కన్నాంఘడ్: కేరళలో సీనియర్ సీపీఐ కార్యకర్తను హత్య చేశారు. ఆయన సోదరుడిని తీవ్రంగా గాయపరిచారు. కాసర్ఘోడ్ జిల్లాలోని కాయకున్ను వద్ద శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఆరెస్సెస్, బీజేపీ కార్యకర్తలే ఈ పనిచేసి ఉంటారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసు బలగాలు ఆ చుట్టూపక్కల నిషేదాజ్ఞలు జారీ చేశారు.
దాదాపు 20 ఏళ్లకు పైగా నారాయణన్(45) అనే వ్యక్తి సీపీఎంలో పనిచేస్తుండగా అతడి సోదరుడు అరవిందాన్ కూడా ఆయనతో కలిసిపనిచేస్తున్నాడు. వారిద్దరిపై ఒకేసారి ఓ గ్రూపు దాడికి దిగింది. పదునైన ఆయుధాలతో విచక్షణా రహితంగా దాడి చేసింది. దీంతో నారాయణన్ అక్కడికక్కడే మృతిచెందగా అరవిందన్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా, తమపై వచ్చిన ఆరోపణలను బీజేపీ, ఆరెస్సెస్ శ్రేణులు కొట్టిపారేశాయి.
సీపీఎం సీనియర్ కార్యకర్త హత్య
Published Fri, Aug 28 2015 7:53 PM | Last Updated on Mon, Aug 13 2018 8:10 PM
Advertisement
Advertisement