
బిష్ణు, హిమాంశి కురానా, అపర్ణ శర్మ ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘ఏక్’. ‘బీయింగ్ హ్యూమన్’ అనేది ఉపశీర్షిక. రుద్రారపు సంపత్ డైరెక్షన్‌లో కె.వరల్డ్ మూవీస్ బ్యానర్‌పై హరికృష్ణ నిర్మించిన ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ– ‘‘మానవీయ విలువలతో, మంచి కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది. యూత్‌ని టార్గెట్ చేసుకుని తీసిన చిత్రమిది.
‘మంత్ర’ ఆనంద్ స్వరపరచిన మా చిత్రం పాటలను హీరో నాగార్జునగారు విడుదల చేయగా చాలా మంచి స్పందన వచ్చింది. హిందీ డబ్బింగ్ రైట్స్ కోసం ఫ్యాన్సీ ఆఫర్స్ వచ్చాయి. ఏప్రిల్‌లో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. సుమన్, బెనర్జీ, పృథ్వీ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: చక్రవర్తి ఘనపాటి, స్టోరీ– స్క్రీన్‌ప్లే– డైలాగ్స్– నిర్మాత: హరికృష్ణ కొక్కొండ.
Comments
Please login to add a commentAdd a comment