
రవి కనగాల, అవంతి శ్రీనివాస్, యండమూరి
‘‘అతడు ఆమె ప్రియుడు’ సినిమా టీజర్ చాలా బాగుంది. ఈ సినిమా అద్భుత విజయం సాధించి, యూనిట్‌కి మంచి పేరు, డబ్బులు రావాలి’’ అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. సునీల్, కౌశల్, బెనర్జీ, మహేశ్వరి ముఖ్య పాత్రల్లో యండమూరి వీరేంద్రనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అతడు ఆమె ప్రియుడు’. కూనం కృష్ణకుమారి సమర్పణలో రవి కనగాల, రామ్ తుమ్మలపల్లి నిర్మించిన ఈ చిత్రం టీజర్‌ని అవంతి శ్రీనివాస్ విడుదల చేశారు. యండమూరి వీరేంద్రనాథ్ మాట్లాడుతూ– ‘‘చిరంజీవి నటించిన పలు బ్లాక్ బస్టర్స్‌కు కథలు అందించిన నేను ఆయనకు పెద్ద ఫ్యాన్. రవి కనగాల–తుమ్మలపల్లి ఖర్చుకు వెనకాడకుండా ఈ సినిమా నిర్మించారు’’ అన్నారు. ‘‘అతి త్వరలో మా సినిమా విడుదల కానుంది’’ అన్నారు రవి కనగాల, రామ్ తుమ్మలపల్లి.
Comments
Please login to add a commentAdd a comment