అవి అసలు పోర్న్‌ వీడియోలే కాదు: కుంద్రాకు మద్దతుగా నటి | Raj Kundra arrest Dont mix erotica with porn: Gehana Vasisth | Sakshi
Sakshi News home page

Raj Kundra: శృంగారాన్ని, అశ్లీలాన్ని కలపకండి!

Published Tue, Jul 20 2021 7:02 PM | Last Updated on Tue, Jul 20 2021 9:27 PM

Raj Kundra arrest Dont mix erotica with porn: Gehana Vasisth - Sakshi

సాక్షి,ముంబై: అశ్లీల చిత్రాల కేసులో అడ్డంగా బుక్కైన వ్యాపార వేత్త, నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్ర వ్యహారంపై వివాదాస్పద నటి మోడల్‌ గెహనా వశిష్ట్‌ (వందన తివారీ) స్పందించింది. తాము ఎలాంటి పోర్న్‌ వీడియోలు తయారు చేయలేదని వాదించింది. అవన్నీ నార్మల్‌ ఎరోటికా వీడియోలు మాత్రమేనని చెప్పుకొచ్చింది. కానీ కావాలనే కొంతమంది తమను టార్గెట్‌ చేశారని  ‘గంధీ బాత్‌’ ఫేమ్‌ గెహనా ఆరోపించింది.  

శృంగారానికి, అశ్లీలానికి మధ్య తేడాను గమనించాలంటూ ఒక వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది గెహనా. తానసలు పోర్న్‌ సినిమాల్లో నటించనే లేదని చెప్పు కొచ్చింది. తమ వీడియోల్లో ఒక్కటి కూడా పోర్న్‌ కేటగిరీ కిందకి రాదనిపేర్కొంది. అంతేకాదు ఏక్తాకపూర్‌ లాంటి వారు చేసే వీడియోల్లాంటివే తప్ప, అశ్లీలం ఎంతమాత్రం లేదంటూ కుంద్రాను వెనకేసు కొచ్చింది. ముందు తమ వీడియోలను చూసి, అపుడు అవి పోర్న్‌ అవునో కాదో తేల్చాలని మీ అందరినీ కోరుతున్నానని వ్యాఖ్యానించింది. ఎరోటికా కంటెంట్‌తో పోర్న్‌ను కలపడం సరైంది కాదంది. నిజానికి ఇంటర్నెట్‌లో హల్‌చల్‌ చేస్తున్న అసలైన పోర్న్‌ వీడియోలపై దృష్గి పెట్టాలని ఆమె కోరింది.

అయితే ఈ విషయంలో చట్టం తన పని తాను చేసుకుంటుందని, ప్రపంచంలోనే అత్యుత్తమ పోలీసులుగా పేరున్న ముంబై పోలీసులపై తమకు పూర్తి విశ్వాసం ఉందని పేర్కొంది. నిజమైన నేరస్థు లెవరో, కోర్టులు తేలుస్తాయని, న్యాయం జరుగుతుందనే నమ్మకం తమకుందని తెలిపింది.  కావాలనే తనను, శిల్పాశెట్టి, కుంద్రాను టార్గెట్‌ చేస్తున్నారని గెహనా వశిష్ట్‌ ఆరోపించింది.

రాజ్ కుంద్రా మాజీ పీఏ ఉమేష్ కామత్ భారతదేశంలోని కెన్రిన్ ప్రొడక్షన్ హౌస్ ప్రతినిధిగా పనిచేశారని, ఈ సమయంలో ఈ సంస్థ ద్వారా  పోర్న్ ఫిల్మ్‌ల కోసం చాలా మంది ఏజెంట్లకు కాంట్రాక్టులు ఇచ్చి నిధులు సమకూర్చుకున్నట్టు సమాచారం. ఇలా ఒప్పందాలు చేసుకున్న వారిలో గెహానా వశిష్ట్ కూడా ఉన్నారని తెలుస్తోంది. కాగా ముంబై క్రైం బ్రాంచ్‌ పోలీసులు కుంద్రాను సోమవారం అర్థరాత్రి అరెస్ట్‌ చేయడం కలకలం రేపింది.  కుంద్రాతోపాటు, ర్యాన్ థార్ప్‌ను కూడా మంగళవారం కోర్టుముందు హాజరు పర్చిన పోలీసులు జూలై 23 వరకు పోలీసు కస్టడీకి  తరలించిన సంగతి తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement