ప్రస్తుతం టాలీవుడ్ సెన్సేషన్ స్టార్ విజయ్ దేవరకొండ అటు సోషల్ మీడియాలోనూ ఇటు మీడియాలోనూ హైలైట్‌గా నిలిచారు. కరోనా కష్టకాలంలో తనపై, తన సహాయక కార్యక్రమాలపై అసత్య ఆరోపణలతో వార్తలు రాసిన వెబ్‌సైట్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ విజయ్ ఓ వీడియో విడుదల చేశాడు. అంతేకాకుండా ‘కిల్ ఫేక్ న్యూస్’ అంటూ పిలుపునిచ్చాడు. దీంతో విజయ్‌కు మద్దతుగా టాలీవుడ్ ఇండస్ట్రీ ముందుకు కదిలింది. టాలీవుడ్ ప్రముఖులు చిరంజీవి, మహేశ్‌బాబు, నాగార్జున, రవితేజ, కొరటాల శివ, అనిల్ రావిపూడి తదితరులు విజయ్‌కు అండగా నిలుస్తూ ట్వీట్లు చేశారు.
తాజాగా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) తాత్కాలిక అధ్యక్షుడు బెనర్జీ కూడా విజయ్‌కు సంఘీభావం తెలిపాడు. ‘మధ్యతరగతి కుటుంబాలు ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎంత అవసరమైనా ఎవరి ముందు చేతులు చాచి అడగలేరు. ఎందుకంటే వారికి ఆత్మాభిమానం అడ్డొస్తుంది. అలాంటి మిడిల్‌క్లాస్ కుటుంబాల కోసం విజయ్ దేవరకొండ ఓ ఛారిటీ ఏర్పాటు చేసి సహాయం అందించడం అభినందనీయం. అదేవిధంగా కరోనా క్రైసిస్ ఛారిటీ(సీసీసీ)కి విరాళం ప్రకటించి తన గొప్ప మనసును చాటుకున్నాడు.
అయితే అతడు చేస్తున్న మంచి పనులను అభినందించకున్నా పర్లేదు కానీ బురద జల్లడం మంచిది కాదు. అసలు మీరెవరండి? హు ఆర్ యూ? మేం ఎంత విరాళం ఇస్తాం, ఎవరికి ఇస్తాం అనేది మా(ఆర్టిస్టులు) ఇష్టం. విరాళం ఎందుకు ఇవ్వడం లేదు? ఎక్కడ దాక్కున్నాడు అంటూ రాయడం సరికాదు. ఇలా విజయ్ దేవరకొండకు అనే కాదే సినీ ఇండస్ట్రీలో ఎవరికి ఇలాంటి సమస్య ఎదురైనా మేమందరం ఉన్నాం. అండగా నిలుచుంటాం. సినీ ఇండస్ట్రీ అంతా ఒక్కటే’ అని బెనర్జీ ఆ వీడియోలో పేర్కొన్నాడు.
చదవండి:
తమిళ హీరో సూర్యకు బిగ్ షాక్ !
శివాజీరాజాకు గుండెపోటు
Comments
Please login to add a commentAdd a comment