద 14 శాతం వరకు వడ్డీ ఇస్తారు. ఇదీ ప్రచారం. చిత్రంగా పోలీసు అధికారుల భార్యలను ఎక్కువగా ఏజెంట్లుగా నియమించేవారు. బెంగాల్ గ్రామీణ ప్రజలు, చిన్న పట్టణాల ప్రజలు ఎగబడి డబ్బు పెట్టారు. శారదా చిట్‌ఫండ్ దివాలా తీశాక 14 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఎవరికీ ఏమీ చెల్లించకుండానే సంస్థ మూతపడింది. ఇంతకీ సుదీప్త ఎవరు? 1970ల నాటి నక్సల్ ఉద్యమంలోకి ఆవేశంగా వెళ్లిన శంక రాదిత్య సేన్, పదేళ్ల తరువాత హఠాత్తుగా ప్లాట్ల వ్యాపారిగా అవతరించాడు. కొద్దికాలం తరువాత అతడే సుదీప్తసేన్ పేరుతో శారదా చిట్‌ఫండ్‌ను నెలకొల్పాడు. సుదీప్తతో మాట్లా డిన వారు, చూసిన వారు తక్కువ. తన మీడియా విభాగం సీఈఓ కునాల్ ఘోష్‌ను కూడా సుదీప్త సమావేశానికి అనుమ తించేవాడు కాదు. ఆ పత్రికల సంపాదకురాలు ప్రఖ్యాత నటి అపర్ణా సేన్. ఆమె తన కార్యాలయాన్ని మూడున్నర కోట్లతో ఆధునీకరించిన సంగతి మీద ఇప్పుడు సీబీఐకి వివరణ ఇచ్చారు. కునాల్ తృణమూల్ తరఫున రాజ్యసభకు ప్రాతి నిధ్యం వహిస్తున్నారు. సుదీప్తకు కోల్‌కతాలోని సాల్ట్‌లేక్ ప్రాం తంలో ఐదు ఇళ్లు ఉన్నాయని వెల్లడైంది. అతడికి ముగ్గురు భార్యలని సాక్షాత్తూ మమతా బెనర్జీ నిరుడు ఏప్రిల్ 13న ప్రక టించడం విశేషం. ఇప్పుడు సుదీప్త విజృంభణకు మీరంటే మీరే కారణమని సీపీఎం, తృణమూల్ ఆరోపించుకుంటున్నాయి. కానీ తనకూ, తృణమూల్కూ ఉన్న బంధం ఎలాంటిదో సీబీఐకి రాసిన 18 పేజీల లేఖలో సుదీప్త క్షుణ్ణంగా ఆవిష్కరిం చాడు. రూపూ రేఖా లేకపోయినా మమత వేసిన పెయింటిం గుల కొనుగోలుకు కోటీ ఎనభై లక్షల రూపాయలు వెచ్చించానని ఆ కళాహృదయుడు వాపోయాడు. ఆ పార్టీ ఎంపీ సృంజయ్ బోస్ పేరు కూడా లేఖలో రాయడంతో ఇతడిని సీబీఐ ప్రశ్నించింది. ఇతడు అరెస్టయిన కొద్దిసేపటికే 2012లో సుదీప్త, మమత డార్జిలింగ్ దగ్గర సమావేశమైన సంగతిని బయటపెట్టాడు. కాబట్టి ఇప్పుడు మమత ప్రమేయం మీద సీబీఐ దృష్టి సారించింది. కాగా, నటి, టీఎంసీ ఎంపీ శతాబ్ది రాయ్ ఆ సంస్థ బ్రాండ్ అంబాసిడర్. శారదా చిట్‌ఫండ్ దక్షిణ బరసత్ ఏజెంట్ చక్రవర్తి ఖాతాదారులను ఆకర్షించడానికి మమత ఫోటోను ఉపయోగించుకున్నాడు. శారద చిట్‌ఫండ్ అంబులెన్స్ సర్వీసులను ఆమె ప్రారంభించినప్పటి ఫోటో అది. ఇలాంటి పొంజి సంస్థలు దేశంలో 80 వరకు ఉన్నాయని పార్లమెంటులో యూపీఏ ప్రకటించడం దీనికి కొసమెరుపు. 1990లో బెంగాల్‌ను కుదిపిన సంచయిన అధిపతి భూదేబ్ సేన్, సుదీప్త తండ్రేనన్న అనుమానాలు మరో కొసమెరుపు. గోపరాజు -
భవిష్యత్ అవసరాలకు అణుశక్తి తప్పనిసరి
డెంకాడ, న్యూస్‌లైన్: దేశంలో విద్యుత్‌తో పాటు ఇతర రంగాల అవసరాలు తీరాలంటే అణుశక్తి తప్పనిసరి అని అణుశక్తి కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ ఎస్.బెనర్జీ అన్నారు. గురువారం డెంకాడ మండలంలోని చింతలవలస ఎంవీజీఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2030 నాటికి దేశంలో 60వేల బిలియన్ వాట్ల విద్యుత్ అవసరం ఉంటుందన్నారు. అందువల్ల ఈ అవసరాలను తీర్చాలంటే తప్పనిసరిగా అణు విద్యు త్ను ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. నీరు లేకపోతే జలవిద్యుత్ ఉత్పత్తి అయ్యే పరిస్థితి లేదన్నారు. అలాగే బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లకు కూడా రానురాను బొగ్గు నాణ్యత లేకపోవడం, పర్యావరణ సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందన్నారు. సౌర విద్యుత్‌కు వచ్చేసరికి ఎండ ఉంటే తప్ప చార్జింగ్ అవదన్నారు. అందువల్ల అణువిద్యుత్ అవసరం తప్పని సరి కానుందన్నారు. విశాఖపట్నం జిల్లా అచ్యుతాపురంలో కొత్తప్లాంట్ ఏర్పాటు జరుగుతోందన్నారు. శ్రీకాకుళం జిల్లా కొవ్వాడ అణువిద్యుత్ ప్లాంట్‌కు మెజార్టీ ప్రజలు ఆమోదిస్తున్నప్పటికీ ఇంకా అక్కడ కొంత మందికి అనేక అనుమానాలు ఉన్నాయన్నారు. ఈ అనుమానాలపై వారికి అవగాహన కల్పించి, వారిని కూడా ఒప్పించాల్సిన బాధ్యత ఉందన్నారు. పరిశ్రమలకు, ఇతర అవసరాలకు నిరంతరం విద్యుత్ సరఫరా చేయాల్సిన అవసరం ఉందని, అలా చేయకపోవడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. సమావేశంలో కళాశాల ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కేవీ.ఎల్ రాజు తదితరులు పాల్గొన్నారు. -
ఓఎన్జీసీ లాభం 34% డౌన్
న్యూఢిల్లీ: ఆయిల్ రంగ దిగ్గజం ఓన్జీసీ ఈ ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్‌కు రూ. 4,016 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గతేడాది ఏప్రిల్-జూన్‌లో ఆర్జించిన రూ. 6,078 కోట్లతో పోలిస్తే ఇది 34% క్షీణత. ఇందుకు సబ్సిడీల చెల్లింపు బిల్లు పెరగడం కారణమైనట్లు కంపెనీ ఫైనాన్స్ డెరైక్టర్ ఏకే బెనర్జీ పేర్కొన్నారు. కాగా, వరుసగా నాలుగో క్వార్టర్లోనూ లాభాలు తగ్గడం గమనార్హం. ఈ కాలంలో సబ్సిడీలకు 2% అధికంగా రూ. 12,622 కోట్లను కేటాయించింది. ఇంతక్రితం ఈ పద్దుకింద రూ. 12,346 కోట్లను చెల్లించింది. సబ్సిడీల చెల్లింపులు నికర లాభాలపై రూ. 7,131 కోట్లమేర ప్రతికూల ప్రభావాన్ని చూపాయని బెనర్జీ తెలిపారు. లేదంటే ఈ నిధులను విదేశాలలో ఆస్తుల కొనుగోళ్లకు, మరిన్ని ఇంధన అన్వేషణ కార్యక్రమాలకు వినియోగించేవాళ్లమని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా సబ్సిడీ చెల్లింపుల కారణంగా నగదు నిల్వలు తరిగిపోయే అవకాశమున్నదని చెప్పారు. ఈ బాటలో మార్చి చివరికల్లా 16% తగ్గిన నగదు నిల్వలు రూ. 13,200 కోట్లకు పరిమితమైనట్లు వెల్లడించారు. వీటితోపాటు ఉద్యోగుల పెన్షన్‌కు సంబంధించిన వన్‌టైమ్ చార్జీలు కూడా లాభాలను ప్రభావితం చేశాయని తెలిపారు. ఆదాయంలోనూ క్షీణతే ప్రస్తుత సమీక్షా కాలానికి ఆదాయం నామమాత్రంగా తగ్గి రూ. 19,309 కోట్లకు పరిమితమైంది. గత ఏప్రిల్-జూన్‌లో రూ. 20,178 కోట్లు నమోదైంది.చమురు ధరలు తగ్గడంతో ఆదాయాల్లోనూ కోతపడిందని బెనర్జీ చెప్పారు. ఈ కాలంలో ఉత్పత్తి మాత్రం 6.007 మిలియన్ టన్నుల నుంచి 6.025 మిలియన్ టన్నులకు పెరిగిన ట్లు తెలిపారు.స్థూల ంగా బ్యారల్ చమురును 102.90 డాలర్ల ధరలో విక్రయించినప్పటికీ డిస్కౌంట్లు, సబ్సిడీ చెల్లింపుల వంటివిపోగా నికరంగా 40.17 డాలర్లు లభించినట్లు వెల్లడించారు. గతంలో బ్యారల్‌కు 45.91 డాలర్ల చొప్పున ఆర్జించింది.