erotic fiction
-
అవి అసలు పోర్న్ వీడియోలే కాదు: కుంద్రాకు మద్దతుగా నటి
సాక్షి,ముంబై: అశ్లీల చిత్రాల కేసులో అడ్డంగా బుక్కైన వ్యాపార వేత్త, నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్ర వ్యహారంపై వివాదాస్పద నటి మోడల్ గెహనా వశిష్ట్ (వందన తివారీ) స్పందించింది. తాము ఎలాంటి పోర్న్ వీడియోలు తయారు చేయలేదని వాదించింది. అవన్నీ నార్మల్ ఎరోటికా వీడియోలు మాత్రమేనని చెప్పుకొచ్చింది. కానీ కావాలనే కొంతమంది తమను టార్గెట్ చేశారని ‘గంధీ బాత్’ ఫేమ్ గెహనా ఆరోపించింది. శృంగారానికి, అశ్లీలానికి మధ్య తేడాను గమనించాలంటూ ఒక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది గెహనా. తానసలు పోర్న్ సినిమాల్లో నటించనే లేదని చెప్పు కొచ్చింది. తమ వీడియోల్లో ఒక్కటి కూడా పోర్న్ కేటగిరీ కిందకి రాదనిపేర్కొంది. అంతేకాదు ఏక్తాకపూర్ లాంటి వారు చేసే వీడియోల్లాంటివే తప్ప, అశ్లీలం ఎంతమాత్రం లేదంటూ కుంద్రాను వెనకేసు కొచ్చింది. ముందు తమ వీడియోలను చూసి, అపుడు అవి పోర్న్ అవునో కాదో తేల్చాలని మీ అందరినీ కోరుతున్నానని వ్యాఖ్యానించింది. ఎరోటికా కంటెంట్‌తో పోర్న్‌ను కలపడం సరైంది కాదంది. నిజానికి ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్న అసలైన పోర్న్ వీడియోలపై దృష్గి పెట్టాలని ఆమె కోరింది. అయితే ఈ విషయంలో చట్టం తన పని తాను చేసుకుంటుందని, ప్రపంచంలోనే అత్యుత్తమ పోలీసులుగా పేరున్న ముంబై పోలీసులపై తమకు పూర్తి విశ్వాసం ఉందని పేర్కొంది. నిజమైన నేరస్థు లెవరో, కోర్టులు తేలుస్తాయని, న్యాయం జరుగుతుందనే నమ్మకం తమకుందని తెలిపింది. కావాలనే తనను, శిల్పాశెట్టి, కుంద్రాను టార్గెట్ చేస్తున్నారని గెహనా వశిష్ట్ ఆరోపించింది. రాజ్ కుంద్రా మాజీ పీఏ ఉమేష్ కామత్ భారతదేశంలోని కెన్రిన్ ప్రొడక్షన్ హౌస్ ప్రతినిధిగా పనిచేశారని, ఈ సమయంలో ఈ సంస్థ ద్వారా పోర్న్ ఫిల్మ్‌ల కోసం చాలా మంది ఏజెంట్లకు కాంట్రాక్టులు ఇచ్చి నిధులు సమకూర్చుకున్నట్టు సమాచారం. ఇలా ఒప్పందాలు చేసుకున్న వారిలో గెహానా వశిష్ట్ కూడా ఉన్నారని తెలుస్తోంది. కాగా ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు కుంద్రాను సోమవారం అర్థరాత్రి అరెస్ట్ చేయడం కలకలం రేపింది. కుంద్రాతోపాటు, ర్యాన్ థార్ప్‌ను కూడా మంగళవారం కోర్టుముందు హాజరు పర్చిన పోలీసులు జూలై 23 వరకు పోలీసు కస్టడీకి తరలించిన సంగతి తెలిసిందే. -
శృంగారం, పోర్నోగ్రఫీ ఒకటేనా?
న్యూఢిల్లీ: మన దేశంలో శృంగారాన్ని, పోర్నోగ్రఫీని ఒకేవిధంగా చూస్తున్నారని ప్రముఖ రచయిత్రి అమృత నారాయణన్ అభిప్రాయపడ్డారు. ఈ రెండింటికీ చాలా తేడా ఉందని.. శృంగారం ఆత్మాశ్రయమని ఇందులో ఒకరిపట్ల ఒకరికి ఆపేక్ష, భావోద్వేగాలు కలగలసి ఉంటాయని వెల్లడించారు. పోర్నోగ్రఫీలో కామం మాత్రమే ఉంటుందని వివరించారు. సాహిత్య ఆజ్‌తక్ కార్యక్రమంలో భాగంగా ‘రైటింగ్ ఎరోటికా ఇన్ ఇండియా’ అంశంపై జరిగిన చర్చలో మాధురి బెనర్జీతో కలిసి ఆమె పాల్గొన్నారు. మన భావాలను స్వేచ్ఛగా వెల్లడించే అవకాశం పుస్తకాలు కల్పిస్తాయని, అందుకే తాను రాయడం మొదలుపెట్టానని అమృత వెల్లడించారు. ‘కష్టపడి పనిచేసే మనుషులున్న దేశంగానే స్వాతంత్ర్యం వచ్చాక మనదేశం గుర్తింపు కోరుకుంది. హార్డ్‌వర్క్, లైంగికత రెండింటినీ కలపలేదు. స్వాతంత్ర్యం వచ్చాక సాంస్కృతిక వారసత్వంలో ఈ అంశాన్ని మనం వదిలేశాం. మన దేశానికి ఇంగ్లీషు పరిచయమైన కొత్తలో మనల్ని అనాగరీకులుగా చూశారు. మనం కూడా అలాగే వ్యవహరించాం. నైతిక విలువలను మధ్యతరగతి మీద రుద్దడంతో అది కూడా ఇలాగే కొనసాగింది. ఎందుకంటే దేశాన్ని ప్రమోట్ చేయడానికి ఈ ఇమేజ్ అవసరమైంది. అయితే పుస్తకాలు చదివినంతమాత్రాన ప్రజలు స్వతంత్రులుగా మారరు. తమంతట తామే ప్రజలు స్వేచ్ఛ సాధించాలి. దీనికి కచ్చితంగా పుస్తకాలు సహాయపడతాయ’ని అమృత వివరించారు. క్లినికల్ సైకాలజిస్ట్ అయిన ఆమె పారెట్స్ ఆఫ్ డిజైర్, ఏ ప్లెజెంట్ కెండ్ ఆఫ్ హెవీ వంటి పుస్తకాలు రాశారు. భారతదేశ శృంగార చరిత్రపై పరిశోధన కూడా సాగించారు. మాధురి బెనర్జీ మాట్లాడుతూ.. ‘కామసూత్ర’ స్థాయిలో ‘తమిళ సంగం’ పుస్తకాలకు పేరు రావాల్సివుందని అభిప్రాయపడ్డారు. ఈ పుస్తకాల్లో భావోద్వేగాలు ఉంటాయని, కామసూత్రలో ఎటువంటి ఎమోషన్స్ ఉండవని చెప్పారు. శృంగార సాహిత్యంవైపు ఎందుకు మొగ్గుచూపారని ప్రశ్నించగా.. ‘నేను మానవ సంబంధాల గురించి మాట్లాడుతున్నాను. మహిళ కన్యత్వాన్ని కోల్పోతే సమాజం ఎలా స్పందిస్తుందనే దాని గురించి నా మొదటి పుస్తకంలో రాశాను. మన దేశంలో సెక్సువాలిటీ గురించి బహిరంగంగా మాట్లాడరు. నా పుస్తకం 2010లో విడుదలైంది. లైంగికత గురించి చర్చ జరగాలని ఈ పుస్తకం రాశాను. కానీ నా లక్ష్యం నెరవేరలేదు. నా పుస్తకాలు లైంగికత, శృంగారానికి పరిమితం కావు. మానవ సంబంధాలను లోతుగా చర్చిస్తాయి. శృంగార సాహిత్యాన్ని మన విద్యావ్యవస్థలో భాగం చేయాలి. లైంగికత గురించి గోప్యత పాటిస్తుండటంతో పిల్లలు ఇంటర్నెట్ను ఆశ్రయించి పెడతోవ పడుతున్నారు. లైంగికతపై పిల్లలకు సదావగాహన కల్పించి, వారి భావాలను స్వేచ్ఛగా వెల్లడించేలా చేయాల’ని చెప్పారు. మాధురి బెనర్జీ.. లాసింగ్ మై వర్జినిటీ, గాళ్స్ నైటవుట్, మై క్లింజీ గాళ్‌ఫ్రెండ్, అడ్వాంటేజ్ లవ్, ఫర్బిడెన్ డిజైర్స్ వంటి శృంగార సాహిత్య పుస్తకాలు రాశారు. (చదవండి: పోర్న్ ఎక్కువగా చూడటం వల్ల...) -
కథలు రాస్తున్న సన్నీలియోన్
బాలీవుడ్ హీరోయిన్గా మారిన సన్నీలియోన్, ఇప్పుడు మరో కొత్త అవతారంలో కనిపించనుంది. ఇప్పటివరకు నటిగా మాత్రమే అలరించిన ఈ బ్యూటీ త్వరలో రచయితగా ప్రూవ్ చేసుకోవడానికి రెడీ అవుతోంది. అయితే తన రచనల్లో కూడా తన మార్క్ ఉండేలా చూసుకుంటోంది సన్నీ. అందుకే తన ఇమేజ్‌కు తగ్గట్టుగా శృంగార కథలను అభిమానులకు అందించనుంది. స్వీట్ డ్రీమ్స్ పేరుతో తన కథలను రిలీజ్‌కు రెడీ చేస్తోంది ఈ బ్యూటీ. ఈ కథలను పుస్తకరూపంలోనే కాకుండా డైరెక్ట్‌గా మొబైల్ ఫోన్స్‌లో డౌన్ లోడ్ చేసుకునేలా ఢిల్లీలోని ఓ పబ్లిషింగ్ కంపెనీ ద్వారా రిలీజ్ చేస్తోంది. తనకు గతంలో రచనలు చేసిన అనుభవం లేకపోయినా తన కథలను పబ్లిష్ చేసేందుకు ముందుకొచ్చిన కంపెనీకి కృతజ్ఞతలు తెలియజేసింది. తన కథలు ఎక్కువగా మహిళల కోసం రాస్తున్నానని, మహిళలోని సున్నితత్వంతో పాటు, ఆమె నుంచి మగాడు ఏం కోరుకుంటాడన్న విషయాలను తన కథలలో తెలియజేస్తానంటోంది. ఇప్పటికే ఆన్లైన్ అతి ఎక్కువ సెర్చ్ చేస్తున్న పేరుగా రికార్డులు సృష్టిస్తున్న సన్నీలియోన్, ఈ కథలతో ఇంకెన్ని సంచలనాలు నమోదు చేస్తుందో..?