సంచలన వ్యాఖ్యలు.. కోటి రూపాయలకు దావా | arshi Khan Sued Gehana Vasisth for defamatory comments | Sakshi
Sakshi News home page

సంచలన వ్యాఖ్యలు.. కోటి రూపాయలకు దావా

Published Sun, Nov 5 2017 9:16 AM | Last Updated on Sun, Nov 5 2017 9:17 AM

arshi Khan Sued Gehana Vasisth for defamatory comments - Sakshi

సాక్షి, సినిమా : నటి, మోడల్‌ గెహానా వశిష్ఠ్‌ మరో మోడల్, బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్‌ ఆర్షి ఖాన్‌పై సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ఆర్షి ఖాన్‌ వ్యక్తిగత విషయాల ప్రస్తావన, ఆమె అబద్ధాల కొరంటూ గెహానా ఇచ్చిన ఇంటర్వ్యూలు ఆమెకు బోలెడంత పబ్లిసిటీ తెచ్చిపెట్టాయి. అయితే వాటికి అదనంగా ఇప్పుడు ఆమెకు సమస్యలు కూడా వచ్చి పడుతున్నాయి.

ఆమెపై ఆర్షి ఖాన్‌ కోటి రూపాయల పరువు నష్టం దావా వేసింది. ఈ విషయాన్ని ఆర్షి వ్యక్తిగత ప్రచారకుడు ఫ్లైన్న్‌ రెమెడివోస్‌ మీడియాకు వెల్లడించారు. ‘‘గెహానా పలు మీడియా ఛానెళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలు, అందులో ఆమె ఆర్షి ఖాన్‌ పై చేసిన వ్యాఖ్యలను పరిశీలించాం. అందులో ప్రకటనలు పూర్తిగా అర్షి ఖాన్‌ వ్యక్తిగత జీవితానికి సంబంధించినవిగా ఉన్నాయి. బిగ్‌ బాస్‌ లో ఆర్షి ఇప్పుడు పాల్గొంటోంది. అలాంటప్పుడు దేశం మొత్తం ఆమెను పరిశీలిస్తుంటారు. ఈ దశలో గెహానా వ్యాఖ్యలు నా క్లైంట్‌(ఆర్షి ఖాన్) జీవితంపై ప్రభావం చూపుతాయి. అందుకే కేసు వేయించాం‘‘ అని ఫ్లైన్న్‌ తెలిపాడు. 

కాగా, బిగ్‌బాస్‌ 11వ సీజన్‌లో పోటీ పడుతున్న ఆర్షి ఖాన్‌ సమర్పించిన వ్యక్తిగత వివరాలన్నీ అబద్ధమని, 50 ఏళ్ల వ్యక్తిని వివాహం చేసుకుందని.. ఆమెపై పది క్రిమినల్‌ కేసులు ఉన్నాయని.. పాక్‌ క్రికెటర్‌తో ఆమె డేటింగ్ చేసిన విషయం పచ్చి అబద్ధమని గెహానా వశిష్ఠ్‌ పలు ఇంటర్వ్యూలలో సంచలన వ్యాఖ్యలే చేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement