Gehana Vasisth: అభిమానులకు షాకిచ్చిన బాలీవుడ్‌ నటి | Raj Kundra Case - Sakshi
Sakshi News home page

Raj Kundra Case: అభిమానులకు షాకిచ్చిన బాలీవుడ్‌ నటి

Published Tue, Aug 3 2021 11:45 AM | Last Updated on Tue, Aug 3 2021 1:39 PM

Gehana Vasisth Live Without Clothes, Share Video - Sakshi

Gehana Vasisth Shocking Video: రాజ్‌కుంద్రా పోర్నోగ్రఫీ రాకెట్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్‌ నటి గెహనా వశిష్ట్‌ మరోసారి వార్తల్లోకెక్కింది. తాజాగా ఒంటిపై నూలుపోగు లేకుండా లైవ్‌లోకి వచ్చి అభిమానులకు షాకిచ్చింది. అయితే దీని వెనకాల ఓ కారణముందట! కేవలం బట్టలు లేకుండా ఉండటం వల్ల అందంగా లేదా అసభ్యంగా ఉందో తెలుసుకోవాలనుకుందట!

ఇక లైవ్‌లో గెహనా మాట్లాడుతూ.. 'బట్టలు లేకుండా నగ్నంగా ఉన్నాను, ఇప్పుడెలా ఉన్నానో చెప్పండి?, అందంగా ఉన్నానా? అసభ్యంగా అనిపిస్తోందా? అశ్లీలంగా ఉందా?' అంటూ ఫ్యాన్స్‌ను అడిగింది. ఇక ఈ వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ.. 'బట్టలు లేకుండా లైవ్‌లోకి వచ్చాను, కానీ ఏ ఒక్కరూ ఇది పోర్న్‌ అని చెప్పడం లేదు. పైగా నేను బట్టలు వేసుకున్న సందర్భాల్లోనే కొందరు దాన్ని అశ్లీలం అంటున్నారు. మరీ ఇంత కపటధారుల్లాగా ప్రవర్తించడానికి కూడా ఓ హద్దు ఉంటుంది' అని క్యాప్షన్‌ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో సెన్సేషన్‌గా మారింది.

కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్‌ అయిన గెహనా తాను నార్మల్‌ ఎరోటికా వీడియోలు మాత్రమే చేశానని, పోర్న్‌ చిత్రాల్లో నటించలేదని చెప్పుకొచ్చింది. అంతేకాక శృంగారానికి, అశ్లీలానికి మధ్య తేడాను గమనించాలంటూ గతంలో ఒక వీడియోను సైతం సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన విషయం తెలిసిందే. ఇక​పోర్నోగ్రఫీ కేసులో రాజ్‌కుంద్రాకు ఆమె మొదటి నుంచీ మద్దతిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement