Gehana Vasisth
-
చదువు, క్రీడల్లోనూ టాప్.. ఒకానొక సమయంలో హీరోయిన్ ఆత్మహత్యాయత్నం!
ఓపక్క హీరోయిన్గా చేస్తూ మరోపక్క ఐటం సాంగ్స్ చేస్తుండటం ఇప్పుడు వచ్చిన ట్రెండ్ అనుకుంటున్నారు. కానీ, ఈ ట్రెండ్ ఎప్పుడో మొదలుపెట్టింది గెహానా వశిష్ట్. ఫిల్మీ దునియా సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ తెలుగులో పలు చిత్రాల్లో ఐటం సాంగ్స్‌లో మెరిసింది. అలా అని కేవలం ఐటం సాంగ్స్‌కే పరిమితం కాలేదు. ఒకటి హీరోయిన్గా చేస్తూ మరొకదాంట్లో ఐటం సాంగ్‌లో నటిస్తూ తన కెరీర్‌ను వెరైటీగా బ్యాలెన్స్ చేసుకుంటూ పోయింది. సినిమాల్లోకి రావడానికి ముందు దాదాపు 80కి పైగా యాడ్స్‌లో నటించింది. తన సినీ జర్నీ ఎలా మొదలైందో ఈ కథనంలో చదివేద్దాం.. చదువు, క్రీడల్లోనూ ముందంజ గెహానా స్వస్థలం ఛత్తీస్‌ఘడ్. ఆమె అసలు పేరు వందన తివారి. ఆమె తండ్రి బొగ్గు గనిలో పనిచేసే అధికారి. తల్లి ఎంబీబీఎస్ డాక్టర్. తాతయ్య(అమ్మ వాళ్ల తండ్రి) రాణి దుర్గావతి యూనివర్సిటీ ప్రిన్సిపాల్. నానమ్మ ఓ కాన్వెంట్ స్కూల్లో ప్రిన్సిపాల్.. ఇలా ఇంట్లో అందరూ విద్యాధికులే! తనను కూడా కంప్యూటర్ సైన్స్‌లో పట్టా అందుకునేవరకు చదివించారు. అయితే గెహానా చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించేది. వాలీబాల్‌లో ఆమె జాతీయస్థాయిలో సత్తా చాటింది. రోబోటిక్స్‌లో ఆమె గోల్డ్ మెడల్ సాధించింది. ఐఐటీలో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ పరీక్షలో ఆలిండియా లెవల్లో 163వ ర్యాంకు కైవసం చేసుకుంది. ఇదే కాకుండా ఎన్సీసీ, స్కౌట్స్లోనూ చురుకుగా పాల్గొనేది. మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం అయితే తన విద్యాభ్యాసం అంత ఈజీగా సాగలేదు. చాలామంది కుటుంబాల్లాగే గెహానా ఇంట్లో కూడా అబ్బాయిలకే పెద్ద పీట వేసేవారట. తనకు చదువుకోవాలని ఉన్నప్పటికీ అమ్మాయికి చదువెందుకని తాతయ్య ఒప్పుకోలేదట. ఐఐటీ కౌన్సెలింగ్‌కు కూడా పంపించలేదట! దీంతో మనస్తాపం చెందిన గెహానా ఓ తాడు తీసుకుని ఉరేసుకునేందుకు ప్రయత్నించింది. ఇది చూసిన ఆమె తల్లి వెంటనే అందరినీ పిలవడంతో గది తలుపులు బద్ధలు కొట్టి ఆమెను రక్షించారు. తనకు చదువుకోవాలని ఉందని కన్నీళ్లు పెట్టడంతో ఆమె కుటుంబం తనను ఐఐటీ చేసేందుకు అనుమతించింది. అలా భోపాల్‌లో ఇంజనీరింగ్ పూర్తి చేసింది. ఈ విషయాన్ని గెహానా స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. తెలుగు సినిమాల్లో హీరోయిన్గా అయితే చదువుకునే సమయంలో ఆర్థిక అవసరాల కోసం కుటుంబంపై ఆధారపడకూడదని నిర్ణయించుకుంది గెహానా. అలా మోడలింగ్ మొదలుపెట్టింది. వరుసగా యాడ్స్ చేస్తున్న సమయంలో వెండితెర రారమ్మని పిలిచింది. దీంతో తెలుగులో అనుకున్నది ఒక్కటి అయ్యింది ఒక్కటి, నమస్తే, ఐదు 5, బీటెక్ లవ్ స్టోరీ సినిమాల్లో హీరోయిన్గా చేసింది. కొన్ని చిత్రాల్లో ఐటం సాంగ్స్‌లోనూ ఆడిపాడింది. అయినా తను కోరుకున్నంత గుర్తింపు అయితే లభించలేదు. గంధీ బాత్ సిరీస్‌లో బోల్డ్‌గా ఓటీటీలు నెమ్మదిగా తమ సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్న సమయంలో గెహానా బోల్డ్ సిరీస్‌లో నటించింది. గంధీ బాత్ అనే వెబ్ సిరీస్‌లో బోల్డ్ లుక్స్‌లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. నిజానికి ఈ సిరీస్ చేయాలని గెహానా కూడా అనుకోలేదు. అయితే ఈ సిరీస్‌ను తిరస్కరిస్తే ఇక ముందు ఆల్ట్ బాలాజీ వాళ్లు చేసే ఏ షో, సిరీస్‌లో కూడా ఛాన్స్ దక్కదు అని వార్నింగ్ ఇవ్వడంతో చేసేదేం లేక అంగీకరించింది. ఆ సిరీస్ బాగా క్లిక్ అవ్వడంతో తనకు తర్వాత కూడా బోల్డ్ పాత్రలే రాసాగాయి. View this post on Instagram A post shared by Er Gehana Vasisth (@gehana_vasisth) చదవండి: 87 ఏళ్ల వయసులో లిప్ లాక్.. రొమాన్స్‌కు వయసుతో పనేంటన్న నటుడు -
షెర్లిన్ వల్లే రాజ్‌కుంద్రాకు ఈ గతి పట్టింది: నటి సంచలన వ్యాఖ్యలు
నీలి చిత్రాల కేసులో శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రాతో సంబంధాలు కలిగి ఉన్నారని నటి గెహనా వశిష్ట్ అరెస్టు అయ్యింది. 133 రోజులు కస్డడీలో ఉన్న అనంతరం ఆమెకు కోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా శిల్పా దంపతులకు సపోర్టు చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది గెహనా. మీడియా దృష్టిని ఆకర్షించి, నిత్యం వార్తల్లో నిలిచేందుకే షెర్లిన్ చోప్రా, శిల్పా శెట్టి దంపతుల పరువు భంగం కలిగేలా మాట్లాడుతుందని ఓ ఇంటర్వ్యూలో గెహనా విమర్శించింది. అసలు బిజినెస్మెన్ రాజ్‌కుంద్రాను నీలి చిత్రాల తీసేలా పురికొల్పింది షెర్లినే అని నటి ఆరోపించింది. కుంద్రా జైలు నుంచి వచ్చాక ఆమెను అందరూ మర్చిపోయారని గుర్తించి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నట్లు మండిపడింది. గెహనా ఇంకా మాట్లాడుతూ.. ‘ షెర్లిన్ చోప్రా కోట్లాది రూపాయలు ఆర్జించేందుకు రాజ్ కుంద్రా ఎంతో సాయపడ్డాడు. ఆయన క్రియేట్ చేసిన ఆర్మ్స్ప్రైమ్ యాప్ ద్వారా ఈ స్థాయికి వచ్చిన ఆమె కుంద్రాకి రుణపడి ఉండాలి. ఆమె వల్లే ఆయన ఈ ఊబిలో ఇరుక్కుపోయారు. నిజానికి 2012 నుంచే షెర్లిన్ బోల్డ్ కంటెంట్ చిత్రాలు చేస్తోంది. వారిద్దరూ పరిచయమై కేవలం రెండున్నరేళ్లు మాత్రమే’ అని చెప్పింది. కాగా ఈ కేసులో అరెస్టయిన రాజ్‌కుంద్రాకి ఇటీవలే ముంబై కోర్టు బెయిలు మంజూరు చేసింది. చదవండి: పోర్నోగ్రఫీ కేసు.. నటి ఆవేదన -
పోర్నోగ్రఫీ కేసు.. నటి ఆవేదన
Gehana Vasisth Cries: పోర్నోగ్రఫీ వ్యవహారానికి సంబంధించిన కేసులో నటి గెహనా వశిష్ట్‌కు భారీ ఊరట లభించింది. బాలీవుడ్ ఫైనాన్షియర్ రాజ్‌కుంద్రాతో సత్సంబంధాలు కలిగి ఉండడం, అశ్లీల చిత్రాల్లో నటిస్తూ పట్టుబడడం లాంటి ఆరోపణలున్న గెహానా.. గతంలో అరెస్ట్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆమె 133 రోజులుగా కస్టడీలో ఉండగా.. ఎట్టకేలకు కోర్టు బెయిల్ జారీ చేసింది. అయితే ఈ వ్యవహారంలో దర్యాప్తునకు హాజరు కావాలనే షరతు విధిస్తూ.. జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ బీఆర్ గవాయ్‌ల ధర్మాసనం బుధవారం వెల్లడించింది. చదవండి: Shilpa Shetty: నేను షూటింగ్స్‌తో బిజీ..ఆ యాప్స్ గురించి నాకు తెలియదు సుప్రీం కోర్టు ఇచ్చిన బెయిల్‌పై నటి గెహనా ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించారు. ‘సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ నాకు మంజూరు చేసింది. విచారణకు హాజరు కావాలని పేర్కొంది. సత్యమే జయిస్తుందని మొదటి నుంచి నేను చెప్తున్నా. నన్ను నమ్మండి.. నన్ను ఎవరూ తప్పదోవ పట్టించలేదు. డబ్బుల కోసం ఎవరినీ మోసం చేయలేదు. కావాలనే నన్ను కొందరు ఈ కేసులో ఇరికించారు’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. చదవండి: శృంగారానికి, అశ్లీలానికి తేడా తెలుసా?: నటి గతంలో ఆమె బాంబే హైకోర్టులో బెయిల్‌కు దరఖాస్తు చేసుకోగా, కోర్టు దాన్ని తిరస్కరించింది. దాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేయగా, ఇప్పుడు ఆమెకు అనుకూలంగా తీర్పు వచ్చింది. పిటిషనర్‌ను అరెస్టు చేయరాదని, అయితే విచారణకు సహకరించాలని కోర్టు ఆమెను ఆదేశించింది. ఇక పోర్నోగ్రఫీ కేసులో అరెస్టయిన ప్రధాన నిందితుడు, ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రా కు మొన్న సోమవారం బెయిల్ లభించిన విషయం తెలిసిందే. -
పోర్నోగ్రఫీ కేసు: నటి గెహానా వశిష్ట్‌కు హైకోర్టులో చుక్కెదురు
ముంబై: పోర్న్ కేసుకు సంబంధించి నటి గెహానా వశిష్ట్‌కు బాంబే హైకోర్టు మంగళవారం ముందస్తు బెయిల్ నిరాకరించింది. భయపెట్టి, డబ్బు ఎర చూపించి అశ్లీల చిత్రాలలో నటించేలా చేశారని గెహానాపై అభియోగాలున్నాయి. ఈ నేపథ్యంలో తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ జారీ చేయాలని ఆమె గత నెలలో కోర్టును ఆశ్రయించారు. తాజాగా ఆ పిటిషన్ విచారణకు రాగా, జస్టిస్ ఎస్కే షిండే ఆమెకు బెయిల్ నిరాకరించారు. కొందరు యువతులను బలవంతంగా అశ్లీల చిత్రాల్లో నటింపజేసి ఆ వీడియోలను రాజ్ కుంద్రాకు చెందిన హాట్‌షాట్ యాప్‌లో గెహానా ఉంచారని అభియోగాలు ఉన్నాయి. (చదవండి: షాకింగ్.. నటిని బంధించి రూ.6 లక్షలు దోచుకెళ్లారు!) -
రాజ్ కుంద్రా కేసు: అభిమానులకు షాకిచ్చిన బాలీవుడ్ నటి
Gehana Vasisth Shocking Video: రాజ్‌కుంద్రా పోర్నోగ్రఫీ రాకెట్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటి గెహనా వశిష్ట్ మరోసారి వార్తల్లోకెక్కింది. తాజాగా ఒంటిపై నూలుపోగు లేకుండా లైవ్‌లోకి వచ్చి అభిమానులకు షాకిచ్చింది. అయితే దీని వెనకాల ఓ కారణముందట! కేవలం బట్టలు లేకుండా ఉండటం వల్ల అందంగా లేదా అసభ్యంగా ఉందో తెలుసుకోవాలనుకుందట! ఇక లైవ్‌లో గెహనా మాట్లాడుతూ.. 'బట్టలు లేకుండా నగ్నంగా ఉన్నాను, ఇప్పుడెలా ఉన్నానో చెప్పండి?, అందంగా ఉన్నానా? అసభ్యంగా అనిపిస్తోందా? అశ్లీలంగా ఉందా?' అంటూ ఫ్యాన్స్‌ను అడిగింది. ఇక ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. 'బట్టలు లేకుండా లైవ్‌లోకి వచ్చాను, కానీ ఏ ఒక్కరూ ఇది పోర్న్ అని చెప్పడం లేదు. పైగా నేను బట్టలు వేసుకున్న సందర్భాల్లోనే కొందరు దాన్ని అశ్లీలం అంటున్నారు. మరీ ఇంత కపటధారుల్లాగా ప్రవర్తించడానికి కూడా ఓ హద్దు ఉంటుంది' అని క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్ అయిన గెహనా తాను నార్మల్ ఎరోటికా వీడియోలు మాత్రమే చేశానని, పోర్న్ చిత్రాల్లో నటించలేదని చెప్పుకొచ్చింది. అంతేకాక శృంగారానికి, అశ్లీలానికి మధ్య తేడాను గమనించాలంటూ గతంలో ఒక వీడియోను సైతం సోషల్ మీడియాలో షేర్ చేసిన విషయం తెలిసిందే. ఇకపోర్నోగ్రఫీ కేసులో రాజ్‌కుంద్రాకు ఆమె మొదటి నుంచీ మద్దతిస్తోంది. View this post on Instagram A post shared by Gehana Vasisth (@gehana_vasisth) -
‘అరెస్ట్ కాకుండా మీకెంత కావాలి? పోలీసులకు హీరోయిన్ ఆఫర్
ముంబై: ఈ ఏడాది ప్రారంభం నుంచి బాలీవుడ్‌ను పలు కేసులు, వివాదాలు చుట్టుముట్టాయి. రాజ్‌కుంద్రా పోర్నోగ్రఫీ రాకెట్ కేసు బాలీవుడ్‌ను షేక్ చేస్తోంది. బాలీవుడ్ అగ్రనటి శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రా అశ్లీల వెబ్‌సిరీస్, సినిమాలు తీశారనే ఆరోపణలతో అరెస్టయిన విషయం తెలిసిందే. ఈ కేసులతో మరికొందరికి సంబంధాలు ఉన్నాయనే వార్తలు బాలీవుడ్‌ను షేక్ చేస్తోంది. అయితే ఈ రాకెట్ ఆనవాళ్లు ఈ ఏడాది ప్రారంభం నుంచే ఉన్నాయి. పోర్నోగ్రఫీ కేసు విషయంలో ఓ హీరోయిన్ పోలీసులకు లంచం ఇవ్వజూపారనే వార్త తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో పోర్నోగ్రఫీ కేసులో హీరోయిన్ గెహన వశిష్ట్ అరెస్ట్ అయ్యారు. అయితే ఈ అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు పోలీసులకు రూ.15 లక్షలు లంచంగా ఇచ్చేందుకు సిద్ధమైందని తెలిసింది. ఆమెను అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులతో ‘నన్ను అరెస్ట్ చేయకుండా ఉండేందుకు మీకెంత కావాల్నో చెప్పండి’ అని పోలీసులకే ఆఫర్ ఇచ్చారని ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఇక చివరగా రూ.15 లక్షలు ఇస్తాను అని గెహన పోలీసులతో ఒప్పందం కుదుర్చుకుందని దర్యాప్తులో తేలింది. అయితే లంచం పోలీసులే డిమాండ్ చేశారని గెహన ఆరోపిస్తోంది. ఈ కేసు విషయంలోనూ ఇద్దరితో వాట్సప్ చాటింగ్ చేసినట్లు గుర్తించారు. వారే యశ్ ఠాకూర్ అలియాస్ అర్వింద్ కుమార్ శ్రీవాస్తవ, తన్వీర్ హష్మీ. వీరితో ఈ కేసు విషయమై చాటింగ్ చేసింది. పోలీసులు లంచం అడగడంతో వారిద్దరూ కలిపి రూ.8 లక్షల వరకు సమకూర్చగలరని ఆ చాటింగ్‌లో ఉంది. గెహనా నటించిన మూడు అశ్లీల వీడియోలు బయటకు వచ్చాయి. ఈ వీడియోలతో రాజ్‌కుంద్రాకు చెందిన కంపెనీలో ఉన్న వ్యాపారవేత్త కాస్త నిర్మాతగా మారిన వ్యక్తికి సంబంధం ఉంది. -
అవి అసలు పోర్న్ వీడియోలే కాదు: కుంద్రాకు మద్దతుగా నటి
సాక్షి,ముంబై: అశ్లీల చిత్రాల కేసులో అడ్డంగా బుక్కైన వ్యాపార వేత్త, నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్ర వ్యహారంపై వివాదాస్పద నటి మోడల్ గెహనా వశిష్ట్ (వందన తివారీ) స్పందించింది. తాము ఎలాంటి పోర్న్ వీడియోలు తయారు చేయలేదని వాదించింది. అవన్నీ నార్మల్ ఎరోటికా వీడియోలు మాత్రమేనని చెప్పుకొచ్చింది. కానీ కావాలనే కొంతమంది తమను టార్గెట్ చేశారని ‘గంధీ బాత్’ ఫేమ్ గెహనా ఆరోపించింది. శృంగారానికి, అశ్లీలానికి మధ్య తేడాను గమనించాలంటూ ఒక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది గెహనా. తానసలు పోర్న్ సినిమాల్లో నటించనే లేదని చెప్పు కొచ్చింది. తమ వీడియోల్లో ఒక్కటి కూడా పోర్న్ కేటగిరీ కిందకి రాదనిపేర్కొంది. అంతేకాదు ఏక్తాకపూర్ లాంటి వారు చేసే వీడియోల్లాంటివే తప్ప, అశ్లీలం ఎంతమాత్రం లేదంటూ కుంద్రాను వెనకేసు కొచ్చింది. ముందు తమ వీడియోలను చూసి, అపుడు అవి పోర్న్ అవునో కాదో తేల్చాలని మీ అందరినీ కోరుతున్నానని వ్యాఖ్యానించింది. ఎరోటికా కంటెంట్‌తో పోర్న్‌ను కలపడం సరైంది కాదంది. నిజానికి ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్న అసలైన పోర్న్ వీడియోలపై దృష్గి పెట్టాలని ఆమె కోరింది. అయితే ఈ విషయంలో చట్టం తన పని తాను చేసుకుంటుందని, ప్రపంచంలోనే అత్యుత్తమ పోలీసులుగా పేరున్న ముంబై పోలీసులపై తమకు పూర్తి విశ్వాసం ఉందని పేర్కొంది. నిజమైన నేరస్థు లెవరో, కోర్టులు తేలుస్తాయని, న్యాయం జరుగుతుందనే నమ్మకం తమకుందని తెలిపింది. కావాలనే తనను, శిల్పాశెట్టి, కుంద్రాను టార్గెట్ చేస్తున్నారని గెహనా వశిష్ట్ ఆరోపించింది. రాజ్ కుంద్రా మాజీ పీఏ ఉమేష్ కామత్ భారతదేశంలోని కెన్రిన్ ప్రొడక్షన్ హౌస్ ప్రతినిధిగా పనిచేశారని, ఈ సమయంలో ఈ సంస్థ ద్వారా పోర్న్ ఫిల్మ్‌ల కోసం చాలా మంది ఏజెంట్లకు కాంట్రాక్టులు ఇచ్చి నిధులు సమకూర్చుకున్నట్టు సమాచారం. ఇలా ఒప్పందాలు చేసుకున్న వారిలో గెహానా వశిష్ట్ కూడా ఉన్నారని తెలుస్తోంది. కాగా ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు కుంద్రాను సోమవారం అర్థరాత్రి అరెస్ట్ చేయడం కలకలం రేపింది. కుంద్రాతోపాటు, ర్యాన్ థార్ప్‌ను కూడా మంగళవారం కోర్టుముందు హాజరు పర్చిన పోలీసులు జూలై 23 వరకు పోలీసు కస్టడీకి తరలించిన సంగతి తెలిసిందే. -
నటికి గుండెపోటు.. విషమంగా ఆరోగ్యం
ముంబై : ప్రముఖ మోడల్, నటి గెహానా వశిష్ట(31) తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నారు. గురువారం ఆమెకు గుండెపోటు రావడంతో ముంబైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ఓ వెబ్ సిరీస్ కోసం విశ్రాంతి లేకుండా షూటింగ్ చేసే సమయంలో బీపీ తగ్గి.. హార్ట్ఎటాక్ వచ్చినట్లు గెహానా సన్నిహితులు తెలిపారు. తిండిలేకుండా కేవలం డ్రింక్స్ తీసుకుంటూ షూటింగ్ చేయడంతో ఈ పరిస్థితి తలెత్తిందని పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ విషయం గురించి డాక్టర్ ప్రణవ్ మాట్లాడుతూ... గెహానాను వెంటిలేటర్ మీద ఉంచి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆస్పత్రికి తీసుకువచ్చే సమయానికే తన పరిస్థితి విషమంగా ఉందని.. నాడీ కొట్టుకోవడం కూడా ఆగిపోయిందని తెలిపారు. అనంతరం ఎలక్ట్రిక్ షాక్ ఇవ్వడం ద్వారా గుండె కొట్టుకునేలా చేశామన్నారు. ఇక ప్రస్తుతం తనకు శ్వాస తీసుకోవడం కూడా ఇబ్బందిగా ఉందని.. గెహానాను బతికించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నామని తెలిపారు. గెహానాకు షుగర్ ఉందని... 48 గంటల పాటు ఆహారం తీసుకోకుండా ఉన్నందువల్లే ఆరోగ్యం విషమించిందని పేర్కొన్నారు. కాగా వందనా తివారీ గెహానా వశిష్ట అనే స్క్రీన్ నేమ్‌తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. మోడల్, టీవీ ప్రజెంటర్, నటిగా గుర్తింపు పొందారు. తొలుత సీరియళ్లలో కనిపించిన గెహానా.. హిందీ, తమిళ, తెలుగు సినిమాల్లో కూడా నటించారు. ఆపరేషన్ దుర్యోదన వంటి సినిమాల్లో ఐటం సాంగ్స్‌లో నర్తించిన ఆమె... ప్రేమించు పెళ్లాడు, నమస్తే, ఐదు, బీటెక్ లవ్ స్టోరీ వంటి చిన్న సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు. ఇక గెహానా ఆరోగ్య పరిస్థితిపై ఆమె అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆమెకు సంబంధించిన వార్తలు ట్విటర్లో ట్రెండ్ అవుతున్నాయి. -
సంచలన వ్యాఖ్యలు.. కోటి రూపాయలకు దావా
సాక్షి, సినిమా : నటి, మోడల్ గెహానా వశిష్ఠ్ మరో మోడల్, బిగ్ బాస్ కంటెస్టెంట్ ఆర్షి ఖాన్‌పై సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ఆర్షి ఖాన్ వ్యక్తిగత విషయాల ప్రస్తావన, ఆమె అబద్ధాల కొరంటూ గెహానా ఇచ్చిన ఇంటర్వ్యూలు ఆమెకు బోలెడంత పబ్లిసిటీ తెచ్చిపెట్టాయి. అయితే వాటికి అదనంగా ఇప్పుడు ఆమెకు సమస్యలు కూడా వచ్చి పడుతున్నాయి. ఆమెపై ఆర్షి ఖాన్ కోటి రూపాయల పరువు నష్టం దావా వేసింది. ఈ విషయాన్ని ఆర్షి వ్యక్తిగత ప్రచారకుడు ఫ్లైన్న్ రెమెడివోస్ మీడియాకు వెల్లడించారు. ‘‘గెహానా పలు మీడియా ఛానెళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలు, అందులో ఆమె ఆర్షి ఖాన్ పై చేసిన వ్యాఖ్యలను పరిశీలించాం. అందులో ప్రకటనలు పూర్తిగా అర్షి ఖాన్ వ్యక్తిగత జీవితానికి సంబంధించినవిగా ఉన్నాయి. బిగ్ బాస్ లో ఆర్షి ఇప్పుడు పాల్గొంటోంది. అలాంటప్పుడు దేశం మొత్తం ఆమెను పరిశీలిస్తుంటారు. ఈ దశలో గెహానా వ్యాఖ్యలు నా క్లైంట్(ఆర్షి ఖాన్) జీవితంపై ప్రభావం చూపుతాయి. అందుకే కేసు వేయించాం‘‘ అని ఫ్లైన్న్ తెలిపాడు. కాగా, బిగ్‌బాస్ 11వ సీజన్లో పోటీ పడుతున్న ఆర్షి ఖాన్ సమర్పించిన వ్యక్తిగత వివరాలన్నీ అబద్ధమని, 50 ఏళ్ల వ్యక్తిని వివాహం చేసుకుందని.. ఆమెపై పది క్రిమినల్ కేసులు ఉన్నాయని.. పాక్ క్రికెటర్‌తో ఆమె డేటింగ్ చేసిన విషయం పచ్చి అబద్ధమని గెహానా వశిష్ఠ్ పలు ఇంటర్వ్యూలలో సంచలన వ్యాఖ్యలే చేసింది. -
‘ఆమెకు పెళ్లైంది.. పది కేసులు ఉన్నాయ్’
ముంబై: హిందీ బిగ్‌బాస్ రియాలిటీ షో 11వ సీజన్లో పోటీ పడుతున్న మోడల్, నటి ఆర్షి ఖాన్‌కు సంబంధించిన సంచలన విషయాలు వెల్లడయ్యాయి. బిగ్‌బాస్ షోలో పాల్గొనేందుకు ఆర్షి ఖాన్ సమర్పించిన వ్యక్తిగత వివరాలన్నీ తప్పు అని మరో నటి, మోడల్ గెహానా వశిష్ఠ్ ఒక వార్తా సంస్థతో చెప్పింది. వయసు, విద్యార్హతలు, పాకిస్తాన్ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిదితో రిలేషన్షిప్ గురించి ఆమె చెప్పినవన్నీ శుద్ధ అబద్ధాలని ప్రకటించింది. అంతేకాదు 50 ఏళ్ల వ్యక్తిని ఆర్షి ఖాన్ పెళ్లి చేసుకుందని బాంబు పేల్చింది. ‘ఆర్షి ఖాన్ స్వస్థలమైన భోపాల్ నుంచే నేను వచ్చాను. ఆర్షి ఖాన్ చెప్పినట్టుగా ఆమె 27 ఏళ్లు కాదు. ఆమెకిప్పుడు 32 ఏళ్లు. తన వయసును ఐదేళ్లు తగ్గించి చెప్పింది. స్కూల్ డే నుంచి ఆమె నాకు తెలుసు కాబట్టే ఇంత కచ్చితంగా చెప్పగలుతున్నా. బిగ్‌బాస్ 11లో పాల్గొనేందుకు తన విద్యార్హతలకు సంబంధించిన వివరాలు కూడా తప్పుగా చూపించింది. దీనికి సంబంధించిన ఆధారాలు నేను చూపించగలను. నోరు విప్పితే అబద్దాలాడే ఆర్షి ఖాన్‌ను బిగ్‌బాస్‌కు ఎంపిక చేయడం నాకు ఆశ్చర్యం కలిగించింద’ని గెహానా పేర్కొంది. ఆఫ్రిదితో తనకు లైంగిక సంబంధం ఉందని ఆర్షి ఖాన్ గతంలో చేసిన వ్యాఖ్యలపై గెహానా స్పందిస్తూ... పాక్ క్రికెటర్ ఆఫ్రిదిని ఆమె ఎప్పుడూ ముఖాముఖి కలవలేదని, కనీసం ఫోన్లో కూడా మాట్లాడలేదని వెల్లడించింది. ఆర్షి ఖాన్‌పై 10 క్రిమినల్ కేసులు ఎదుర్కొంటోందని.. భారత్, పాకిస్తాన్ జెండాలను అవమానించిన కేసులు కూడా ఇందులో ఉన్నాయని తెలిపింది. ఇప్పటికే జుబైర్ ఖాన్ వివాదం బిగ్‌బాస్‌లో సంచలనంగా మారింది. అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం సోదరి హసీనా పార్కర్ కూతురిన పెళ్లాడిన జుబైర్ ఈ విషయాన్ని దాచిపెట్టి బిగ్‌బాస్ అవకాశాన్ని దక్కించుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి.