isro achievements
-
ISRO: ప్రోబా-3 మిషన్ సక్సెస్
-
ఇస్రో వేల కోట్లు సంపాదన.. కేంద్ర మంత్రి ఏమన్నారో తెలుసా?
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) అంతరిక్ష రంగంలో బలమైన శక్తిగా ఎదుగుతోంది. వివిధ రకాల వాహక నౌకలను రూపొందించి అద్భుతాలు సృష్టిస్తోంది. ఉపగ్రహ సేవలు, వాణిజ్య పరంగా ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టడంలో రికార్డులు నెలకొల్పుతోంది. అంతరిక్ష వాణిజ్యంలో ఇతర దేశాలు, ప్రైవేటు సంస్థలతో పోటీపడుతూ వరుస విజయాలను నమోదు చేస్తోంది. గడచిన 4-5 ఏళ్ల కాలంలో భారత అంతరిక్ష పరిశోధన రంగంలో పెను మార్పులు జరిగాయి. అయితే తాజాగా జరిగిన ఓ సమావేశంలో ఇస్రో ఎలా డబ్బు సంపాదిస్తుందో కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. భారత శాస్త్రవేత్తలు ప్రతిభ, సామర్ధ్యం, ప్యాషన్‌తో పనిచేస్తున్నారని జితేంద్ర సింగ్ అన్నారు. గతంలో వారికి సరైన ప్రోత్సాహం లేకపోవడం వల్ల పురోగతి కుంటుపడిందన్నారు. మోదీ రాకతో ప్రైవేట్ మార్గాల నుంచి పెట్టుబడులు పెరుగుతున్నాయని చెప్పారు. యునైటెడ్ స్టేట్స్, రష్యా వంటి ఇతర దేశాలకు ఉపగ్రహాలను ప్రయోగించడం ద్వారా వచ్చే ఆదాయం గురించి మాట్లాడారు. నాసాకు సగం వనరులు ప్రైవేట్ పెట్టుబడుల నుంచి వస్తున్నాయని తెలిపారు. ప్రస్తుతం ఇస్రో సైతం దాదాపు రూ.1000 కోట్ల ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించినట్లు చెప్పారు. ప్రైవేట్ అంతరిక్ష ప్రయోగాల్లో భారత పురోగతిని నొక్కిచెప్పారు. ఇండియా నుంచి ఇస్రో.. అమెరికా, రష్యాలకు చెందిన ఉపగ్రహాలను విజయవంతంగా తక్కువ ఖర్చుతో కక్ష్యలోకి ప్రవేశపెడుతోంది. దాంతో డబ్బు సమకూరుతుందని తెలిపారు. వాణిజ్య ప్రయోగాల ద్వారా ఇతర దేశాల శాటిలైట్లను ప్రయోగించి ఇస్రో ఇప్పటి వరకు రూ.4,000 కోట్లకు పైగా సంపాదించినట్లు మంత్రి వెల్లడించారు. ఈ క్రమంలో అనేక దేశాలకు చెందిన దాదాపు 430 ఉపగ్రహాలను ప్రయోగించినట్లు చెప్పారు. ఇస్రో ఇప్పటి వరకు ఆస్ట్రేలియా, బ్రెజిల్, ఫ్రాన్స్, ఇజ్రాయెల్, జపాన్, మలేషియా, సింగపూర్, యునైటెడ్ కింగ్డమ్, యూఎస్ఏ వంటి దేశాలకు సర్వీసులు అందించిందని వివరించారు. యూరోపియన్ దేశాల నుంచి రూ.2,635 కోట్లు, అమెరికా నుంచి రూ.1,417 కోట్లు సంపాదించినట్లు సింగ్ చెప్పారు. ఇదీ చదవండి: అంబానీ వాటిని పట్టించుకోరు: విజయ్ కేడియా గగన్‌యాన్ మిషన్ 2025 ప్రారంభంలో మానవరూప రోబోట్‌ను అంతరిక్షంలోకి పంపేందుకు సిద్ధంగా ఉందని సింగ్ వెల్లడించారు. 2047లో ప్రతిష్టాత్మకమైన 'డీప్ సీ మిషన్' గురించి సింగ్ మాట్లాడారు. హిమాలయ, సముద్రయాన్ వంటి మిషన్ల ద్వారా హిందూ మహాసముద్రం నుంచి ఖనిజాలను వెలికితీసే ప్రణాళికల గురించి వివరించారు. -
చంద్రుడిపై అడుగుపెట్టిన ప్రజ్ఞాన్ రోవర్.. ఇస్రో ఫొటోలు రిలీజ్
న్యూఢిల్లీ: భారతదేశం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్-3 ప్రయాణంలో తదుపరి దశ ఆవిష్కృతమైంది. విక్రమ్ ల్యాండర్ నుండి ప్రజ్ఞాన్ రోవర్ విజయవంతంగా చంద్రుడిపై కాలుమోపింది. ఈ దృశ్యాలను ఇస్రో తన ఎక్స్(ఒకప్పుడు ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేసింది. బుధవారం నిర్ణీత సమయంలోనే చంద్రుడిపై విజయవంతంగా అడుగుపెట్టిన చంద్రయాన్-3 ప్రయోగం మలిదశకు చేరుకుంది. కోట్లాది భారతీయుల కలల్ని సాకారం చేస్తూ జాబిల్లిని ముద్డడాడిన చంద్రయాన్-3 ల్యాండర్ ఆరోజే చంద్రుడి ఉపరితలాన్ని ఫోటోలు తీయాగా వాటిని ఇస్రో సంస్థ సోషల్ మీడియాలో పొందుపరచింది. ఇక ఈ రోజు ల్యాండర్ నుండి ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుడిపై అడుగు పెట్టిన దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. "చంద్రయాన్-3 రోవర్ చంద్రుడి ఉపరితలంపై ఎలా అడుగుపెట్టిందో చూడండి.." అని రాసింది ఇస్రో సంస్థ. ... ... and here is how the Chandrayaan-3 Rover ramped down from the Lander to the Lunar surface. pic.twitter.com/nEU8s1At0W — ISRO (@isro) August 25, 2023 ఇప్పటివరకు మూడు దేశాలు మాత్రమే చంద్రుడిపై అడుగు మోపగా నాలుగో దేశంగా భారత దేశం అక్కడికి చేరుకొని చరిత్ర సృష్టించింది. విక్రమ్ ల్యాండర్ నుంచి బయటకు వచ్చిన ప్రజ్ఞాన్ రోవర్ లోని రెండు పరికరాలు, ల్యాండర్‌లోని మూడు పరికరాలు ILSA, RAMBHA,ChaSTE సక్రమంగానే పనిచేస్తున్నాయని అది చంద్రుడిపై తిరుగుతూ పరిశోధనల ప్రారంభించిందని తెలిపారు ఇస్రో శాస్త్రవేత్తలు. రోవర్లో అమర్చిన రెండు పరికరాలు ప్రధానంగా చంద్రుని మట్టిలో మూలకాలు, రసాయనాలను నిశితంగా పరిశీలిస్తాయని తెలిపింది ఇస్రో. Chandrayaan-3 Mission: All activities are on schedule. All systems are normal. 🔸Lander Module payloads ILSA, RAMBHA and ChaSTE are turned ON today. 🔸Rover mobility operations have commenced. 🔸SHAPE payload on the Propulsion Module was turned ON on Sunday. — ISRO (@isro) August 24, 2023 ఇది కూడా చదవండి: ప్రధాని మోదీ తిరుగు ప్రయాణంలో మార్పులు.. -
జయహో! రాకెట్ వుమన్ ఆఫ్ ఇండియా రీతు కరిధాల్
చంద్రయాన్-3 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంతో దేశవ్యాప్తంగా ఆనందోత్సాహాలు వెల్లువెత్తాయి. శుక్రవారం (జూలై 14) మధ్యాహ్నం 2.35 గంటలకు శ్రీహరికోట నుంచి ప్రయోగించిన చంద్రయాన్-3 తొలిదశ విజయవంతమైంది. అత్యంత ప్రతిష్టాత్మక మూన్ మిషన్‌కు చంద్రయాన్-3ని చేరువ చేసేందుకుద్దేశించిన బాహుబలి రాకెట్ మొత్తం మూడు దశలనూ దాటుకుని రాకెట్ కక్ష్యలోకి దూసుకెళ్లింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇస్రో ఘనత, శాస్త్రవేత్తలపై అభినందలు ప్రకటించారు. (తొలి కంప్యూటర్ అందించిన టెక్ దిగ్గజం, బిలియనీర్ ఎవరో తెలుసా? ) ప్రపల్షన్ మాడ్యూల్ రాకెట్ నుంచి విడిపోయి,చంద్రయాన్ 3 ఉపగ్రహం చంద్రుడి వైపుగా తన ప్రయాణాన్ని మొదలు పెట్టిందని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ శుక్రవారం ప్రకటించారు. చంద్రయాన్-3 ని ఎల్వీఎం 3 రాకెట్ ద్వారా భూ కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టామంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. 24 రోజుల పాటు ఇది భూమి చుట్టూ ప్రదక్షిణలు చేయనుంది. ఆగస్టు 23 లేదా 24 న చంద్రుడి ఉపరితలంపై ల్యాండ్ అవుతుందని ఇస్రో అంచనా వేస్తోంది. మరోవైపు ఈకీలక ప్రయోగం వెనుక ఉన్న కీలక శక్తి ఒక మహిళగా ఉండటం విశేషంగా నిలుస్తోంది. యూపీలో లక్నోలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. స్పేస్ పట్ల అభిరుచి, అంతరిక్ష కార్యకలాపాలకు సంబంధించిన వార్తా కథనాలను సేకరించే ఆసక్తి, వీటన్నింటికీ సవాల్‌ను స్వీకరించే నైజం ఆమెను విజయ తీరాలను చేర్చింది. చిన్న వయస్సులోనే అంతరిక్ష శాస్త్రంపై ఉన్న మక్కువ నవంబర్ 1997లో ఇస్రోలో చేరడంతో ఆమె కల నెర వేరింది. తాజా విజయంతో యావద్దేశం గర్వపడేలా చేశారు. సంబరాల్లో కుటుంబం: చంద్రయాన్ 2 ప్రాజెక్టు సఫలం కావడంతో రీతు కరిధాల్ కుటుంబం సంబరాల్లో మునిగిపోయింది. ఈ ఆనంద క్షణాలను స్వీట్లు పంచుతూ సెలబ్రేట్ చేసుకుంది. ఇది చాలా సంతోషకరమైన క్షణం, సోదరిని చూసి చాలా గర్వపడుతున్నాను అంటూ రీతూ కరిధాల్ సోదరుడు రోహిత్ కరిధాల్ ఆనందాన్ని ప్రకటించారు. (DelhiFloods: మూడు రోజుల్లో రూ.200కోట్లు నష్టం, ఇండస్ట్రీ కీలకహెచ్చరికలు) #WATCH | Lucknow: Chandrayaan-3 mission director Ritu Karidhal's family celebrates, and distributes sweets as ISRO's LVM3 M4 vehicle successfully launched it into orbit. Chandrayaan-3, in its precise orbit, has begun its journey to the Moon. pic.twitter.com/qcalBIjjN7 — ANI (@ANI) July 14, 2023 #WATCH |ISRO chief S Somanath and the team behind #Chandrayaan3 share their delight after the LVM3 M4 vehicle successfully launched it into orbit. "Chandrayaan-3, in its precise orbit, has begun its journey to the Moon. Health of the Spacecraft is normal," says ISRO. pic.twitter.com/cRlegcsgHI — ANI (@ANI) July 14, 2023 రాకెట్ విమన్ ఆఫ్ ఇండియా రీతు కరిధాల్ శ్రీవాస్తవ, ఇంట్రస్టింగ్ సంగతులు ⇒ చంద్రయాన్ 3 మిషన్‌కు ఇస్రో శాస్త్రవేత్త , లక్నోకుచెందిన రీతూ కరిధాల్ శ్రీవాస్తవ నాయకత్వం వహించారు. ⇒ చిన్నప్పటినుంచి అంతరిక్షం అంటే ఆసక్తి, పలు నేషనల్, ఇంటర్నేషనల్ జర్నల్స్ లో ఆమె 20కి పైగా పేపర్స్ ను పబ్లిష్ చేశారు. ⇒ ఇస్రో వర్గాల్లో రాకెట్ విమన్ ఆఫ్ ఇండియాగాపాపులర్ లక్నో యూనివర్సిటీ నుంచి ఫిజిక్స్‌లో ఎంఎస్సీ చేశారు. ఆ తర్వాత బెంగళూరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ ⇒ రీతూ 1997 నుండి ISROలో పని చేస్తున్నారు. ⇒ చంద్రయాన్- 2 ప్రాజెక్టుకు మిషన్ డైరెక్టర్ కూడా ⇒ మంగళ్ యాన్’ప్రాజెక్టుకు డిప్యూటీ ఆపరేషన్స్ డైరెక్టర్‌గా సేవలు. ⇒ మాజీ రాష్ట్రపతి, మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చేతుల మీదుగా ‘ ఇస్రో యంగ్ సైంటిస్ట్’ అవార్డు ⇒ మంగళయాన్ ప్రాజెక్టు కోసం చేసిన కృషికి గానూ 2015 లో ఇస్రో టీమ్ అవార్డ్ ⇒ 2017లో విమన్ అచీవర్స్ ఇన్ ఏరోస్పేస్ పురస్కారం ⇒ కరిధాల్‌కు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో ఇస్రో విజయాలు
చేబ్రోలు, న్యూస్‌లైన్ : పేద, మధ్య తరగతి కుటుం బాల నుంచి వచ్చిన మన దేశంలోని ఇంజనీర్లతో, పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో ఇస్రో విజయాలు సాధిస్తోం దని శ్రీహరికోట షార్ డెరైక్టర్ ఎం.వై.ఎస్.ప్రసాద్ చెప్పారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీలో రెండు రోజులు జరిగిన జాతీయ యువజనోత్సవాలు, విజ్ఞాన్ మహోత్సవ్-2014 శనివారం ఘనంగా ముగిశాయి. వివిధప్రాంతాల నుంచి 20 వేల మంది విద్యార్థులు హాజరైన ఈ ఉత్సవాల ముగింపు సభలో షార్ డెరైక్టర్ మాట్లాడుతూ 50 ఏళ్ల కిందట అమెరికా, రష్యా, ప్రాన్స్ల సహకారంతో ఒక చిన్న రాకెట్‌ను ప్రయోగించిన ఇస్రో అద్వితీయ ప్రగతి సాధించిందన్నారు. ప్రస్తుతం ఇస్రో ఫ్రాన్స్‌కు చెందిన రెండు శాటిలైట్లను రూ.120 కోట్లు తీసుకుని ప్రయోగించిందన్నారు. మరొకటి ఈ సంవత్సరం ప్రయోగించనుందన్నారు. ఇస్రో విజయం ఒక రోజుతోనో, ఒక వ్యక్తి కృషితోనో వచ్చింది కాదని, వేలాదిమంది ఇస్రో సిబ్బంది సమష్టి కృషితోనే విజయం సాధించామని చెప్పారు. ఐడిల్‌బ్రెయిన్.కామ్ ఎడిటర్ జి.వి.రమణ మాట్లాడుతూ విద్యార్థులు చదువులోనే కాదు.. జీవితంలోనూ రాణించాలని, కెరీర్లో దూసుకుపోవాలని సూచించారు. ఇంటర్మీడియట్ కోర్సు జీవితంలో టర్నింగ్ పాయింట్ అన్నారు. మనకు ఇష్టమున్న రంగంలోనే కెరీర్‌ను ప్రారంభించాలని సూచించారు. సినీ హీరో, విజ్ఞాన్ పూర్వ విద్యార్థి నారా రోహిత్ మాట్లాడుతూ జీవితంలో రాజీ పడవద్దని, అనుకున్న రంగంలో కృషిచేసి విజయాలను సాధించాలని పిలుపునిచ్చారు.